అన్వేషించండి

BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !

BJP New Office Bearers 2026: భారతీయ జనతా పార్టీలో వారసత్వానికి చోటు ఉందా? కింద స్థాయి నుంచి ఎదిగిన నరేంద్ర మోదీ, నితిన్ నబీన్, రామ్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డిల ప్రయాణం ఏం చెప్తోంది?

RSS ABVP to BJP Politics:  భారత రాజకీయాల్లో  వారసత్వం, కుటుంబ నేపథ్యం అనేది నాయకత్వ అర్హతగా మారిన తరుణంలో, భారతీయ జనతా పార్టీ  మాత్రం కింది స్థాయి కార్యకర్త నుంచి అగ్ర నాయకుడిగా ఎదిగే  సిద్ధాంతానికే మొగ్గు చూపుతోంది. ఇటీవల ప్రకటించిన పార్టీ కొత్త జాతీయ కార్యవర్గంలో సైతం ఈ తరహా క్యాడర్-బేస్డ్ లీడర్‌షిప్‌కే అధిష్ఠానం పెద్దపీట వేసింది. కేవలం ఒక పొలిటికల్ ప్యాషన్ , క్రమశిక్షణ, భావజాలం పట్ల అంకితభావంతో పనిచేసే సాధార‌ణ కార్యకర్తకు కూడా నంబర్-1 స్థానాన్ని అధిష్టించే అవకాశం కల్పించడమే తమ శ్రేణుల బలం అని బీజేపీ మరోసారి రుజువు చేసింది.

బీజేపీలో కింది స్థాయి నుంచే నేతలు

ఈ గ్రాస్‌రూట్ మోడల్ కు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే అతిపెద్ద ఉదాహరణ. గుజరాత్‌లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా, సాదాసీదా కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఎదిగిన విధానం బీజేపీ సిద్ధాంతానికి నిలువెత్తు సాక్ష్యం. తాజాగా పార్టీ అత్యున్నత అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన నితిన్ నబీన్ ప్రయాణం కూడా ఇందుకు భిన్నమైనది కాదు. యువజన మోర్చా స్థాయి నుంచి సుదీర్ఘకాలం పాటు క్షేత్రస్థాయిలో చెమటోడ్చి, కష్టపడి పనిచేసిన నైపుణ్యాన్ని గుర్తించే పార్టీ జాతీయ నాయకత్వ పగ్గాలను ఆయనకు అప్పగించింది.

సిద్ధాంతం కోసం పని  చేసే నైజం

కొత్త జాతీయ కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా ఎంపికైన రామ్ మాధవ్ ,  ఆల్ సెల్స్ కో కన్వీనర్‌గా స్థానం పొందిన విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతల ప్రయాణం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీల పునాదుల మీదే సాగింది. రామ్ మాధవ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో క్షేత్రస్థాయి స్వయంసేవక్‌గా పొలిటికల్ డిప్లొమసీని, సిద్ధాంత పటిష్టతను నేర్చుకుని బీజేపీ జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారారు. అలాగే ఏపీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి విద్యార్థి విభాగమైన ఏబీవీపీ  ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, ఎన్నో పోరాటాలు చేసి ఈ స్థాయికి చేరుకున్నారు. ఇవి కేవలం ఉద్యోగ బాధ్యతలు కావు, సిద్ధాంతం పట్ల ఉండే 'ప్యాషన్'.

ఫలితాలే ప్రాతిపదికగా గుర్తింపు 

అధికార మార్పిడి , పదవుల పంపకంలో  వారసత్వ రాజకీయాల ను పూర్తిగా పక్కనపెట్టడం బీజేపీకి సంస్థాగతంగా కొన్ని ప్రధాన ప్రయోజనాలను తెచ్చిపెడుతోంది.  ఏ మూలన ఉన్న సాధారణ శ్రేణి నేతలకైనా,  నేను కూడా రేపు జాతీయ స్థాయి నేతను కాగలను  అనే ఆశ, ఉత్సాహం నిరంతరం పని చేసేలా ప్రేరేపిస్తాయి. పక్షపాతం లేకుండా పనితీరు, ఫలితాలే ప్రాతిపదికగా ప్రమోషన్లు ఇవ్వడం వల్ల పార్టీ నడిపించే వ్యూహకర్తలకు క్షేత్రస్థాయి సమర్థత దక్కుతుంది.  ప్రత్యర్థి పార్టీలలో నడుస్తున్న  కుటుంబ పాలన ను నిలదీసే నైతిక బలం ఒక్క బీజేపీకే సాధ్యమవుతుంది.

కొన్ని సవాళ్లు కూడా !

 ఈ గ్రాస్‌రూట్ నాయకత్వ నమూనాలో కొన్ని అంతర్గత సవాళ్లు కూడా లేకపోలేదు. క్షేత్రస్థాయి నుంచి కష్టపడి వచ్చిన నేతలకు సిద్ధాంతపరమైన నిబద్ధత ఉన్నప్పటికీ, ఎన్నికల సమయంలో విభిన్న సామాజిక సమీకరణాలను, గ్లామరస్ పాపులిజమ్‌ను తట్టుకుని ఓట్లుగా మలచడం ఒక్కోసారి క్లిష్టంగా మారుతుంది. అంతేకాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చే మాస్ లీడర్లకు, కింది స్థాయి నుంచి ఎదిగిన ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్  ఉన్న 'ఆర్గనైజేషనల్' నేతలకు మధ్య సమన్వయం కుదర్చడం జాతీయ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారుతుంటుంది. బీజేపీ నిలకడగా విజయం సాధించడానికి, ఇతర ప్రాంతీయ పార్టీల వలె ఏ ఒక్క కుటుంబం చేతిలో చిక్కుకోకుండా ఉండటానికి ఈ  బాటమ్-టు-టాప్ విధానమే మూలస్తంభం. రాజకీయాన్ని వ్యాపారంగా కాకుండా ఒక బాధ్యతగా, ప్యాషన్‌గా భావించి రూట్ లెవెల్ నుంచి కష్టపడే వారికి బీజేపీలో ఎల్లప్పుడూ ప్రాధాన్యత దక్కుతుందనే సందేశాన్ని సరికొత్త జాతీయ కార్యవర్గ ఎంపిక మరోసారి స్పష్టంగా చాటిచెప్పింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget