Dhurandhar 2 OTT : ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Dhurandhar 2 OTT Platform : రణవీర్ సింగ్ 'ధురంధర్ 2' రిలీజ్‌కు ముందే బిగ్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో ఓటీటీ డీల్, స్ట్రీమింగ్ డేట్‌పైనా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Ranveer Singh's Dhurandhar 2 OTT Release Date Locked : బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. గతేడాది బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన 'ధురంధర్'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టించగా... ఓటీటీ రిలీజ్‌పైనా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఓటీటీలోకి ధురంధర్ 2 ఎప్పుడంటే?
సాధారణంగా బాలీవుడ్ మూవీస్ ఏవైనా థియేటర్లలోకి వచ్చిన దాదాపు 8 వారాల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతాయి. 'ధురంధర్' ఫస్ట్ పార్ట్ ఇప్పటికే ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక 'ధురంధర్ 2' డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' సొంతం చేసుకుంది.
ఓటీటీ డీల్ ప్రకారం దాదాపు 2 నెలల తర్వాత అంటే మే 14న ధురంధర్ 2 ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ పార్ట్ కేవలం హిందీలో మాత్రమే రాగా... సెకండ్ పార్ట్ హిందీతో పాటు సౌత్ ఇండియన్ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. అదే భాషల్లో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. మూవీ రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత అఫీషియల్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
Also Read : ప్రియుడిని పెళ్లాడిన కుంభమేళా మోనాలిసా - పోలీసులను ఆశ్రయించి మరీ...
ఒక్క రోజులోనే...
ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్ల పేరుతో వేస్తున్న షోలకు ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో టికెట్స్ సేల్ అయ్యాయి. ఒక్క రోజులోనే 80 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో దాదాపు రూ.20 కోట్లు వసూలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయితే కలెక్షన్స్ మరింత పెరగొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో బాలీవుడ్ మూవీ 'స్త్రీ 2' అడ్వాన్స్ బుకింగ్స్ టైంలో రూ.10 కోట్ల వసూళ్లు సాధించగా... ఆ రికార్డును 24 గంటల్లోనే ధురంధర్ 2 అధిగమించింది.
ట్రైలర్ రిలీజ్
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్, వయలెన్స్‌తో పాటు ఎమోషనల్ డ్రామాకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జస్కిరాత్ సింగ్ రాంగి (రణవీర్) భారత్‌లో ఉండగా ఎందుకు జైలుకెళ్లాడు? అజయ్ సన్యాల్ (ఆర్ మాధవన్) అతని పేరును హమ్జాగా మార్చి ఎందుకు గూఢచారిగా ఎంపిక చేశాడు? ఇండియాపై కుట్రలు చేస్తున్న మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్)ను ఎలా మట్టుబెట్టాడు? రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా) డెత్ తర్వాత ల్యారీని హమ్జా ఎలా తన గుప్పిట్లోకి తీసుకున్నాడు? అనే ప్రశ్నలకు ధురంధర్ 2లో ఆన్సర్ దొరకనుంది.
ఈ సినిమాలో రణవీర్‌తో పాటు బాలీవుడ్ లెజెండ్స్ అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మలయాళ స్టార్ ఆర్ మాధవన్, సారా అర్జున్, అర్జున్ రాంపాల్, నవీన్ కౌశిక్, రాకేశ్ బేడీ, డానిష్ పండోరా తదితరులు కీలకపాత్రలు పోషించారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















