Actress Ranya Rao: 'పెళ్లైన నెల నుంచే మేం విడిగా ఉంటున్నాం' - కోర్టులో రన్యారావు భర్త కామెంట్స్, అరెస్ట్ నుంచి మినహాయింపు
Actress Ranya Rao: బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు భర్త జతిన్ హుక్కేరికి కోర్టు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. తాము పెళ్లైన నెల నుంచి విడిగా ఉంటున్నామని ఆయన కోర్టుకు తెలిపారు.

Actress Ranya Rao's Husband Says They Are Seperated With In One Month After Marriage: దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చారనే ఆరోపణలతో కన్నడ నటి రన్యారావు (Ranya Rao) అరెస్టైన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె భర్త జతిన్ హుక్కేరికి సంబంధించిన 9 ప్రదేశాల్లో డీఆర్ఐ అధికారులు సోదాలు చేశారు. దీంతో తనను అరెస్ట్ చేయకుండా చూడాలంటూ జతిన్.. కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు.
'పెళ్లైన నెల నుంచే విడిగా ఉంటున్నాం'
తాము పెళ్లైన నెల నుంచే విడిగా ఉంటున్నామని జతిన్ హుక్కేరి (Jatin Hukkeri) కోర్టుకు తెలిపారు. 'రన్యారావుతో నాకు గతేడాది నవంబరులో వివాహం జరిగింది. అయితే, డిసెంబర్ నుంచే మేమిద్దరం విడివిడిగా ఉంటున్నాం. మేము అధికారికంగా విడిపోలేదు. కొన్ని కారణాల వల్ల మాత్రమే వేర్వేరుగా జీవిస్తున్నాం.' అని చెప్పారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలంటూ ఆయన తరఫు లాయర్ కోర్టును కోరారు.
కాస్త రిలీఫ్..
ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం జతిన్ హుక్కేరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది. ఈ నెల 24వ తేదీ వరకూ అరెస్ట్ చెయ్యొద్దంటూ తమ ఆదేశాల్లో పేర్కొంది. దీనిపై స్పందించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు అతనికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు.
Also Read: కన్నప్ప 'మహాదేవశాస్త్రి' వచ్చేస్తున్నారు - థర్డ్ సింగిల్ ఎప్పుడో తెలుసా?
4 నెలల కిందటే వివాహం
అయితే, నాలుగు నెలల కిందటే నటి రన్యారావు, జతిన్ హుక్కేరిల వివాహం జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, స్నేహితుల మధ్య 5 స్టార్ హోటల్ తాజ్ వెస్ట్ ఎండ్‌లో వీరి పెళ్లి గతేడాది నవంబర్‌లో జరిగింది. వీరి పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆ తర్వాత ఈ కపుల్ ల్యావెల్లీ రోడ్డులోని ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. జతిన్ హుక్కేరి.. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేయగా.. ప్రస్తుతం ఇంటీరియర్ డిజైనర్‌గా.. నగరంలో ఓ ప్రముఖ రెస్టారెంట్ యజమానిగా కొనసాగుతున్నారు. తన బిజినెస్ ఇతర ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించుకున్న టైంలోనే రన్యారావును బంగారం స్మగ్లింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.
రన్యారావు ఇంట్లోనూ సోదాలు..
మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు నటి రన్యారావు నుంచి రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల విదేశీ బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె తరచూ దుబాయ్ వెళ్లి వస్తుండడంతో నిఘా వేసిన అనంతరం బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారని గుర్తించి అరెస్ట్ చేశారు. తరచూ దుబాయ్ వెళ్లొస్తూ గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో దాచి తీసుకొచ్చేవారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఆమె నివాసంలో జరిపిన దాడిలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆమె పెద్ద స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో భాగమని భావిస్తోన్న అధికారులు దీనిపై మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరప్పన అగ్రహార జైలులో ఉంది.
భర్త క్రెడిట్ కార్డుతో..
కేసు విచారణలో సంబంధం ఉన్న వారిని గుర్తించేందుకు అధికారులు లోతైన దర్యాప్తు చేస్తుండగా.. రన్యారావు దుబాయ్ వెళ్లేందుకు తన భర్త జతిన్ క్రెడిట్ కార్డు నుంచి టికెట్లు బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో అతనికి కూడా సంబంధం ఉండొచ్చనే అనుమానంతో సోదాలు చేపట్టారు. దీంతో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోర్టును ఆశ్రయించగా జతిన్‌కు ఊరట లభించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

