'ఆయ్' సినిమా, 'సేవ్ ది టైగర్స్', 'వికటకవి', 'గుర్తుకొస్తున్నాయి' వంటి వెబ్ సిరీస్‌లకు అజయ్ అరసాడ సంగీతం అందించారు.
Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Ajay Arasada Meets Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, స్టార్ హీరో పవన్ కళ్యాణ్‌ను ఇటీవల యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ కలిశారు. ఆ మీటింగ్, కెరీర్ గురించి ఆయన ఇంటర్వ్యూ...

- అజయ్ అరసాడ టీసీఎస్ ఉద్యోగం విడిచి సంగీత రంగ ప్రవేశం చేసారు.
- పవన్ కళ్యాణ్ తన పనితీరును చూసి స్వయంగా పిలిచి మాట్లాడారు.
- పవన్ కళ్యాణ్ తన జనసేన/క్రియేటివ్ వర్క్స్ కోసం పనిచేయమని అడిగారు.
- అజయ్ అన్ని జానర్‌లలో పనిచేయాలని, ఓటీటీ నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చారు.
యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ (Ajay Arasada) పేరు సంగీత ప్రియులు కొందరికి తెలుసు. మెజారిటీ ప్రేక్షకులు ఆయనను చూసింది తక్కువ. మీడియా ముందుకు తక్కువగా వచ్చే అజయ్ అరసాడ... ఇటు సినిమాల్లో, అటు వెబ్ సిరీస్‌లలో తన మార్క్ చూపించారు. 'ఆయ్' సినిమాతో పాటు 'సేవ్ ది టైగర్స్', 'వికటకవి', 'గుర్తుకొస్తున్నాయి' వెబ్ సిరీస్‌లతో విజయాలు అందుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను కలిశారు అజయ్. ఆ మీటింగ్, అలాగే కెరీర్ గురించి ఆయన ఏం చెప్పారంటే?
సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల నా స్నేహితుడు. 'గూఢచారి'కి నన్ను కీ బోర్డ్ ప్రోగ్రామర్‌గా తీసుకున్నాడు. మా కుటుంబంలో, మా రక్తంలో సంగీతం ఉంది. మాది విశాఖ. మా కుటుంబంలో కళాకారులు ఉన్నారు. తొమ్మిదో తరగతి నుంచి గిటార్ నేర్చుకున్నాను. సంగీతం నేర్చుకుంటూ బాగా చదివా. టీసీఎస్‌లో ఉద్యోగం చేశా. ఏడేళ్ళు ఉద్యోగం చేశాక మానేశాను. అప్పటికే రెండు సినిమాలు చేశా. మా అమ్మ, భార్య మద్దతు వల్లే చిత్రసీమలోకి వచ్చా.
పవన్ బ్యానర్ కోసం చేద్దామన్నారు
మొదట ఉద్యోగం చేస్తూ సినిమాలకు వర్క్ చేసేవాడిని. తర్వాత ఉద్యోగం మానేసి ఇటు వచ్చేశా. జనసేన కోసం పాటలు చేశా. కొన్ని వీడియోలకు మ్యూజిక్ ఇచ్చా. నా వర్క్ చూసి పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. నాతో పర్సనల్‌గా మాట్లాడారు. అటు రాజకీయాల పరంగా లేదంటే పీకే క్రియేటివ్స్ వర్క్స్ (Pawan Kalyan Creative Works) బ్యానర్ కోసమైనా పని చేద్దామన్నారు.
పవన్ కళ్యాణ్ గారు కలుస్తారని ఫోన్ వచ్చినప్పుడు... 'నాతో పర్సనల్‌గా ఎందుకు మాట్లాడతారు?' అనుకున్నా. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీటింగ్ ఉందన్నారు. ఓ ఐదారు నిమిషాలు నాతో మాట్లాడి... ఫోటో ఇచ్చి పంపిస్తారనుకున్నా. నేను వెళ్లే సరికి ఆయనొక్కరే ఉన్నారు. దాదాపు అరగంట మాట్లాడారు. ప్రాజెక్ట్‌ల గురించి కాస్త డిస్కషన్ జరిగింది. ముందు చెప్పినట్టు ఆయనతో పని చేసే అవకాశం ఇస్తామని అన్నారు.
పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్ళినప్పుడు నాతో కాఫీ మగ్ షేప్‌లోని బోస్ స్పీకర్ తీసుకు వెళ్ళాను. 'ఇదేంటి?' అని అడిగారు. సరదాగా మాట్లాడారు. 'ఇదేంటి? కాఫీ కప్పులా ఉంది' అని జోక్ చేశారు. 'ఈయనేంటి? నాతో జోక్స్ వేస్తున్నారు?' అని లోలోపల సంబరపడిపోయా.
'ఆయ్'కు ఎలా అవకాశం వచ్చిందంటే?
జనసేనలో నా ఫ్రెండ్ వెంకట్ చిక్కాల ఎడిటర్. ఆయన ద్వారా అక్కడ పని చేసే అవకాశం వచ్చింది. జనసేనలో 'బన్నీ' వాస్ గారు పరిచయం అయ్యారు. అలా 'ఆయ్'కు పని చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత అరడజనుకు పైగా సినిమాలు చేశా.
Also Read: Ravi Teja Irumudi Censor Review - 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
సినిమాలే కాకుండా 'సేవ్ ద టైగర్స్' ఫ్రాంచైజీ, 'గుర్తుకొస్తున్నాయి', 'వికటకవి' వెబ్ సిరీస్‌లకు పని చేశా. వాటిలో కామెడీ సిరీస్‌లు ఉండటంతో అటువంటి జానర్ ఫిల్మ్ స్క్రిప్ట్‌లతో వస్తున్నారు. అయితే... సంగీత దర్శకుడిగా అన్ని రకాల జానర్ సినిమాలకు వర్క్ చేయాలని ఉంది. చిన్న పెద్ద అని సినిమాల్లో తేడాలు చూడను. నాకు చిన్న సినిమాలకు వర్క్ చేయడం వల్ల ఎప్పుడూ ఇబ్బంది కలగలేదు. ఇక డబ్బుల విషయంలోనూ ఎవరూ ఎగొట్టలేదు. పర్ఫెక్ట్ పేమెంట్ వచ్చేది.
ఓటీటీ ప్రాజెక్ట్ (వెబ్ సిరీస్)లకు వర్క్ చేసేటప్పుడు సినిమాలకు ఏమాత్రం తీసి పోని రీతిలో మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాం. థియేటర్లకు సరిపోయే మ్యూజిక్, స్కోర్ ఇస్తాం. ఓటీటీలో ఆ క్వాలిటీ వినిపించదు. అప్పుడు మా కష్టం వృథాయే. ఏఐ వల్ల సంగీత రంగంపై ఎటువంటి ప్రభావం ఉండదు. బాణీల్లో కొత్తదనం ఉండదు.
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Frequently Asked Questions
అజయ్ అరసాడ ఏ ఏ చిత్రాలు, వెబ్ సిరీస్‌లకు సంగీతం అందించారు?
అజయ్ అరసాడ పవన్ కళ్యాణ్‌ను ఎందుకు కలిశారు?
అజయ్ జనసేన కోసం పాటలు, వీడియోలకు సంగీతం అందించారు. ఆయన పనితీరు చూసి పవన్ కళ్యాణ్ పిలిపించి, భవిష్యత్తులో తన బ్యానర్ లేదా రాజకీయాల కోసం పని చేద్దామన్నారు.
సంగీత రంగంలోకి అజయ్ అరసాడ ఎలా ప్రవేశించారు?
తొమ్మిదో తరగతి నుంచి గిటార్ నేర్చుకున్న అజయ్, శ్రీచరణ్ పాకాల ద్వారా 'గూఢచారి'కి కీ బోర్డ్ ప్రోగ్రామర్‌గా చేరారు. ఏడేళ్లు టీసీఎస్‌లో ఉద్యోగం చేశాక, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిత్రసీమలోకి వచ్చారు.
'ఆయ్' సినిమాకు అజయ్ అరసాడకు అవకాశం ఎలా వచ్చింది?
జనసేనలో పరిచయమైన స్నేహితుడు వెంకట్ చిక్కాల ద్వారా అక్కడ పని చేసే అవకాశం వచ్చింది. అలా జనసేనలో 'బన్నీ' వాస్ పరిచయమై, ఆయన ద్వారా 'ఆయ్' సినిమాకు సంగీతం అందించే అవకాశం దక్కింది.
ట్రెండింగ్ వార్తలు





















