Thaman: 'మా నాన్న చనిపోయినప్పుడు నాకు ఏడుపు రాలేదు' - తమన్ ఎమోషనల్, ఆయన ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
Thaman Emotional: తన 11 ఏళ్ల వయసు నుంచే కష్టపడడం నేర్చుకున్నానని.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు. ఓ ఆంగ్ల మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషన్ అయ్యారు.

Thaman Shares About His Childhood Struggles: తనకు 11 ఏళ్ల వయసు నుంచే తాను వర్క్ చేయడం ప్రారంభించానని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) చెప్పారు. ఓ ఆంగ్ల మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన సవాళ్లు.. తన ఫస్ట్ రెమ్యునరేషన్ వంటి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన తండ్రి గురించి చెబుతూ ఎమోషన్ అయ్యారు.
'అప్పుడు నాకు ఏడుపు రాలేదు'
తనకు 11 ఏళ్ల వయసులోనే తన తండ్రి మరణించారని తమన్ చెప్పారు. 'మా నాన్న చనిపోయినప్పుడు మా చెల్లెలు రెండో తరగతి చదువుతోంది. ఆయన మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకొచ్చినప్పుడు నా కంటి వెంట ఒక్క చుక్క నీరు రాలేదు. అందరూ ఏడుస్తున్నా.. నేను మాత్రం ఏడవలేదు. అమ్మను, చెల్లిన ఎలా చూసుకోవాలనే ఆలోచనలో ఉండిపోయాను. అంత చిన్న వయసులో అంత పరిణతి ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ రోజు మా కుటుంబాన్ని పరామర్శించేందుకు శివమణి వచ్చారు.' అని తెలిపారు.
'ఆ డబ్బులతో మ్యూజిక్ ఇన్స్‌ట్రుమెంట్స్ కొన్నా'
మా నాన్నకు వచ్చిన ఎల్ఐసీ డబ్బులు మా అమ్మ తనను నమ్మి ఇచ్చిందని.. వాటితో మ్యూజిక్ ఇన్స్‌ట్రుమెంట్స్ కొన్నట్లు తమన్ చెప్పారు. 'నా 11 ఏళ్ల వయసు నుంచే నాకు ఎంతో ఇష్టమైన మ్యూజిక్‌పై దృష్టి పెట్టాను. బాలు గారు, శివమణితో పాటు ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది నాకు సాయం చేశారు. అదంతా మా నాన్న మంచితనం. ఇప్పుడు మా అమ్మ వయసు 74 ఏళ్లు. ఆమెను కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నా.' అని తమన్ చెప్పారు.
ఆ సినిమాకు రూ.30..
ఏ రంగంలోనైనా అనుభవంతోనే ఏదైనా సాధ్యమవుతుందని తమన్ అన్నారు. బాలకృష్ణ నటించిన 'భైరవద్వీపం' సినిమాకు డ్రమ్స్ వాయించినందుకు తనకు రూ.30 ఇచ్చినట్లు తమన్ చెప్పారు. 'మజిలీ' వంటి ఫీల్ గుడ్ మూవీస్‌కు వారం రోజుల్లోనే సంగీతం అందించినట్లు చెప్పారు. తాను ఏ పాటనైనా కచ్చితంగా కోట్లలో వ్యూస్ రావాలనే ఉద్దేశంతో వర్క్ చేయనని.. మంచి సంగీతం అందించాలనే వంద శాతం ప్రయత్నిస్తానని అన్నారు. ఓ మెలోడి సాంగ్‌కు అత్యధికంగా 100 మిలియన్ వ్యూస్ వస్తాయని అందరూ అనుకుంటారని కానీ.. ఒక్కోసారి అంతుకు మించిన వ్యూస్ రావొచ్చని చెప్పారు.
నా కెరీర్‌లో అదే కష్టమైన సాంగ్
ఇప్పటివరకూ తన కెరీర్‌లో 170 సినిమాలకు సంగీతం అందించినట్లు తమన్ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత' సినిమాలో పెనిమిటీ సాంగ్ కంపోజ్ చేసేందుకు చాలా కష్టపడ్డానని అన్నారు. ఇన్నేళ్ల తన కెరీర్‌లో ఇదే కష్టమైన పాట అని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజి బిజీగా ఉన్నారు. ఆయన రీసెంట్‌గా సంగీతం అందించిన బాలకృష్ణ 'డాకు మహారాజ్' మూవీ బీజీఎంకు థియేటర్లు దద్దరిల్లాయి.
ఆయన చేతిలో ప్రభాస్ - మారుతి కాంబోలో తెరకెక్కుతున్న 'రాజా సాబ్', పవన్ కల్యాణ్ - సుజూత్ 'ఓజీ' వంటి బడా ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలకు సైతం తమన్ సంగీతం అందిస్తున్నారు. వీటితో పాటే ఆయన లేటెస్ట్‌గా ఓ మూవీలో సైతం నటిస్తున్నారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత తమన్ 'ఇదయమ్ మురళి' (Idhayam Murali) అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో అథర్వ మురళి లీడ్ రోల్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

