Bhadrachalam Talambralu 2025: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది - భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు బుకింగ్ ఇలా ఈజీగా చేసుకోండి!
Bhadrachalam Swamy Talambralu Delivery : భద్రాచలం సీతారాముల కల్యాణానికి నేరుగా వెళ్లలేదంటూ బాధపడాల్సిన అవసరం లేదు. రాములోరి కల్యాణ తలంబ్రాలు నేరుగా మీ ఇంటికొచ్చేస్తాయ్..ఎలా అంటే..

Ram Navami 2025 Bhadrachalam Swamy Talambralu Delivery : ఏటా శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 06 ఆదివారం శ్రీరామ నవమి వచ్చంది.
సీతారాముల కల్యాణానికి భద్రాచలం వెళ్లలేని భక్తులకు తలంబ్రాలు అందించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆన్ లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
https://bhadradritemple.telangana.gov.in/mt_bookings/?ssid=153 ...
ఈ లింక్ క్లిక్ చేస్తే దేవస్థానంవారిది ముత్యాల తలంబ్రాల పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్, అడ్రస్ డీటేల్స్ ఎంటర్ చేయాలి.
ఈ సైట్ ద్వారా తలంబ్రాలు ప్యాకెట్లు బుకింగ్ చేసుకున్నవారికి.. దాదాపు రెండు వారాల్లో తలంబ్రాలు అందుతాయి.
పోస్టల్ లేదా కొరియర్ ఆలస్యాలకు ఆలయం బాధ్యత వహించదని ముందుగానే స్పష్టం చేశారు.
ఇందుకోసం కేవలం 60 రూపాయలు చెల్లిస్తే చాలు.
ఈ సేవలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భక్తులకు మాత్రమే ప్రారంభించారు. వెబ్ పోర్టల్ లో ఏదైనా మండలం కానీ గ్రామం కానీ తప్పిపోయినట్టైతే eo_bhadrachalam@yahoo.co.in కు మెయిల్ చేయని దేవస్థాన అధికారులు సూచించారు.
మరోవైపు శ్రీరామచంద్రుడి తలంబ్రాలు భక్తుల ఇళ్లకు చేర్చాలని TGSRTC యాజమాన్యం కూడా నిర్ణయించింది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా భక్తులకు కల్యాణ తలంబ్రాలను హోం డెలివరీ చేయనున్నారు. అందుకోసం భక్తులు ముందుగా సంస్థ వెబ్‌సైట్ tgsrtclogistics.co.in లో 151 రూపాయలు చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భద్రాద్రిలో ఏప్రిల్ 6న వైభవంగా జరిగే కల్యాణోత్సవంలో పాల్గొనలేని భక్తులు ఈ సేవలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు సంస్థ ఎండీ సజ్జనార్. ఆన్ లైన్లో బుక్ చేసుకోనివారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. TGSRTC మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని చెప్పారు. ఈ మేరకు TGSRTC కాల్ సెంటర్ 040-69440069, 040-69440000 నంబర్లకు కాల్ చేయాలని సజ్జనార్ సూచించారు.
మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకూ జరగనన్న శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 6 ఆదివారం కల్యాణోత్సవం, ఏప్రిల్ 7 సోమవారం పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ వేడుకలను నేరుగా చూసి ఆనందించాలి అనుకునే భక్తుల కోసం దేవస్థానం టికెట్లు విక్రయిస్తోంది. https://bhadradritemple.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి వీటిని బుక్ చేసుకోవచ్చు.
రూ.7,500 టికెట్ పై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. స్వామివారి శేష వస్త్రాలైన చీర, పంచె, 400 గ్రాముల కల్యాణ లడ్డూ, కల్యాణ తలంబ్రాల ప్యాకెట్, రామాయణ పుస్తకం అందిస్తారు. అదే రోజున ప్రధాన ఆలయంలో కొలువైన సీతారాములను దర్శించుకోవచ్చు.
2,500, 2,000, 1,000, 300, 150 టికెట్లు తీసుకున్నవారికి ఆ ధరకు సంబంధించిన విభాగంలో ఒక్కొక్కరికి ప్రవేశం ఉంటుంది.
ఆన్‌లైన్‌లో 5 వేలు చెల్లిస్తే పరోక్ష పూజ నమోదు చేసుకునేవారికి కండువా, జాకెట్ ముక్క, ముత్యాల తలంబ్రాలు, పటిక బెల్లం పంపిస్తారు. 1,116 చెల్లించిన వారికి ముత్యాల తలంబ్రాల ప్యాకెట్, పటిక బెల్లం ప్రసాదం పంపిస్తారు.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

