Kamal Haasan: 'థగ్ లైఫ్' యాక్టర్స్ భవిష్యత్‌లో గొప్ప స్టార్స్' - మల్టీ స్టారర్‌కు సరికొత్త అర్థం చెప్పారన్న కమల్ హాసన్
Thug Life Movie: అగ్ర నటులు, యువ నటులు కలబోతగా సినిమా తీయాలన్నదే మణిరత్నం ఆలోచన అని సీనియర్ హీరో కమల్ హాసన్ అన్నారు. 'థగ్ లైఫ్' మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Kamal Haasan's Shares Interesting Fact About Thug Life Movie: అగ్రహీరో కమల్ హాసన్ (Kamal Haasan), స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Maniratnam) కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'థగ్ లైఫ్' (Thug Life). ఈ మూవీతో మల్టీస్టారర్‌కు దర్శకుడు మణిరత్నం సరికొత్త అర్థం చెప్పబోతున్నారని కమల్ హాసన్ అన్నారు. ఇటీవల జరిగిన ఎఫ్‌సీసీఐ ఈవెంట్‌లో ఆయన ఈ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
'ఇందులో యాక్టర్స్ భవిష్యత్తులో పెద్ద స్టార్స్'
గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా 'థగ్ లైఫ్' తెరకెక్కుతుండగా.. ఈ మూవీలో చేస్తున్న నటీనటులు భవిష్యత్తులో పెద్ద స్టార్స్ అవుతారని కమల్ హాసన్ అన్నారు. 'అగ్ర నటులు, యువ నటులు కలబోతగా మూవీ తీయాలన్నది మణి ఆలోచన. ఈ ఐడియాను నాతో పంచుకున్న వెంటనే నాకూ నచ్చింది. అందుకే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. మూవీలోని అనేక పాత్రల్లో మలయాళం, హిందీ, తెలుగు సినిమాల్లోని విలక్షణ నటులు ఆయా పాత్రల్లో కనిపిస్తారు. అద్భుత ప్రతిభ కలిగిన నటులు మనకు ఉన్నారు. ప్రతి ఒక్కరికీ ఒక్కో టాలెంట్ ఉంది. అది వారికే సొంతం.' అని కమల్ తెలిపారు.
Also Read: 'మా నాన్న చనిపోయినప్పుడు నాకు ఏడుపు రాలేదు' - తమన్ ఎమోషనల్, ఆయన ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
జూన్ 5న సినిమా రిలీజ్
థగ్ లైఫ్‌లో కమల్ హాసన్ రెండు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ విడుదల కాగా హైప్ పెంచేసింది. స్టన్నింగ్ విజువల్స్‌తో పాటు కమల్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటొన్న మూవీ సమ్మర్ కానుకగా జూన్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో శింబు, త్రిష, నాజర్, అభిరామి, అశోక్ సెల్వన్, జోజూజార్జ్, మహేశ్ మంజ్రేకర్, ఐశ్వర్య లక్ష్మి, అలీ ఫజల్ వైయాపురి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
1997లో కమల్ హాసన్ - మణిరత్నం కాంబోలో వచ్చిన 'నాయకన్' మూవీ తెలుగులో నాయకుడు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అప్పట్లో కల్ట్ క్లాసిక్‌గా పేరొందింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి 'థగ్ లైఫ్' కోసం కలిసి వర్క్ చేస్తున్నారు. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.





















