Telangana Budget 2025: జీడీపీపీ లెక్కల్లో రంగారెడ్డి జిల్లా టాప్, లాస్ట్‌లో ములుగు జిల్లా
Telangana Budget 2025: తెలంగాణలో 2023- 24 సంవత్సరపు 33 జిల్లాల జీడీడీపీ లెక్కలను ప్రభుత్వం బయటపెట్టింది. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ -2025 బుక్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

జీ.ఎస్.డీ.పీ అనేది రాష్ట్ర ప్రగతికి సూచికగా ఆర్థిక నిపుణులు చెబుతారు. జీ.ఎస్.డీ.పీ అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. అదే దేశం విషయానికి వస్తే జీడీపీగా అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్‌గా లెక్క గడతారు. ఇక జిల్లా పరిధిలో చూస్తే దాన్ని జీడీడీపీ అంటే గ్రాస్ డిస్ట్రిక్ డొమెస్టిక్ ప్రొడక్ట్‌గా లెక్క గడతారు. ఒక ఏడాదిలో ఆ దేశంలో ఉత్పత్తి అయిన వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాల ఉత్పత్తుల విలువను స్థూల జాతీయోత్పత్తి విలువ ( జీడీపీ) అదే రాష్ట్రంలో అయితే జీఎస్డీపీగా, జిల్లా పరిధిలో జీడీపీపీ లెక్క గడతారు. ఇలా చూస్తే 3,12,998 రూపాయలతో రంగారెడ్డి జిల్లా తొలి స్థానంలో ఉండగా రూ. 2,57,949 తో హైదరాబాద్ జిల్లా రెండోస్థానంలో నిలిచింది. మేడ్చేల్ -మల్కాజ్ గిరి జిల్లా రూ.1,04,710తో మూడో స్థానంలో నిలిచాయి. ములుగు జిల్లా రూ.8,873తో చిట్ట చివరి స్థానంలో ఉంది. ఏ జిల్లా ఏ స్థానంలో ఉంది.. ఎంత జీడీడీపీని సాధించాయో ఈ క్రింది పట్టిక చూడండి.
|
జిల్లా ర్యాంకు |
జిల్లా పేరు |
గ్రాస్ డిస్ట్రిక్ డొమెస్టిక్ ప్రొడక్ట్ రూపాయలల్లో.. |
|
1 |
రంగారెడ్డి |
3,17,898 |
|
2 |
హైదరాబాద్ |
2,57,949 |
|
3 |
మేడ్చెల్ – మల్కాజ్ గిరి |
1,04,710 |
|
4 |
సంగారెడ్డి |
65,190 |
|
5 |
నల్గొండ |
53,771 |
|
6 |
భద్రాద్రి కొత్తగూడెం |
42,007 |
|
7 |
నిజామాబాద్ |
41,768 |
|
8 |
ఖమ్మం |
41,756 |
|
9 |
సిద్దిపేట |
33,432 |
|
10 |
మహబూబ్ నగర్ |
32,767 |
|
11 |
సూర్యపేట |
32,507 |
|
12 |
కరీంనగర్ |
30,216 |
|
13 |
పెద్దపల్లి |
27,649 |
|
14 |
యాదాద్రి భువనగిరి |
26,613 |
|
15 |
మెదక్ |
26,420 |
|
16 |
హన్మకొండ |
25,667 |
|
17 |
కామారెడ్డి |
24,688 |
|
18 |
జగిత్యాల |
24,011 |
|
19 |
నాగర్ కర్నూల్ |
23,462 |
|
20 |
మంచిర్యాల |
22,094 |
|
21 |
వికారాబాద్ |
22,066 |
|
22 |
వరంగల్ |
20,758 |
|
23 |
నిర్మల్ |
19,774 |
|
24 |
మహబూబాద్ |
19,490 |
|
25 |
ఆదిలాబాద్ |
18,847 |
|
26 |
వనపర్తి |
15,547 |
|
27 |
జోగులాంబ గద్వాల |
15,529 |
|
28 |
జనగాం |
14,669 |
|
29 |
రాజన్న సిరిసిల్ల |
13,981 |
|
30 |
నారాయణ పేట్ |
13,818 |
|
31 |
కుమరం భీం ఆసీఫాబాద్ |
13,700 |
|
32 |
జయంశకర్ భూపాలపల్లి |
12,932 |
|
33 |
ములుగు |
8,873 |






















