అన్వేషించండి

Arava Sridhar Resignation: అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా

Janasena MLA Railway Kodur: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. మహిళా ఉద్యోగి ఆరోపణల కారణంగా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

AP Government Whip Resignation: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నైతిక విలువల విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణల కారణంగా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ శనివారం తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన ఆయన, తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.

వివాదం ఏమిటి?    

రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ ఉదంతం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. పార్టీ ప్రతిష్టను కాపాడే క్రమంలో పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి, ముగ్గురు సభ్యులతో కూడిన ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా, విచారణ ముగిసేవరకు పదవి నుంచి తప్పుకోవాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది.

 పవన్ కళ్యాణ్ ముందు హనీట్రాప్  వాదన! 

పవన్ కళ్యాణ్‌తో జరిగిన అంతర్గత భేటీలో అరవ శ్రీధర్ తన వివరణ ఇచ్చుకున్నారు. సదరు మహిళతో తనకు పాత పరిచయం ఉన్న మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే, ఇదంతా తనపై జరిగిన రాజకీయ కుట్ర అని ఆయన వాదించారు. కొంతకాలంగా ఆమె తనను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు.  స్థానిక రాజకీయ ప్రత్యర్థులు కలిసి తన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి పన్నిన 'హనీట్రాప్' కుట్ర ఇదని చెబుతూ, దానికి సంబంధించిన కొన్ని కీలక డిజిటల్ డాక్యుమెంట్లు, ఆధారాలను పవన్ కళ్యాణ్ ముందు ఉంచినట్లు సమాచారం.  

 నైతికతకు పవన్ పెద్దపీట 

 తప్పు చేస్తే సొంత పార్టీ వారినైనా ఉపేక్షించేది లేదు  అని గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ మాట ప్రకారమే, ఆరోపణలు వచ్చిన వెంటనే పదవి నుంచి దూరం పెట్టి ప్రజల్లోకి ఒక బలమైన నైతిక సందేశాన్ని పంపారు. నిప్పులాంటి నిజం తేలేవరకు పదవిలో ఉండటం సముచితం కాదని భావించే రాజీనామా చేస్తున్నట్లు అరవ శ్రీధర్ మీడియాకు వెల్లడించారు.
 
వైఎస్సార్ జిల్లాలో జనసేనకు బలమైన పునాది వేసిన నేతల్లో శ్రీధర్ ఒకరు. అయితే, మహిళా ఉద్యోగి ఆరోపణలు పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారాయి. ఇప్పుడు రాజీనామా చేయించడం ద్వారా ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడ్డారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని పోలీసులకు కూడా పార్టీ సూచించింది.                             

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
Amaravati: అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget