అన్వేషించండి

TDP Mahanadu 2026 Theme: మహానాడు-2026 - స్త్రీ శక్తి థీమ్‌తో టీడీపీ వార్షిక వేడుక.. 20 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం!

TDP Politburo Virtual Meeting :మే 27, 28 తేదీల్లో జరగనున్న టీడీపీ మహానాడు-2026 పై పొలిట్ బ్యూరో కీలక నిర్ణయాలు తీసుకుంది. 'స్త్రీ శక్తి' థీమ్, 20 తీర్మానాలను ఆమోదించారు.

Mahanadu 2026 Resolutions List:    తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ  మహానాడు  నిర్వహణపై ఆ పార్టీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది మే 27, 28 తేదీల్లో నిర్వహించనున్న  మహానాడు-2026 ను  స్త్రీ శక్తి థీమ్‌తో చేపట్టాలని గురువారం జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. ఇంధన పొదుపు  కారణంగా  ఆధునిక సాంకేతికతను జోడిస్తూ ఈ సమావేశాన్ని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు.    
 
 స్త్రీ శక్తి థీమ్‌తో పండుగలా నిర్వహణకు టీడీపీ సిద్ధం! 

పార్టీ ఆవిర్భావం నుండి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న తెలుగుదేశం పార్టీ, ఈసారి మహానాడును పూర్తిగా మహిళా శక్తిని ప్రతిఫలించేలా నిర్వహించాలని నిర్ణయించింది. వర్చువల్‌గా జరిగిన పొలిట్ బ్యూరో భేటీలో సీఎం చంద్రబాబు   టీడీపీ హయాంలో మహిళలకు కల్పించిన ఆస్తి హక్కు, రాజకీయ ప్రాతినిధ్యం ,  ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రధానంగా చర్చించాలని సూచించారు. మహానాడు వేదికపై జరిగే ప్రసంగాలు, ప్రదర్శనలు కూడా మహిళా సాధికారతను చాటిచెప్పేలా ఉండాలని ఆదేశించారు.

 మొత్తం 20 తీర్మానాలు - రాజకీయ ముసాయిదా సిద్ధం

ఈ మహానాడులో చర్చించి ఆమోదించడానికి మొత్తం 20 తీర్మానాలను పొలిట్ బ్యూరో ఖరారు చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 10, తెలంగాణకు సంబంధించి 4, అండమాన్ నికోబార్‌కు 1 తీర్మానం ఉండగా.. మరో 4 ఉమ్మడి తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఒక  కీలక రాజకీయ తీర్మానం  చేపట్టనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, వస్తున్న పెట్టుబడులు ,  ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ తీర్మానాలు ఉండనున్నాయి.   

 మన దేశం - మన బాధ్యత 

ఇంధన పొదుపు , పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన  మన దేశం-మన బాధ్యత  కార్యక్రమంపై మహానాడులో ప్రత్యేకంగా చర్చించనున్నారు. పొలిట్ బ్యూరో సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించడం ద్వారా తామే స్వయంగా పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే, గత ప్రభుత్వ అరాచకాలను, ప్రస్తుత ప్రభుత్వ పారదర్శకతను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నవతరం కార్యకర్తలకు ఎన్టీఆర్ సిద్ధాంతాలు, పార్టీ చరిత్ర తెలిసేలా ప్రత్యేక ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నారు.

 ప్రతి ఇంటిపై పసుపు జెండా - గ్రామగ్రామాన వేడుక      

మహానాడును కేవలం వేదికకే పరిమితం చేయకుండా, రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. రెండు రోజుల ముందు నుంచే ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగరేయాలని, అన్ని క్లస్టర్ల పరిధిలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి మహానాడును ప్రారంభించాలని పిలుపునిచ్చారు.                 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Breaking News: హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Embed widget