అన్వేషించండి

Modi Cabinet Reshuffle 2026: మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ - ఏపీకి దక్కబోయే కొత్త మంత్రులు వీరేనా?

AP Ministers in Modi Cabinet: ప్రధాని మోదీ కేబినెట్‌ను పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఏపీలో కొత్తగా ఎవరికి చాన్స్ దక్కుతుందన్నది సస్పెన్స్ గా మారింది.

Modi 3.0 Cabinet Expansion Updates: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే-3 సర్కార్ మూడవ ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ , కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నందున ఈ మార్పులు ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.    
  
ఏపీకి అదనపు గుర్తింపు దక్కనుందా?                                 

మోదీ ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, పాలనలో వేగం పెంచడానికి మరియు,  మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ పునర్వ్యవస్థీకరణను ఒక అవకాశంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి టీడీపీకి చెందిన  రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కీలక బాధ్యతల్లో ఉన్నారు. కొత్తగా పలువురి పేర్లు తెరపైకివస్తున్నాయి.  రాజమండ్రి ఎంపీ పురందేశ్వరిని ఈసారి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం బలంగా సాగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ,  33% మహిళా కోటా అమలు దిశగా అడుగులు వేస్తున్న మోదీ ప్రభుత్వం, అనుభవజ్ఞురాలైన పురందేశ్వరికి కేబినెట్ ర్యాంకు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. టీడీపీకి మరో సహాయ మంత్రి  పదవి లేదా ఒక కేబినెట్ ర్యాంకు  కేటాయించే అవకాశం ఉంది.  ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే సీనియర్ ఎంపీలకు ఈసారి ఛాన్స్ దక్కవచ్చని  భావిస్తున్నారు.  

 రాజకీయ వ్యూహం - ఏపీ ప్రాధాన్యత                      

చంద్రబాబు నాయుడు తన పరిపాలనా దక్షతతో ఏపీని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో ఏపీకి ఎంత ఎక్కువ మంది మంత్రులు ఉంటే, రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు తీసుకురావడం అంత సులభం అవుతుంది. బీజేపీ కూడా వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏపీలో తన బలాన్ని పెంచుకోవడానికి టీడీపీని సంతృప్తి పరచడంతో పాటు, తన సొంత నేతలకు ఎలివేషన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది.
 
పని తీరు బాలేని మంత్రుల తొలగింపు                             

కొందరు ప్రస్తుత మంత్రుల పనితీరు ఆధారంగా వారిని తప్పించి కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వబోతున్నారు. ఏపీ నుంచి ఇప్పటి వరకు ఉన్న మంత్రుల పనితీరుపై ప్రధాని సంతృప్తిగా ఉన్నారని, కానీ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా  అదనపు ప్రాతినిధ్యం  ఇచ్చే దిశగా మోదీ ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.   జూన్ మొదటి వారంలో జరిగే ఈ మార్పులు ఏపీ రాజకీయ సమీకరణాలను మార్చబోతున్నాయి. ఎవరెవరికి కొత్తగా చాన్సులు వస్తాయో.. ఎవరికి ప్రమోషన్ దక్కుతుందో చూడాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.         

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
Telangana Cabinet Coordination Issues: జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
Andhra Pradesh Law and Order Issue: మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?
మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Embed widget