అన్వేషించండి

Purandeswari Central Cabinet: కేంద్ర కేబినెట్‌లోకి పురందేశ్వరి? మోదీ టీంలో 'చిన్నమ్మ'కు కీలక పదవి ఖరారైందా?

Modi 3.0 Cabinet Reorganisation: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పురందేశ్వరికి కేబినెట్ హోదా దక్కబోతుందా? ఆమె ఎంపికకు ఉన్న ప్లస్ పాయింట్లు, ఆటంకాలు ఏంటి?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రధాని మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఏపీకి ప్రాధాన్యత
  • పురందేశ్వరికి కేబినెట్ హోదా కల్పించే అవకాశాలు గట్టిగా ఉన్నాయి
  • పరిపాలనా అనుభవం, ఎన్టీఆర్ వారసత్వం పురందేశ్వరి బలాలు
  • సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు మంత్రి పదవికి దోహదం చేస్తాయి

Narendra Modi Cabinet Expansion 2026: ప్రధాని మోదీ తన మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించబోతున్నారు. ఈ క్రమంలో ఏపీ నుంచి పురందేశ్వరికి కేబినెట్  హోదాతో మంత్రి పదవి  ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.  త్వరలో జరగబోయే మోదీ 3.0 మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు పెద్దపీట వేయాలని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం  ఏర్పడటంలోనూ, బీజేపీ ఓటు బ్యాంకును పటిష్టం చేయడంలోనూ పురందేశ్వరి కీలక పాత్ర పోషించారు. అందుకే ఆమెకు  పూర్తి స్థాయి కేబినెట్ ర్యాంక్ ఇచ్చి గౌరవించాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.             

పురందేశ్వరి ప్లస్ పాయింట్లు 

పురందేశ్వరి ఎంపికకు ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ఆమెకు ఉన్న పరిపాలనా అనుభవం . యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆమె మానవ వనరుల అభివృద్ధి  , వాణిజ్య , పరిశ్రమల శాఖల్లో సహాయ మంత్రిగా పనిచేసి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రెండోది,  ఎన్టీఆర్ వారసత్వం . తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకు ఉన్న క్లీన్ ఇమేజ్  బీజేపీకి పెద్ద ఎస్సెట్. మూడోది,  పార్లమెంటరీ పనితీరు . పార్లమెంటులో ఆమె వాగ్ధాటి, హిందీ, ఇంగ్లీష్ భాషలపై ఉన్న పట్టు జాతీయ స్థాయిలో ఆమెకు సానుకూలతను తెచ్చిపెట్టాయి.                                 

 కులం ,  ప్రాంతీయ సమీకరణాలు 

ఏపీలో ప్రస్తుతం సామాజిక సమీకరణాలు అత్యంత కీలకం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురందేశ్వరికి కేబినెట్ పదవి ఇవ్వడం ద్వారా, ఆ వర్గం నుంచి బీజేపీకి మరింత మద్దతు లభిస్తుందని పార్టీ భావిస్తోంది. అలాగే, రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి పర్యవేక్షణ పెంచాలన్నా, రైల్వే జోన్ వంటి పెండింగ్ అంశాలను వేగవంతం చేయాలన్నా పురందేశ్వరి వంటి సమర్థవంతమైన నేత కేబినెట్‌లో ఉండటం పార్టీకి మేలు చేస్తుందని  భావిస్తున్నారు. 

పురందేశ్వరికి కొన్ని మైనస్ పాయింట్లు                             

అయితే, ఆమెకు కేబినెట్ పదవి దక్కకుండా పోవడానికి కొన్ని సాంకేతిక, రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి.  కూటమి ఒప్పందం ప్రకారం ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు మంత్రులు కేంద్రంలో ఉన్నారు. బీజేపీ నుంచి మరో మంత్రి ఉన్నారు. మరిన్ని పదవులు ఏపీకే ఇస్తే ఇతర రాష్ట్రాల నుంచి అసమ్మతి వచ్చే ప్రమాదం ఉందనేది పొలిటికల్ రిస్క్.  రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని సమాచారం. ఆమెకు మంత్రి పదవి వస్తుందా లేదా అనేది ప్రధాని మోదీ, అమిత్ షా ల తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కేబినెట్ ర్యాంక్ దక్కితే మాత్రం, ఏపీ రాజకీయాల్లో పురందేశ్వరి హవా మరింత పెరగడం ఖాయం.

Frequently Asked Questions

మోదీ 3.0 మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత ఉంటుందా?

అవును, దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు పెద్దపీట వేయాలని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో, బీజేపీ ఓటు బ్యాంకును పటిష్టం చేయడంలో పురందేశ్వరి కీలక పాత్ర పోషించారు.

పురందేశ్వరిని కేబినెట్‌లోకి తీసుకోవడానికి గల కారణాలు ఏమిటి?

ఆమెకు పరిపాలనా అనుభవం, ఎన్టీఆర్ వారసత్వంతో క్లీన్ ఇమేజ్, మరియు పార్లమెంటులో ఆమె వాగ్ధాటి, భాషలపై పట్టు ప్రధాన కారణాలు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.

పురందేశ్వరి కేబినెట్ పదవికి అడ్డంకులు ఏమైనా ఉన్నాయా?

అవును, కూటమి ఒప్పందం ప్రకారం ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒక మంత్రి ఉన్నారు. మరిన్ని పదవులు ఏపీకే ఇస్తే ఇతర రాష్ట్రాల నుంచి అసమ్మతి వచ్చే ప్రమాదం ఉంది.

కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరగవచ్చు?

రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే, ప్రధాని మోదీ, అమిత్ షాల తుది నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget