అన్వేషించండి

Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు

Prakash Raj backs of Professor Nageshwar | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యల వివాదంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రకాష్ రాజ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ కు పూర్తి మద్దతు ప్రకటించారు.
  • ప్రశ్నించే గొంతులను నొక్కేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్నారు.
  • పవన్ కళ్యాణ్, జగన్ లపై నాగేశ్వర్ వ్యాఖ్యలతో జనసేన ఆగ్రహం.
  • జనసేన విమర్శల నేపథ్యంలో నాగేశ్వర్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు.

Professor Nageshwar | అమరావతి: ప్రముఖ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్, కేసులపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు తన పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రజల పక్షాన నిలుస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గత కొన్నేళ్లుగా అధికారంలో ఉన్నవారినైనా, ప్రతిపక్షంలో ఉన్నవారినైనా ప్రశ్నిస్తూనే ఉన్నారని ప్రకాష్ రాజ్ గుర్తుచేశారు. కానీ ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి, కేవలం ఒకే ఒక్క లైన్‌ను పట్టుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం, కేసులతో బెదిరించడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఏదైనా అంశంపై అభిప్రాయాన్ని చెబితే ట్రోల్ చేయడంతో పాటు కేసులు పెట్టి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బెదిరించడం, ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడమేనని, ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదం అన్నారు. 

రాజకీయ గుండాయిజంపై ప్రకాష్ రాజ్ విమర్శలు
 ‘మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాను’ అనడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని, ఇది కేవలం రాజకీయ గుండాయిజం అని నటుడు ప్రకాష్ రాజ్ జన సైనికులు, పవన్ ఫ్యాన్స్‌ను విమర్శించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పు ఉందని అనిపిస్తే, దానికి ఆధారాలు అడగాలని లేదా రాజకీయంగా కౌంటర్ ఇవ్వాలని సూచించారు. కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, అవమానించడం కొత్త రాజకీయ సంస్కృతిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు

నిష్పాక్షిక విశ్లేషణలు గుర్తురాలేదా.. 
గతంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కెసిఆర్, జగన్ మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బిజెపి వంటి అన్ని రాజకీయ శక్తులను ప్రశ్నించారని, అప్పుడు ఆయన నిజాయితీ ఎవరికీ గుర్తుకు రాలేదా అని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఇప్పుడు కేవలం ఒక మాట నచ్చలేదని ఆయనపై యుద్ధం ప్రకటించడం వారి ద్వంద్వ వైఖరిని సూచిస్తుందని మండిపడ్డారు.

Also Read: Purandeswari Central Cabinet: కేంద్ర కేబినెట్‌లోకి పురందేశ్వరి? మోదీ టీంలో 'చిన్నమ్మ'కు కీలక పదవి ఖరారైందా?

ప్రజాస్వామ్యానికి హెచ్చరిక 
ప్రశ్నించే గొంతులను కేసులతో నోరు మూయించాలని చూడటం అత్యంత ప్రమాదకరమని, ఈరోజు నాగేశ్వరరావుకు తలెత్తిన పరిస్థితి రేపు ఇంకెవరికైనా ఎదురుకావచ్చని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తులో ఉందో అందరికీ తెలుసని, ఇలాంటి అనాగరిక చర్యలను ఆపాలని ప్రకాష్ రాజ్ కోరారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మేము  అండగా ఉన్నాం, మీరు మీ పనిని యథాతథంగా కొనసాగించండి అంటూ ప్రకాష్ రాజ్ తన సంఘీభావాన్ని తెలిపారు. 

ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై జనసేన ఫైర్..

ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి, ప్రస్తుత జనసేన పార్టీకి ఉన్న పోలికలను విశ్లేషించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వైఖరి, గత ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆయన పాత్రను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, ఆయన రాజకీయాలను తక్కువ చేసి చూపేలా ఉన్నాయంటూ జనసేన వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అమిత్ షాను కలిసిన సందర్భంలో, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌లకు క్లాస్ పీకారని.. చంద్రబాబు ఇన్ స్టాంట్ ఫ్రెండ్, జగన్ శాశ్వత మిత్రుడు అని చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.

Also Read: SAEL Solar Project AP: జమ్మలమడుగులో రూ.3వేల కోట్లతో SAEL సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం - ఇన్వెస్టర్లకు ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే.. లోకేష్ కీలక వ్యాఖ్యలు!

ఈ వ్యాఖ్యల పట్ల జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను సామాజిక మాధ్యమాలలో లక్ష్యంగా చేసుకున్నారు . ఆయన విశ్లేషణలు ఒక వర్గానికి కొమ్ముకాసేలా, పక్షపాత ధోరణితో ఉన్నాయని వారు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని, ఆయన త్యాగాలను నాగేశ్వర్ రావు కావాలనే కించపరుస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పాత వీడియోలను, ట్రోల్స్‌ను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక నిష్పక్షపాత విశ్లేషకుడిగా కాకుండా, రాజకీయ అజెండాతోనే నాగేశ్వర్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న ప్రొఫెసర్ 

పవన్ కళ్యాణ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీకి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగడం, జనసేన నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమై కేసులు నమోదు కావడంతో ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు వెనక్కి తగ్గారు. వైఎస్ జగన్ అరెస్ట్ అంశంపై అమిత్ షాతో పవన్ కళ్యాణ్ చర్చించారని, ఆ సమయంలో జగన్ తమకు 'లాంగ్ టర్మ్ ఫ్రెండ్' అని అమిత్ షా అన్నారంటూ జనసేన కోర్ కమిటీ సభ్యుడి సమాచారం మేరకు తాను చేసిన వ్యాఖ్యలను ఆయన భేషరతుగా ఉపసంహరించుకున్నారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమైన వ్యక్తి అని, తనను ఎంతగానో గౌరవించే వ్యక్తి అని నాగేశ్వర్ అన్నారు.

Frequently Asked Questions

ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, కేసులపై ప్రకాష్ రాజ్ ఏమన్నారు?

ప్రజల పక్షాన నిలుస్తూ ప్రశ్నించే ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, కేసులతో బెదిరించడం సరైన పద్ధతి కాదని ప్రకాష్ రాజ్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలపై జనసేన ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది?

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం, పార్టీల పోలికలపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన కొన్ని వ్యాఖ్యలు జనసేన నాయకులకు, కార్యకర్తలకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, రాజకీయాలను కించపరిచేలా ఉన్నాయని వారు భావించారు.

తన వ్యాఖ్యలపై వివాదం తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏ నిర్ణయం తీసుకున్నారు?

రాజకీయ దుమారం, జనసేన నుంచి నిరసనలు, కేసులు నేపథ్యంలో ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు తన వ్యాఖ్యలను భేషరతుగా ఉపసంహరించుకున్నారు. ఈ వివాదాన్ని అక్కడితో ముగించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రకాష్ రాజ్ ప్రకారం, ప్రొఫెసర్ నాగేశ్వరరావును ప్రశ్నించే గొంతులను నొక్కేయడం సరైనదేనా?

కాదు, ప్రకాష్ రాజ్ ప్రకారం, ఏదైనా అంశంపై అభిప్రాయం చెబితే ట్రోల్ చేయడంతో పాటు కేసులు పెట్టి బెదిరించడం, ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
AP Cabinet Decisions Ease: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
Banakacherla Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget