తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను భూమి మీదకు తీసుకువచ్చే ప్రక్రియలో మొదటి దశ విజయవంతమైంది. హ్యాచ్ క్లోజ్‌గా పిలుచుకునే ఈ దశలో క్రూ-9లోని సునీతా విలియమ్స్‌తో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు భూమి మీదకు తిరుగు ప్రయాణం అయ్యేందుకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గుడ్‌బై చెప్పారు.