అన్వేషించండి

SAEL Solar Project AP: జమ్మలమడుగులో రూ.3వేల కోట్లతో SAEL సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం - ఇన్వెస్టర్లకు ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే.. లోకేష్ కీలక వ్యాఖ్యలు!

Nara Lokesh Jammalamadugu Visit: జమ్మలమడుగులో 600 మెగావాట్ల SAEL సోలార్ ప్రాజెక్టును మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. 11 నెలల్లోనే రికార్డు స్థాయిలో పూర్తి కావడం ఏపీ అభివృద్ధి వేగానికి నిదర్శనమని

Nara Lokesh Inaugurates SAEL Solar Project:  నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రస్థానంలో మరో కీలక మైలురాయి నమోదైంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో కేవలం  11 నెలల్లోనే సిద్ధమైన సుఖ్‌బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్  సోలార్ ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.

Image

రూ. 3,000 కోట్ల భారీ పెట్టుబడితో, 2,400 ఎకరాల్లో విస్తరించిన ఈ 600 మెగావాట్ల  సౌర విద్యుత్ కేంద్రం, రాష్ట్ర అభివృద్ధి వేగానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.  బ్రాండ్ సీబీఎన్ పట్ల ఉన్న నమ్మకం వల్లే గ్లోబల్ ఇన్వెస్టర్లు ఏపీకి క్యూ కడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.  

Image

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి లోకేష్  కీలక వ్యాఖ్యలు చేశారు.  గత ప్రభుత్వ పాలనను, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనను పోల్చుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

Image

మా బ్రాండ్ జాబ్ క్రియేషన్.. మీ బ్రాండ్ గొడ్డలి అంటూ పరోక్షంగా ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. ఇచ్చిన మాటను చేతల్లో చూపే నాయకత్వం ఉండబట్టే, పంజాబ్‌కు చెందిన కంపెనీ ఏపీకి వచ్చి ఇంతటి భారీ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసిందని కొనియాడారు.

Image ఏపీ ఇప్పుడు కేవలం క్లీన్ ఎనర్జీని వినియోగించడమే కాదు, దేశానికే ఎగుమతి చేసే హబ్‌గా ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Image

ఈ ప్రాజెక్టు వల్ల స్థానిక రైతులకు, యువతకు భారీగా లబ్ధి చేకూరింది. నిర్మాణ సమయంలోనే సుమారు 1,000 మందికి ఉపాధి లభించగా, అందులో 80 శాతం మంది స్థానికులే కావడం విశేషం.Image

అంతేకాకుండా, దీర్ఘకాలిక లీజు ఒప్పందాల ద్వారా  760 మంది రైతు కుటుంబాలకు  స్థిరమైన ఆదాయం సమకూరింది. భవిష్యత్తులో వ్యవసాయ వ్యర్థాల నుండి మరో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా SAEL సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం దక్కుతుందని లోకేష్ వివరించారు.   

Image

పర్యావరణ పరిరక్షణలోనూ ఈ సోలార్ పార్క్ కీలక పాత్ర పోషించనుంది. ఏటా సుమారు 11 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను  ఈ ప్రాజెక్ట్ ద్వారా నివారించవచ్చని అంచనా.

Image

ఇక్కడ ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన విద్యుత్, జాతీయ గ్రిడ్‌లోకి సరఫరా అయి గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాల అవసరాలను కూడా తీర్చనుంది. ఏపీని  గ్రీన్ ఎనర్జీ క్యాపిటల్ గా మార్చడమే లక్ష్యంగా 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని, అందులో భాగంగానే జమ్మలమడుగులో అదానీ, జెన్‌కో వంటి సంస్థల ప్రాజెక్టులు కూడా త్వరలో పట్టాలెక్కబోతున్నాయని మంత్రి వెల్లడించారు.

Image

  విదేశీ , స్వదేశీ పెట్టుబడిదారులకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు.

ImageSAEL వంటి సంస్థలకు ఏ సహాయం కావాలన్నా తాను  ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే ఉంటానని హామీ ఇచ్చారు  ఈ ప్రాజెక్టు ప్రారంభంతో జమ్మలమడుగు ప్రాంతం పారిశ్రామికంగా కొత్త వెలుగులు సంతరించుకుంది. 

Image

Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
Amaravati: అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget