By: Arun Kumar Veera | Updated at : 19 Mar 2025 04:07 PM (IST)
త్వరలో 4G నుంచి 5Gలోకి.. ( Image Source : Other )
BSNL Recharge Plan Under Rs 1000: తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయోజనాలు అందించే టెలికాం కంపెనీల్లో "భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్" (BSNL) పేరు మొదటి వరుసలో మొదటి స్థానంలో ఉంటుంది. ప్రైవేట్ రంగంలోని రిలయన్స్ జియో (Reliance Jio), భారతి ఎయిర్‌టెల్ (Bharti Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) పోటాపోటీగా రేట్లు పెంచడంతో ఇప్పుడు చాలా మంది BSNL సిమ్ వాడుతున్నారు. ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోలిస్తే, ప్రభుత్వ రంగ సంస్థ BSNL ప్లాన్‌లు చాలా చవగ్గా ఉండడమే దీనికి కారణం. BSNL, ప్రైవేట్ టెలికాం కంపెనీల కంటే తక్కువ ధరలకు ఎక్కువ వాలిడిటీ & ఎక్కువ డేటాతో రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది.
రూ. 1,000 కంటే తక్కువ ధరలో BSNL అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్‌లలో మూడు ప్లాన్‌లు బాగా పాపులర్ అయ్యాయి. వీటిలో 6 నెలల వరకు చెల్లుబాటు (Validity), రోజువారీ డేటా (Daily Data) & అపరిమిత కాలింగ్ (Unlimited Calls) సహా అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయి.
బీఎస్ఎన్ఎల్ రూ. 397 రీఛార్జ్ ప్లాన్ (BSNL Rs 397 Recharge Plan Details)
మీరు దీర్ఘకాలిక చెల్లుబాటుతో కూడిన ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ ప్లాన్ ఆఫర్ ఉపయోగకరంగా ఉంటుంది. 397 ప్లాన్‌లో పూర్తిగా 150 రోజులు, అంటే 5 నెలల చెల్లుబాటు ఉంటుంది. ఈ ప్లాన్‌లో, వినియోగదారులు మొదటి నెల పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒక నెల పూర్తయిన తర్వాత, మిగిలిన 4 నెలల పాటు మీ కనెక్షన్‌ను యాక్టివ్‌గా ఉంటుంది. అయితే, మొదటి నెలలో లభించిన ప్రయోజనాలు మిగిలిన 4 నెలల్లో ఉండవు, వాటి కోసం విడిగా రీఛార్జ్ చేసుకోవాలి.
బీఎస్ఎన్ఎల్ రూ. 897 ప్లాన్ (BSNL Rs 897 Recharge Plan Details)
BSNL 897 ప్లాన్ పూర్తిగా 6 నెలలు, అంటే 180 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. వ్యాలిడిటీ పిరియడ్‌లో వినియోగదారులకు రోజుకు 100 SMSలు & అపరిమిత కాల్స్ అందుబాటులో ఉంటాయి. దేశంలోని ఏ నంబర్‌కైనా వినియోగదారులు అపరిమిత కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఇది కాకుండా, చెల్లుబాటు సమయంలో (6 నెలల కాలానికి) మొత్తం 90 GB డేటా లభిస్తుంది. ఈ పరిమితి పూర్తయిన తర్వాత, డేటాను 40 Kbps వేగంతో యాక్సెస్ చేయవచ్చు.
బీఎస్ఎన్ఎల్ రూ. 997 ప్లాన్ (BSNL Rs 997 Recharge Plan Details)
897 ప్లాన్ తో పోలిస్తే 997 ప్లాన్ చెల్లుబాటు కొద్దిగా తగ్గుతుంది, కానీ డేటా పరిమితి పెరుగుతుంది. BSNL 997 ప్లాన్ 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. చెల్లుబాటు కాలంలో వినియోగదారులకు దేశవ్యాప్తంగా అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 100 SMSలు & రోజుకు 2 GB డేటాను ఎంజాయ్ చేవచ్చు. రోజులో 2 GB పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40Kbps కు తగ్గుతుంది.
త్వరలో 4G నుంచి 5Gలోకి..
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఈ ఏడాది జూన్‌లో 4G నుంచి 5G సర్వీస్‌లోకి మారనుంది. 2025 జూన్ నాటికి లక్ష 4G సైట్ల ఏర్పాటు పూర్తవుతుందని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.
RBI Key Decisions: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
IndiGo Flight Crisis : ఈ తేదీ వరకు ఇండిగో టికెట్ రద్దు చేస్తే పూర్తి రీఫండ్! పూర్తి వివరాలు తెలుసుకోండి!
Airtel Recharge Plan: ఎయిర్టెల్ వినియోగదారులకు బిగ్ షాక్ ! రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను సైలెంట్‌గా క్లోజ్!
Gold Price: బంగారం ధర 15నుంచి 30 శాతం వరకు పెరిగే ఛాన్స్! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడి!
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Telangana Rising Global Summit 2025 : ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
AP CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
IAS Kata Amrapali: తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
IndiGo crisis: ఇండిగోనే తప్పు చేసింది - సమస్యను మేం పర్యవేక్షించడం లేదు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు