This Week OTT Movies: 5 ఆస్కార్స్ గెలిచిన వేశ్య లవ్ స్టోరీ నుంచి 'బ్రహ్మా ఆనందం' వరకు... ఈ వారం ఓటీటీలోకి 30కు పైగా సినిమాలు
This Week OTT Movies: మార్చి 17 నుంచి 22 వరకు దాదాపు 30 కొత్త సినిమాలు ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నాయి. అందులో 5 ఆస్కార్ అవార్డులు అందుకున్న 'అనోరా' నుంచి 'బ్రహ్మా ఆనందం' వరకు బోలెడు సినిమాలు ఉన్నాయి

ఈ వారం ఓటీటీలోకి మోస్ట్ అవైటింగ్ సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మార్చి 17 నుంచి 22 వరకు ఏకంగా 30 కొత్త సినిమాలు ఈటీవీ విన్, జియో హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, ఆహా వంటి ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో బ్రహ్మానందం, ఆఫీసర్ ఆన్ డ్యూటి, జితేందర్ రెడ్డి వంటి పలు తెలుగు సినిమాలు కూడా స్ట్రీమింగ్ కాబోతుండడం విశేషం.
ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల లిస్ట్
𝐌𝐚𝐫𝐜𝐡 𝟏𝟕 - అనోరా (ఇంగ్లీష్ + హిందీ) - జియో హాట్‌స్టార్
𝐌𝐚𝐫𝐜𝐡 𝟏𝟕 - అంటిల్ యు బర్న్ - సిరీస్ (కొలంబియన్) - నెట్‌ఫ్లిక్స్
𝐌𝐚𝐫𝐜𝐡 𝟏𝟖 - క్రైమ్ పెట్రోల్ - సిరీస్ (ఇంగ్లీష్) - నెట్‌ఫ్లిక్స్
𝐌𝐚𝐫𝐜𝐡 𝟏𝟖 - బ్యాట్ మ్యాన్ నింజా వర్సెస్ యకుజ లీగ్ - (ఇంగ్లీష్) - ప్రైమ్ వీడియో
𝐌𝐚𝐫𝐜𝐡 𝟏𝟖 - ఎగ్జిబిటింగ్ ఫర్గీవ్ నెస్ - (ఇంగ్లీష్) - హులు
𝐌𝐚𝐫𝐜𝐡 𝟏𝟖 - లాస్ట్ బ్రెత్ - (ఇంగ్లీష్) - ప్రైమ్ వీడియో
𝐌𝐚𝐫𝐜𝐡 𝟏𝟖 - మై డెడ్ ఫ్రెండ్ జో - (ఇంగ్లీష్) - ప్రైమ్ వీడియో
𝐌𝐚𝐫𝐜𝐡 𝟏9 - ది అవుట్ రన్ - (ఇంగ్లీష్) - నెట్ ఫ్లిక్స్
𝐌𝐚𝐫𝐜𝐡 20 - ది ట్విస్టర్ : కాట్ ఇన్ ది స్టార్మ్ (ఇంగ్లీష్) - నెట్ ఫ్లిక్స్
𝐌𝐚𝐫𝐜𝐡 20 - ఆఫీసర్ ఆన్ డ్యూటి - (మలయాళం + మల్టీ లాంగ్వేజ్) - నెట్ ఫ్లిక్స్
𝐌𝐚𝐫𝐜𝐡 20 - బ్రహ్మా ఆనందం - (తెలుగు) - ఆహా
𝐌𝐚𝐫𝐜𝐡 20 - జితేందర్ రెడ్డి - (తెలుగు) - ఈటీవి విన్
𝐌𝐚𝐫𝐜𝐡 20 - ఖాకీ : ది బెంగాల్ చాప్టర్ - (హిందీ) - నెట్ ఫ్లిక్స్
𝐌𝐚𝐫𝐜𝐡 20 - టైలర్ పెర్రీ డూప్లిసిటీ - (ఇంగ్లీష్) - ప్రైమ్ వీడియో
