MS Dhoni Add With Sandeep Reddy Vanga | ధోనితో యానిమల్ రీ క్రియేట్ చేసిన VanGOD | ABP Desam
స్పిరిట్ రావటానికి ఇంకా టైమ్ ఉంది. ప్రభాస్ సినిమాలతో బిజీ కాబట్టి సరదాగా ఓ యాడ్ షూట్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అయితే ఎవరితోనో చేసుంటే పెద్ద మ్యాటర్ అయ్యుండేది కాదేమో. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని తో యాడ్ చేశాడు. అది కూడా నార్మల్ యాడ్ కాదు. సందీప్ రెడ్డి రీసెంట్ సెన్సేషన్ యానిమల్ సినిమా రీ క్రియేట్ చేశాడు. ఏ సీన్స్ తో అయితే రణ్ బీర్ కపూర్ యాక్టింగ్ కి హ్యూజ్ అప్లాజ్ వచ్చిందో అవే సీన్స్ ని ధోనితో రీ క్రియేట్ చేశాడు వంగోడ్. పైగా బాగా కాంట్రవర్సీ అయిన ఈ గెస్చర్ ని ధోనితో మళ్లీ చేయించాడు. అయితే సరదాగా నే ఎండింగ్ ఇచ్చాడు. ఇదో ఎలక్ట్రిక్ సైకిల్ యాడ్ కానీ ధోని, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ అస్సలు ఊహించని మ్యూచువల్స్ మాత్రం సోషల్ మీడియాను తగలబెట్టేస్తున్నారు. పైగా ఐపీఎల్ సీజన్ కదా...సీఎస్కే ఫ్యాన్స్ అంతా మంచి ఆకలి మీదున్నారు.





















