అన్వేషించండి

TDP Mahanadu 2026: మహానాడు వేదిక మార్పు - నెల్లూరు నుంచి మంగళగిరికి.. హైబ్రిడ్ మోడల్‌లో టీడీపీ వార్షిక వేడుకలు!

Nellore Mahanadu: తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడుని ఈ సారి హైబ్రీడ్ మోడల్‌కు మార్చారు. నెల్లూరులోపూర్తిగా రద్దు చేసి..పార్టీ ఆఫీసుతోపాటు వర్చువల్‌గా నిర్వహించనున్నారు.

Virtual Mahanadu:  తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ  మహానాడు నిర్వహణలో టీడీపీ అధిష్టానం కీలక మార్పులు చేసింది. తొలుత నెల్లూరు వేదికగా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించాలని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దీనిని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మే 27, 28 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈసారి మహానాడును పూర్తి ఆడంబరాలకు దూరంగా, కేవలం రెండు రోజుల పాటు హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు.  

 కేంద్ర కార్యాలయంలోనే ప్రధాన వేదిక 

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి భౌతికంగా  కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే నేతలను ఆహ్వానిస్తున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు పార్టీ అధికార ప్రతినిధులు మాత్రమే ఈ సభకు హాజరవుతారు. ప్రధాన తీర్మానాలు, చర్చలు , పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఈ వేదిక నుంచే చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. వేదిక మారినా మహానాడు సంప్రదాయాలు, తీర్మానాల ప్రక్రియలో ఎటువంటి మార్పు ఉండదని పార్టీ స్పష్టం చేసింది.

 డిజిటల్ పద్ధతిలో ఐదు లక్షల మంది భాగస్వామ్యం 

భారీ బహిరంగ సభకు బదులుగా టెక్నాలజీని వాడుకుంటూ కిందిస్థాయి కార్యకర్తలను అనుసంధానం చేయడమే ఈ హైబ్రిడ్ మోడల్ ప్రధాన ఉద్దేశ్యం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,848 క్లస్టర్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు తమ నియోజకవర్గాల నుంచే ఆన్‌లైన్ విధానంలో ఈ మహానాడుకు హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు,  ఎంపీలు తమ తమ నియోజకవర్గ కేంద్రాల నుంచే డిజిటల్ స్క్రీన్ల ద్వారా మంగళగిరి సభలో పాలుపంచుకుంటారు. దీనివల్ల భారీగా ఇంధనం, రవాణా ఖర్చులు ఆదా అవ్వడంతో పాటు సామాన్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడుతున్నారు.

 పొదుపు మంత్రం.. 

ప్రభుత్వ పరంగా పొదుపు చర్యలు పాటిస్తున్న తరుణంలో, పార్టీ పండుగను కూడా తక్కువ ఖర్చుతో అర్థవంతంగా నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి సానుకూల సంకేతాలు పంపాలని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ బహిరంగ సభ వల్ల అయ్యే కోట్లాది రూపాయల ఖర్చును నివారించి, ఆ సమయాన్ని పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉపయోగించాలని భావిస్తున్నారు. ఆడంబరాల కంటే పనితీరుకే ప్రాధాన్యత ఇస్తామని ఈ  హైబ్రిడ్ మహానాడు  ద్వారా టీడీపీ మరోసారి నిరూపించుకోనుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Embed widget