Sunita Williams Return To Earth | International Space Station నుంచి బయలుదేరిన సునీతా విలియమ్స్ | ABP Desam
తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే చిక్కుకుపోయి నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమన్స్ ను భూమి మీదకు తీసుకువచ్చే ప్రక్రియలో మొదటి దశ విజయవంతం అయ్యింది. హ్యాచ్ క్లోజ్ గా పిలుచుకునే ఈ దశలో క్రూ 9లోని సునీతా విలిమయ్స్ తో పాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లు భూమి మీదకు తిరుగుప్రయాణం అయ్యేందుకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గుడ్ బై చెప్పేశారు. తన జీవితంలో తొమ్మిదినెలల పాటు ఇల్లుగా మారిపోయిన ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ లో సునీత బయలు దేరే ముందు భావోద్వేగానికి లోనయ్యారు. స్పేస్ సూట్ వేసుకునే తన రూమ్ నుంచి బయటకు వచ్చిన సునీత చిన్న ఫోటో చేయించుకున్నారు. నవ్వుతూ, తుళ్లుతూ, ఎమోషనల్ అవుతూ ఫోటోలు దిగారు. బయలుదేరే క్షణంలో భావోద్వేగానికి లోనైనట్లు కనిపించారు. ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తూ తన టీమ్ తో భూమి మీద ప్రయాణం కోసం డ్రాగన్ క్యాప్స్లూలో కి ప్రవేశించారు. ఆస్ట్రోనాట్లు నలుగురు తమ సీట్లలో సెటిల్ అయిన తర్వాత ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ తలుపులు మూసేయటంతో హ్యాచ్ క్లోజ్ అనే మొదటి దశ విజయంవంతంగా పూర్తైంది. మూడు గంటల నిరీక్షణ అనంతరం భూమి మీదకు చేరుకునే ప్రక్రియ రెండో దశ అయిన అన్ డాకింగ్ ప్రారంభం కానుంది.





















