Putin on oil trade with India | చమురు వాణిజ్యంపై క్లారిటీ ఇచ్చిన వ్లాదిమిర్ పుతిన్ | ABP Desam
అమెరికా సహా వివిధ దేశాలు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయొద్దంటూ విధిస్తున్న ఆంక్షలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. భారత్ సహా రష్యాపైనా ఆంక్షలను కొన్ని దేశాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్న పుతిన్ ఎంత ఒత్తిడి వచ్చినా భారత్ కు ఇంధనా సరఫరా ఆపే ప్రసక్తే లేదన్నారు. అవసరమైతే భారత్ అభివృద్ధికి సహకరించటం కోసం చమురు సరఫరాను మరింత పెంచుతామన్నారు పుతిన్. ఇరు దేశాల మధ్య దైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య పలు విభిన్న రంగాల ఇరువురు దేశాధినేతల మధ్య అధికారులు పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఔషధ రంగంలో భారత్ సేవలు రష్యాకు అవసరం అని భావిస్తే, చమురు దిగుమతులు, ఆయుధాల సరఫరాలకు సంబంధించి భారత్ రష్యా తో పలు కీలక ఒప్పందాలకు సంతకాలు చేసింది. పుతిన్, మోదీ భేటీలో ఈ కీలక ఒప్పందాలు జరగటం ప్రాధాన్యతను సంతరించుకుంది.





















