Dragon OTT release date: థియేటర్లలో 130 కోట్లు కలెక్ట్ చేసిన 'డ్రాగన్'... సెన్సేషనల్ హీరోయిన్ కయాదు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Dragon OTT release date : ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ ప్రధాన పాత్రలో పోషించిన బ్లాక్ బస్టర్ మూవీ 'డ్రాగన్' ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫిషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.

'లవ్ టుడే' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'డ్రాగన్'. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి, 130 కోట్ల కలెక్షన్స్ తో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. మార్చి 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.
'డ్రాగన్' ఓటీటీ రిలీజ్ డేట్
ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కయాదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ లో ప్రముఖ కోలీవుడ్ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ కీలక పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు. 130 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
Some dragons don’t breathe fire, because their comebacks are hotter 😎🧯
— Netflix India South (@Netflix_INSouth) March 18, 2025
Watch Dragon on Netflix, out 21 March in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam #DragonOnNetflix pic.twitter.com/hFGn9tRTia
'డ్రాగన్' ఈ సంవత్సరం తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది. 'లవ్ టుడే' తర్వాత 'డ్రాగన్'తో ప్రదీప్ వరుసగా రెండో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 'డ్రాగన్' తెలుగులో కూడా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. డబ్బింగ్ వెర్షన్ ను 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' పేరుతో రిలీజ్ చేశారు. ఇక ఓటీటీ మూవీ లవర్స్ ఈ మూవీ డిజిటల్ ఎంట్రీ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా మార్చి 21 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో 'డ్రాగన్' స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంటుంది అంటూ మోస్ట్ అవైటింగ్ అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలల్లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీలో ఈ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు మరో రెండ్రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఆసక్తికరంగా మారింది. ఈ వీకెండ్ మూవీ లవర్స్ కు ఓటీటీలో 'డ్రాగన్'తో మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. ఈ మూవీ తరువాత కయాదు ఫేమ్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
'డ్రాగన్' కథ
ఒకప్పుడు టాపర్ గా పేరు తెచ్చుకున్న రాఘవన్ ఇంజినీరింగ్‌లోకి అడుగు పెట్టాకే 'డ్రాగన్' రాఘవన్ గా మారిపోతాడు. ఈ బ్యాడ్ బాయ్ ను చూసి కీర్తి అతన్ని ప్రేమిస్తుంది. ఇంకేముంది రాముడు మంచి బాలుడు లాంటి వ్యక్తి కాస్తా ప్రేమ మైకంలో పడడంతో చదువు అటకెక్కుతుంది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోకుండా గాలి తిరుగుళ్ళకు అలవాటు పడతాడు. బీటెక్ తరువాత ప్రేమ, ఫ్రెండ్షిప్ అంటూ తిరిగే రాఘవన్ ను కీర్తి వదిలేస్తుంది. దీంతో మత్తు వదిలి, అడ్డదారిలో ఉద్యోగం సంపాదించాలని డిసైడ్ అవుతాడు. అనుకున్నట్టుగానే ఉద్యోగంతో పాటు మంచి పెళ్లి సంబంధాన్ని కూడా సంపాదిస్తాడు. కానీ ఇతని వ్యవహారం ప్రిన్సిపాల్ కు తెలిసిపోతుంది. మరి ప్రిన్సిపాల్ డ్రాగన్ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాన్ని బయట పెట్టాడా? డ్రాగన్ ఈ సీక్రెట్ బయటకు రాకుండా ఉండడానికి ఏం చేశాడు? చివరికి పల్లవితో హీరో పెళ్లి జరిగిందా లేదా ? అన్నది తెరపై చూడాల్సిన కథ.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