𝐌𝐚𝐫𝐜𝐡 20 - సెవెరన్స్ : సీజన్ 2 (ఇంగ్లీష్) - ఆపిల్ టీవి ప్లస్
𝐌𝐚𝐫𝐜𝐡 20 - హ్యాపీ ఫేస్ - (ఇంగ్లీష్) - పారామౌంట్ ప్లస్
𝐌𝐚𝐫𝐜𝐡 20 - ది రెసిడెన్స్ : సిరీస్ (ఇంగ్లీష్) - నెట్ ఫ్లిక్స్
𝐌𝐚𝐫𝐜𝐡 20 - వూల్ఫ్ కింగ్ - (ఇంగ్లీష్) - నెట్ ఫ్లిక్స్
𝐌𝐚𝐫𝐜𝐡 20 - బిగ్ వరల్డ్ - (చైనీస్) - నెట్ ఫ్లిక్స్
𝐌𝐚𝐫𝐜𝐡 20 -ఒడెస్సా - (ఇంగ్లీష్) - హులు
𝐌𝐚𝐫𝐜𝐡 21 - డెనో థీవ్స్ 2: పంటేరా - (ఇంగ్లీష్) - నెట్ ఫ్లిక్స్
𝐌𝐚𝐫𝐜𝐡 21 - బేబీ అండ్ బేబీ - (తమిళం) - సన్ ఎన్ఎక్స్టీ
𝐌𝐚𝐫𝐜𝐡 21 - ఓపెన్ హైమర్ - (ఇంగ్లీష్) - నెట్ ఫ్లిక్స్
𝐌𝐚𝐫𝐜𝐡 21 - అర్మాండ్ - (ఇంగ్లీష్) - ప్రైమ్ వీడియో రెంట్
𝐌𝐚𝐫𝐜𝐡 21 - క్లీనర్ - (ఇంగ్లీష్) - ప్రైమ్ వీడియో రెంట్
𝐌𝐚𝐫𝐜𝐡 21 - మెక్ వే (McVeigh)-(ఇంగ్లీష్) - ప్రైమ్ వీడియో రెంట్
𝐌𝐚𝐫𝐜𝐡 21 - రీఫ్ రాఫ్ - (ఇంగ్లీష్) - ప్రైమ్ వీడియో రెంట్
𝐌𝐚𝐫𝐜𝐡 21 - సింగ్ సింగ్ - (ఇంగ్లీష్) - స్ట్రీమ్ ఆన్ మ్యాక్స్
𝐌𝐚𝐫𝐜𝐡 22 - గో - (ఇంగ్లీష్) - నెట్ ఫ్లిక్స్
𝐌𝐚𝐫𝐜𝐡 22 - విక్డ్ - (ఇంగ్లీష్) - జియో హాట్ స్టార్
మోస్ట్ అవైటింగ్ సినిమాలు ఇవే
ఆస్కార్ అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకున్న హాలీవుడ్ చిత్రం 'అనోరా'. ఈ ఏడాది ఆస్కార్ లో ఈ మూవీ ఉత్తమ నటిగా మైకీ మాడిసన్, ఉత్తమ దర్శకుడుగా సీన్ బేకర్, ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ స్క్రీన్ ప్లే కేటగిరీల్లో ఏకంగా 5 అవార్డులను గెలుచుకుంది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో ఆఫీసర్ ఆన్ డ్యూటి, బ్రహ్మానందం ఆయన తనయుడు రాజా గౌతమ్ నటించిన 'బ్రహ్మానందం', జితేందర్ రెడ్డి అనే సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్ కానున్నాయి.
ఈ వారం థియేటర్లోకి రానున్న సినిమాలు
మార్చ్ 21న షణ్ముఖ, పెళ్ళికాని ప్రసాదు, టుక్ టుక్, అనగనగా ఆస్ట్రేలియాలో, ఆర్టిస్ట్, ది సస్పెక్ట్, కిస్ కిస్ కిస్సిక్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

