అన్వేషించండి

Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?

Prabhas Upcoming Movies Latest Updates: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని 'స్పిరిట్', హను రాఘవపూడి దర్శకత్వంలోని 'ఫౌజీ' సెట్స్ మీద ఉన్నాయి. ప్రభాస్ మూవీస్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటంటే?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్ ఆలస్యం; ఈద్ విడుదల సందేహాస్పదం.
  • షూటింగ్ పెండింగ్‌తో సల్మాన్ ఖాన్ చిత్రంతో క్లాష్ తప్పవచ్చు.
  • 'ఫౌజీ' నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్; మూడు యూనిట్లతో షూటింగ్ వేగంగా.
  • ప్రభాస్ కీలక సన్నివేశాలు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ.

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఫుల్ బిజీ. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేస్తూ పాన్ ఇండియా సినిమాలను లైనులో పెట్టారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరో ఎవరంటే? ప్రభాస్ పేరు వినబడుతుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని 'స్పిరిట్', అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలోని 'ఫౌజీ' సెట్స్ మీద ఉన్నాయి. ఈ రెండు మూవీస్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటంటే?

'స్పిరిట్' విడుదలపై సందేహాలు...
ఈద్ సెలవులు సల్మాన్ సొంతమా?
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ 'స్పిరిట్'. వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. అది ఈద్ వీకెండ్‌. హిందీలో ఈద్ అంటే సినిమా ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది సల్మాన్ ఖాన్. రంజాన్ సీజన్‌లో ఆయన సినిమా విడుదల కావడం కామన్. వచ్చే ఏడాది ఈద్ బరిలో సల్మాన్ - వంశీ పైడిపల్లి సినిమా ఉంది. ఈసారి ఆయన సినిమాకు సోలో రిలీజ్ దక్కే అవకాశం ఉందని బాలీవుడ్ టాక్.

Also Read: NTR Trivikram Movie Title - గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్

'స్పిరిట్' షూటింగ్ ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ఈద్ ఫెస్టివల్ సీజన్‌లో విడుదల అయ్యే అవకాశం లేదని సమాచారం. ప్రస్తుతం 'స్పిరిట్'కి సంబంధించి ఇంకా 75 రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉందని, ఈద్ సమయానికి పూర్తి చేయడం కష్టమని తెలుస్తోంది. మరి సందీప్ రెడ్డి వంగా అండ్ ప్రభాస్ ఏం చేస్తారో చూడాలి. ఒకవేళ 'స్పిరిట్' గనుక వాయిదా పడితే... బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాతో బాక్సాఫీస్ క్లాష్ తప్పుతుంది.

'ఫౌజీ' కోసం మూడు యూనిట్లు!
'స్పిరిట్' సంగతి పక్కన పెడితే... మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ఫౌజీ' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ (డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను) పొందిన నెట్‌ఫ్లిక్స్ సంస్థ, డిసెంబర్ 3వ తేదీన ఎట్టిపరిస్థితుల్లో సినిమా విడుదల చేయాలని డెడ్‌లైన్ విధించిందట. అందుకని, మూడు యూనిట్లతో షూటింగ్ చేస్తున్నారట.

Also ReadAjay Arasada Meets Pawan Kalyan - పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ

ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రభాస్‌ మీద కీలక సన్నివేశాలను 'ఫౌజీ' యూనిట్ షూట్ చేస్తోంది. ప్రభాస్ పాత్రకు సంబంధించిన షూటింగ్ సెప్టెంబర్ లోపు పూర్తి చేస్తారని టాక్. ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్న 'ఫౌజీ' ఫస్ట్ లుక్ వైరల్ అయ్యింది. జంధ్యంతో ప్రభాస్ కనిపించడం... యుద్ధభూమిలో వీరుడిలా ఆయన లుక్ చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ అందరూ ఎగ్జైట్ అయ్యారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Also ReadVijay Son Jason Sanjay Sigma Release Date - గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో

Frequently Asked Questions

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు ఏమిటి?

ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్', అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' చిత్రాల్లో నటిస్తున్నారు.

'స్పిరిట్' సినిమా విడుదలపై సందేహాలు ఎందుకున్నాయి?

ఈద్ సెలవుల కోసం అనుకున్న విడుదల సమయానికి ఇంకా 75 రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉండటంతో సందేహాలు తలెత్తుతున్నాయి. సల్మాన్ ఖాన్ సినిమా కూడా ఈద్‌కు విడుదల కానుంది.

'ఫౌజీ' సినిమా షూటింగ్ ఎలా జరుగుతోంది?

నెట్‌ఫ్లిక్స్ విధించిన డిసెంబర్ 3 డెడ్‌లైన్ కారణంగా 'ఫౌజీ' షూటింగ్ మూడు యూనిట్లతో శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్ పాత్ర షూటింగ్ సెప్టెంబర్ లోపు పూర్తయ్యే అవకాశం ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget