అన్వేషించండి

BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !

Vishnu Vardhan Reddy BJP: విద్యార్థి నాయకుడి నుంచి బీజేపీ జాతీయ స్థాయికి.. ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్థానం! ఏబీవీపీ, బీజేవైఎమ్‌లలో ఆయన సాగించిన ప్రయాణం.. నాయకత్వ సామర్థ్యానికి దక్కిన ప్రతిఫలం.

BJP National Executive New Team:  భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ కార్యవర్గంలో ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డికి బాధ్యతలు దక్కాయి. జాతీయ స్థాయిలో పార్టీ కీలక పదవికి ఎదిగిన ఆయన కృషి వెనుక  దశాబ్దాల పాటు ఆయన సాగించిన నిరంతర , సంస్థాగత శ్రమ దాగి ఉంది. 1978 అక్టోబర్ 2న ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధమున్న కుటుంబంలో జన్మించిన ఆయన, అఖిల భారత విద్యార్థి పరిషత్   ద్వారా అతి చిన్న వయసులోనే ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు. 1992లో కదిరి తాలూకా కార్యదర్శిగా ప్రారంభమై అనంత్ పూర్ జిల్లా కన్వీనర్, ఉమ్మడి ఏపీ కార్యదర్శిగా మరియు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా 1998 వరకు విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

విద్యార్థి దశ పూర్తయిన తర్వాత భారతీయ జనతా యువమోర్చా లో ప్రవేశించి అనంతపురం జిల్లా కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడిగా , ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2012 నుంచి 2016 వరకు ఉమ్మడి, విభజిత ఏపీలో సుదీర్ఘకాలం BJYM రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి యువతను పార్టీ వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే 2006 నుంచి బీజేపీ అనంతపురం జిల్లా కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, రాష్ట్ర శిక్షణ విభాగ కన్వీనర్‌గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రెండు విడతలుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించారు.

ఆయన ప్రతిభకు, కార్యనిర్వహణ సామర్థ్యానికి కేంద్ర ప్రభుత్వంలోనూ తగిన గుర్తింపు లభించింది. కేంద్ర యువజన వ్యవహారాలు,  క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని  నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వైస్ ఛైర్మన్‌గా 2018-2021 వరకూ నియమితులై జాతీయ స్థాయిలో సేవలు అందించారు. అంతేకాకుండా యువ భారత్  ఎన్‌జీఓ ద్వారా యువతను రక్షణ, పోలీస్ రంగాల వైపు ప్రోత్సహించడంతో పాటు శ్రీ విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్  ఛైర్మన్‌గా విద్యారంగంలోనూ పలు కళాశాలలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

విద్యార్హతల పరంగా బి.ఎస్సీ ,  శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా పూర్తి చేసిన విష్ణువర్ధన్ రెడ్డి, పార్టీ సిద్ధాంతాలపై పూర్తి పట్టు ఉన్న వ్యూహకర్తగా పేరుపొందారు. టీవీ చర్చలు, మీడియా వేదికలపై బీజేపీ విధానాలను సమర్థవంతంగా వినిపిస్తూ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో ఆయన తనదైన ముద్ర వేశారు. నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ లక్షలాది మంది మద్దతుదారులను కలిగి ఉన్న నేతగా గుర్తింపు పొందారు.  సాధారణ కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించి ఏబీవీపీ, బిజెవైఎమ్, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో ఎదిగిన విష్ణువర్ధన్ రెడ్డికి ఇప్పుడు జాతీయ స్థాయిలో 'ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్'గా బాధ్యతలు దక్కడం ఆయన కష్టానికి దక్కిన సరైన ప్రతిఫలం. కేంద్ర నాయకత్వం వహించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, దేశవ్యాప్తంగా పార్టీ అనుబంధ విభాగాలు, సెల్స్ సమన్వయంలో ఆయన తనదైన మార్క్ చూపిస్తారని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.   

 
విష్ణువర్ధన్ రెడ్డి .. బాధ్యతలు నిర్వహించనున్న అన్ని అనుబంధ శాఖల సమన్వయం టీమ్‌కు విష్ణుదత్ శర్మ కోఆర్డినేటర్‌గా ఉంటారు. విష్ణు దత్ కీలక జాతీయ నేత, వ్యూహకర్త.  మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సమర్థవంతమైన సంస్థాగత నాయకత్వాన్ని అందించి పార్టీ ఘన విజయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా, ఖజురహో నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు భారీ మెజారిటీలతో ఎంపీగా ఎన్నికయ్యారు. గ్రాస్‌రూట్ స్థాయి నుంచి కేడర్‌ను నడిపించడంలో అపార అనుభవం కలిగిన ఆయన, ప్రస్తుతం బీజేపీ కేంద్ర నాయకత్వంలో జాతీయ 'ఆల్ సెల్స్ కో-ఆర్డినేటర్'గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Candidates: వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
వైఎస్సార్‌సీపీ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
TDP Janasena and BJP Seat Sharing: ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో కూటమిలో సీట్ల సర్దుబాటు.. ఎవరు ఎక్కడి నుంచి చేస్తారంటే
ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో కూటమిలో సీట్ల సర్దుబాటు.. ఎవరు ఎక్కడి నుంచి చేస్తారంటే
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
Embed widget