అన్వేషించండి

ఒకప్పుడు ప్రియాంక, దీపికలను మించిన స్టార్‌డమ్... ఇప్పుడు ఇండస్ట్రీలోనే లేదు... ఈ మెగాస్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

Actress : తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఓ బాల నటి, చిరంజీవితో కలిసి స్క్రీన్ స్పేస్ పంచుకుంది. తరువాత అవకాశాలు కరువై, ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. ఈ హీరోయిన్ ఎవరంటే ?

కొంతమంది హీరోయిన్లు మెరుపు తీగల్లా వచ్చి, సడన్ గా మాయమౌతూ ఉంటారు. స్టార్ హీరోయిన్ అని పిలిచే లోపే, అవకాశాలు కరువై అల్లాడుతుంటారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్న ఓ హీరోయిన్ కి టెలివిజన్ షోలలో కంటెస్టెంట్ గా చేయాల్సిన గడ్డు పరిస్థితి ఎదురైంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు రిమీ సేన్. 

తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ 
2000లలో పాపులర్ అయిన హీరోయిన్ రిమీ సేన్ హిందీతో పాటు తెలుగు, బెంగాలీ సినిమాలలో నటించి, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. రీమి సేన్ అసలు పేరు శుభ మిత్ర సేన్. ఆమె మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి, తర్వాత బెంగాలీ చిత్రం 'దాము'తో బాల నటిగా చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ మూవీ 1996లో రిలీజ్ అయింది. అయితే 2002లో తెలుగు మూవీ 'నీ తోడు కావాలి'తో ఆమె హీరోయిన్ గా మారింది. ఇక ఆ తర్వాత 'హంగామా' అనే కామెడీ సినిమాతో బాలీవుడ్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి రిమీ సేన్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

మెగాస్టార్ చిరంజీవితో సినిమా 
ఇక రిమీ సేన్ తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వడమే కాదు, మంచి స్టార్ స్టేటస్ వచ్చాక మెగాస్టార్ చిరంజీవితో 'అందరివాడు' సినిమాలో నటించింది. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించగా, అందులో కొడుకు ప్రేయసిగా రిమీ సేన్ నటించింది.

2023లో భాగ్ బన్, ధూమ్, క్యోమ్ కీ, గరం మసాలా, గోల్మాల్ ఫన్ అన్లిమిటెడ్, జానీ గదార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి, స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఒకానొక టైంలో ఆమె స్టార్ స్టేటస్ ఏ రేంజ్ లో ఉండేదంటే, అప్పటి స్టార్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ లాంటి ఏ లిస్ట్ హీరోయిన్లకు కూడా అంతటి కేజ్ లేదనే చెప్పాలి. దీంతో బాలీవుడ్ లో ఆమె నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా స్థిరపడడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే దశాబ్దం ముగిసే సరికి పరిస్థితులు పూర్తిగా తలకిందులు అయ్యాయి.

Also Read:పాకిస్థాన్ నుంచి ఇండియాకు రావడానికి పెద్ధ యుద్ధం చేసిన మహిళ ఉజ్మా అహ్మద్ కథతో... జాన్ అబ్రహం 'ది డిప్లొమాట్' సినిమా రివ్యూ

2009 నాటికి ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ కావడంతో అవకాశాలు కరువయ్యాయి. ఆమె చివరిసారిగా 'షాకీర్' అనే సినిమాలో నటించింది. 2011 తరువాత అవకాశాలు లేక 'బిగ్ బాస్', 'జలక్ దిక్లాజా' అనే డ్యాన్స్ రియాల్టీ షోలలో పాల్గొంది. అయినప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పింది. 

13 ఏళ్ల తర్వాత వార్తల్లో... 
ఇక ఈ బ్యూటీ గత 13 సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తుంది. అయితే ఇటీవల ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందన్న ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఆమె ముందు, తర్వాత ఫోటోలు వైరల్ కావడంతో ప్లాస్టిక్ సర్జరీ రూమర్లు వినిపించాయి. కానీ రీమి సేన్ ఆ వార్తలను ఖండిస్తూ, తాను ఫిల్లర్లు, బొటాక్స్, పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకున్నానని క్లారిటీ ఇచ్చింది.

Also Read'సూక్ష్మదర్శిని'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో... ఇప్పుడు 'పొన్‌మాన్‌'తో JioHotstarలోకి వచ్చాడు... గోల్డ్ రికవరీ కాన్సెప్ట్‌తో బసిల్ జోసెఫ్ ఏం చేశారంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viveka Murder Case: వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి భార్యపై దాడి.. కేసు నమోదు చేయలేదని ఆవేదన
వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి భార్యపై దాడి.. కేసు నమోదు చేయలేదని ఆవేదన
PM Modi on Gujarat Riots: చిన్న నిప్పురవ్వ కూడా హింసకు దారి తీస్తుంది.. గుజరాత్ అల్లర్లపై మోదీ సంచలన వ్యాఖ్యలు
చిన్న నిప్పురవ్వ కూడా హింసకు దారి తీస్తుంది.. గుజరాత్ అల్లర్లపై మోదీ సంచలన వ్యాఖ్యలు
IML Tourney Winner India Masters: ఫైన‌ల్లో మెరిసిన రాయుడు.. ఐఎంఎల్ టోర్నీ భార‌త్ దే.. ఆరు వికెట్ల‌తో విండీస్ చిత్తు
ఫైన‌ల్లో మెరిసిన రాయుడు.. ఐఎంఎల్ టోర్నీ భార‌త్ దే.. ఆరు వికెట్ల‌తో విండీస్ చిత్తు
Saira Banu: 'నన్ను మాజీ భార్య అనొద్దు' - తామింకా విడాకులు తీసుకోలేదన్న రెహమాన్ సతీమణి
'నన్ను మాజీ భార్య అనొద్దు' - తామింకా విడాకులు తీసుకోలేదన్న రెహమాన్ సతీమణి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nikhil on Swayambhu Movie Update | కొంపల్లిలో ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన నిఖిల్ | ABP DesamAR Rahman Wife Saira Rahman | ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సైరా రెహ్మాన్ | ABP DesamNASA Space X Crew 10 Docking Success | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చేందుకు రూట్ క్లియర్ | ABP DesamTDP Activist Loss life in Punganur | పెద్దిరెడ్డి ఇలాకాలో బలైపోయిన మరో టీడీపీ కార్యకర్త | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి భార్యపై దాడి.. కేసు నమోదు చేయలేదని ఆవేదన
వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి భార్యపై దాడి.. కేసు నమోదు చేయలేదని ఆవేదన
PM Modi on Gujarat Riots: చిన్న నిప్పురవ్వ కూడా హింసకు దారి తీస్తుంది.. గుజరాత్ అల్లర్లపై మోదీ సంచలన వ్యాఖ్యలు
చిన్న నిప్పురవ్వ కూడా హింసకు దారి తీస్తుంది.. గుజరాత్ అల్లర్లపై మోదీ సంచలన వ్యాఖ్యలు
IML Tourney Winner India Masters: ఫైన‌ల్లో మెరిసిన రాయుడు.. ఐఎంఎల్ టోర్నీ భార‌త్ దే.. ఆరు వికెట్ల‌తో విండీస్ చిత్తు
ఫైన‌ల్లో మెరిసిన రాయుడు.. ఐఎంఎల్ టోర్నీ భార‌త్ దే.. ఆరు వికెట్ల‌తో విండీస్ చిత్తు
Saira Banu: 'నన్ను మాజీ భార్య అనొద్దు' - తామింకా విడాకులు తీసుకోలేదన్న రెహమాన్ సతీమణి
'నన్ను మాజీ భార్య అనొద్దు' - తామింకా విడాకులు తీసుకోలేదన్న రెహమాన్ సతీమణి
AP Pensions: పింఛన్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, వేలి ముద్రల కష్టాలకు ఏపీ ప్రభుత్వం చెక్
పింఛన్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, వేలి ముద్రల కష్టాలకు ఏపీ ప్రభుత్వం చెక్
Anakapalli News: అనకాపల్లి జిల్లాలో కుంగిన రైల్వే బ్రిడ్జి, నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు
Anakapalli News: అనకాపల్లి జిల్లాలో కుంగిన రైల్వే బ్రిడ్జి, నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు
Bandi Sanjay: పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ పేర్లను తొలగిస్తారా?.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ లాంటి వారి పేర్లను తొలగిస్తారా?.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Challenges KCR: హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget