Viral Video: ఫుల్లుగా తాగి బస్సులోకి ఎక్కలేదు, కానీ 20 కిలోమీటర్లు జర్నీ చేశాడు - ఎక్కడో కాదు ఏపీలోనే
Andhra Pradesh News | తప్పతాగిన మందుబాబు బస్సు కింద స్పేర్ టైర్ మీద హాయిగా పడుకుని ట్రావెల్ చేశాడు. ఏపీలోని సత్యసాయి జిల్లాలో జరిగిన ఘటన వీడియో వైరల్ అవుతోంది.

Sri Sathya Sai district News | హిందూపురం: తాగిన మైకంలో మందుబాబులు చేసే చిత్ర విచిత్రాలు, విన్యాసాలు చూస్తే నోరెళ్ల బెడతారు. కొన్ని సందర్భాల్లో నెటిజన్లకు సైతం ఈ ఘటన వీడియో చూస్తే గుండె గుబేల్ మంటుంది. మందుబాబులు చేసే పనులకు పోలీసులు సైతం తల పట్టుకునే పరిస్థితులు తలెత్తుతుంటాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. ఫుల్లుగా తాగి ఉన్న మందుబాబు, ఆర్టీసీ బస్సు స్పేర్ టైర్ ఎక్కి హాయిగా పడుకున్నాడు. ఇది గమనించిన వాహనదారులు బస్సు డ్రైవర్ ను అప్రమత్తం చేయడంతో మందుబాబు విన్యాసాల సీన్ ముగిసింది.
సాధారణంగా ప్రజలు ఆర్టీసీ బస్సులో ఎక్కి ప్రయాణం చేస్తుంటారు. ఓ మందుబాబు తాగిన మత్తులో శ్రీ సత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు నుంచి హిందూపురం వెళ్లే ఆర్టీసీ బస్సులో వింత ప్రయాణం చేశాడు. బస్సు వెనుక టైర్ పక్కనే స్పేర్ టైర్ ఉంది. ఎక్కడ ఎక్కాడో తెలియదు కానీ, ఆ టైర్ ఎక్కి బస్సు హాయిగా నిద్రపోయాడు. దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు మందుబాబు అలాగే ప్రయాణించాడు. అయితే బస్సు వెనుక, బస్సు పక్కనుంచి వెళ్తున్న వాహనదారులు బస్సు కింద ఎవరో వేలాడుతున్నట్లు గమనించారు. బస్సు డ్రైవర్ ను అప్రమత్తం చేయడంతో ఆపి చెక్ చేశారు.
కొత్తచెరువు నుంచి హిందూపురం వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ తాగుబోతు వింత ప్రయాణం🤪🤪
— Bhaskar Reddy (@chicagobachi) March 15, 2025
బస్సు వెనుక స్పేర్ టైర్ ఎక్కి పడుకున్న మందుబాబు, 15 కిలోమీటర్లు ప్రయాణం , వాహనదారులు గమనించి డ్రైవర్ కు చెప్పటం తో బస్సు ఆపి చూడగా.... మందుబాబు పడుకుని ఉన్నాడు ..ఖంగుతిన్న ఆర్టీసీ డ్రైవర్ 🙆♂️🙆♂️ pic.twitter.com/yjNKkRX8np
వెనుక టైర్ దగ్గర చెక్ చేయగా అంతా షాక్
పొరపాటున అలా జరిగిందా అని అంతా అనుకున్నారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ బస్సు ఆపి వెనుక టైర్ దగ్గర చెక్ చేయగా.. ఓ వ్యక్తి పడుకుని ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్ ఆ సీన్ చూసి కంగుతిన్నారు. ఎక్కడా చోటు లేదన్నట్లు బస్సు కింద పడుకోవడం ఏంటిరా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏదైనా తేడా జరిగితే ప్రాణాలు పోయేవని, పిచ్చి చేష్టలు చేయడంపై డ్రైవర్, కండక్టర్ మండిపడ్డారు. ఛార్జీకి డబ్బులు లేవని అడిగితే ఎవరో ఒకరు హెల్ప్ చేసేవారు, కానీ ఇలా చేసి ఆర్టీసీ సిబ్బంది జీవితాలతో చెలగాటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టైర్ మీద నుంచి లేచి, కొంత సమయానికి బస్సు కింద నుంచి బయటకు వచ్చిన మందుబాబును బస్సులోని వారు తిట్టారు. తెలివి ఉందా, పిచ్చి చేష్టలు ఏంటని కొందరు మండిపడగా, ఇంటి దగ్గర చెప్పే వచ్చావా అని కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇందుకు సంబంధించి కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

