అన్వేషించండి

TDP Mahanadu:నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!

TDP Mahanadu:ప్రధాని ఇచ్చిన పొదుపు చర్యల పిలుపులో భాగంగా నెల్లూరులో జరగాల్సిన టీడీపీ మహానాడు షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇది నెల్లూరు జిల్లాలో అమలు చేయాల్సిన వ్యూహానికి దెబ్బ తగిలింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నెల్లూరులో జరగాల్సిన టీడీపీ మహానాడు రద్దు, మంగళగిరిలో హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహణ.
  • నెల్లూరు టీడీపీలో వర్గపోరు, నేతల మధ్య సయోధ్య లేకపోవడం సమస్యగా మారింది.
  • లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక తొలి మహానాడు, గత రికార్డులను బద్దలుకొట్టే ప్రణాళిక.

TDP Mahanadu: నెల్లూరులో జరగాల్సిన టీడీపీ మహానాడు  ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు చర్యల్లో భాగంగా  క్యాన్సిల్ అయిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే మహానాడును  హైబ్రిడ్ పద్ధతుల్లో  మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలో తక్కువ మంది సభ్యులతో జరుపబోతున్నారు. మరీ విపరీతమైన ఆర్భాటాలు లేకుండా ఈసారి మహానాడు జరగబోతోంది. అంతా ఓకే కానీ నెల్లూరులో జరగాల్సిన మహానాడు క్యాన్సిల్ కావడం మాత్రం  అక్కడ టిడిపిలో నెలకొన్న వర్గ పోరును  పరిష్కరించే ఛాన్స్ లేకుండా చేసింది అనే వాదన వినబడుతోంది.

నెల్లూరు టీడీపీలో ఎవరి వర్గం వారిదే..!

చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూటమి రాష్ట్రవ్యాప్తంగా బలంగానే ఉంది. కొన్నిచోట్ల టిడిపి జనసేన  నేతల మధ్య ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ చెయ్యి దాటిపోయి పరిస్థితి అయితే లేదు. కానీ నెల్లూరులో పరిస్థితి వేరు. అక్కడ టీడీపీ నేతల్లోనే సామరస్యం చాలా తక్కువ. కారణం చాలా శక్తివంతమైన లీడర్లందరూ ఆ జిల్లాలోనే ఉండడం. మంత్రి నారాయణ, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, అనం ఫ్యామిలీ, వేమూరి కుటుంబం, సోమిరెడ్డి ఇలా బలమైన లీడర్లు అందరూ అక్కడే ఉండడం  కూటమి అబ్స్ ల్యూట్ మెజారిటీలో ఉండడంతో  అక్కడ పైచేయి కోసం ఎవరికి వారు  తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

జిల్లాపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న నేతలు 

  • పి. నారాయణ- మంత్రి
  • ఆనం రామనారాయణ రెడ్డి ఫ్యామిలి
  • కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 
  • వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం 
  • సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  

నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా వారి వారి అనుచరుల ముద్రతో కుర్ర కారు చేస్తున్న హల్చల్  సోషల్ మీడియా పోస్టుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎప్పటికీ సీఎం చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టి ఒకటికి  రెండుసార్లు వార్నింగ్ ఇచ్చారు. గతంలో నెల్లూరులో పదికి పది సీట్లు సాధించిన వైసిపి 2024 ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో తమకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం టిడిపి అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా స్థానిక అగ్రనేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టడం కోసం, నేతల మధ్య సామరస్యం తేవడం కోసం మహానాడును శ్రీకాకుళం నుంచి నెల్లూరుకి షిఫ్ట్ చేశారు అనే ప్రచారం ఉంది.

మహానాడు ఏర్పాట్లలో కచ్చితంగా అక్కడ స్థానిక నేతలు అందరూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వారందరినీ ఒకే తాటిపైకి  తేవడానికి ఇదో మంచి అవకాశం అని టిడిపి అధిష్టానం భావించింది. కానీ ఇప్పుడు సడన్‌గా  మహానాడుని మంగళగిరికి షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి రావడంతో  టోటల్ సీన్ మారిపోయింది. 

లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక జరుగుతోన్న తొలిమహానాడు 

టిడిపిలో నాయకత్వ మార్పు నెమ్మదిగా జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఒక్కో విభాగం నారా లోకేష్ టీమ్ చేతిలోకి వచ్చేస్తోంది.  ఇప్పుడాయన ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నారు. అందుకే ఈసారి జరిగే మహానాడు సూపర్ సక్సెస్ కావాలని టిడిపి ప్లాన్ చేసింది. గతంలో జరిగిన కడప మహానాడులో ఏకంగా 5 లక్షల మందితో  బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈసారి ఆ రికార్డు బద్దలు కొట్టాలని భావించింది టిడిపి .

అందుకే మహానాడును నెల్లూరుని వేదికగా ఎంచుకుంది. కీలక నేతలు అందరూ అక్కడే ఉండడంతో సభ సక్సెస్ చేయడం ఈజీ అలానే వారి మధ్య ఉన్న విభేదాలను తొలగించడమూ ఈజీ అని టిడిపి అధిష్టానం అనుకుంది. కానీ మోదీ పొదుపు పిలుపు కారణంగా మహానాడు నెల్లూరు నుంచి మంగళగిరికి షిఫ్ట్ కావడంతో ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. మరి నెల్లూరులో సీనియర్ నేతల మధ్య నెలకొన్న వర్గ పోరును టిడిపి ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

Frequently Asked Questions

టీడీపీ మహానాడు ఎందుకు రద్దు చేయబడింది?

ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు చర్యల కారణంగా నెల్లూరులో జరగాల్సిన టీడీపీ మహానాడు రద్దు చేయబడింది.

కొత్త మహానాడు ఎక్కడ, ఎలా జరగనుంది?

ప్రస్తుతం మహానాడును మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో హైబ్రిడ్ పద్ధతుల్లో, తక్కువ మంది సభ్యులతో జరుపబోతున్నారు.

నెల్లూరులో మహానాడు రద్దు అవ్వడం వల్ల ఏమైంది?

నెల్లూరులో మహానాడు రద్దు అవ్వడం వల్ల అక్కడ టీడీపీలో నెలకొన్న వర్గ పోరును పరిష్కరించే అవకాశం లేకుండా పోయింది.

నెల్లూరు టీడీపీలో వర్గ పోరుకు కారణమేంటి?

నెల్లూరులో చాలా శక్తివంతమైన నాయకులందరూ ఉండటం, పైచేయి కోసం తీవ్ర ప్రయత్నాలు చేయడం వల్ల టీడీపీ నేతల్లో సామరస్యం తక్కువగా ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Embed widget