IPL 2026 PBKS VS LSG Result Update: శ్రేయస్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అజేయ సెంచరీతో సత్తా.. నాకౌట్ ఆశలు సజీవం.. రాణించిన ప్రభ్ సిమ్రాన్.. టోర్నీ నుంచి ఢిల్లీ ఔట్
శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఫస్ట్ సెంచరీతో సత్తా చాటడంతో వరుసగా ఆరు పరాజయాల తర్వాత విజయం సాధించి, నాకౌట్ రేసులో దూసుకుపోయింది. ఈ విజయంతో ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

IPL 2026 PBKS VS LSG Latest Update: ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జులు విదిల్చింది. టేబుల్ బాటమ్ లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ పై 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. అంతకుముందు లక్నోలో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఓపెనర్ జోష్ ఇంగ్లీష్ స్టన్నింగ్ ఫిప్టీ (44 బంతుల్లో 72, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో మార్కో యన్సెన్, యజ్వేంద్ర చాహల్ తలో రెండు వికెట్లు తీశాడు. అనంతం ఛేజింగ్ ను పంజాబ్ కింగ్స్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో అజేయ సెంచరీ (51 బంతుల్లో 101 నాటౌట్, 11 ఫోర్లు, 5 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలవడంతో కేవలం 18 ఓవర్లలోనే 3 వికెట్లకు 200 పరుగులు చేసింది. బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఈ విజయంతో నాకౌట్ అవకాశాలు పంజాబ్ మెరుగుపర్చుకుంది. ఇక చివరి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ఓడిపోతే, పంజాబ్ ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఉంటుంది. ఇక పంజాబ్ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లు అయింది. ఇక ఆదివారం జరిగే డబుల్ హెడర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో రాజస్తాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.
𝙎𝙝𝙧𝙚𝙮𝙖𝙨 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 💯
— IndianPremierLeague (@IPL) May 23, 2026
A scintillating show in the chase and a 𝗺𝗮𝗶𝗱𝗲𝗻 #TATAIPL 𝗵𝘂𝗻𝗱𝗿𝗲𝗱 for Shreyas Iyer 👏
Updates ▶️ https://t.co/2ADKr4dqhi#KhelBindaas | #LSGvPBKS pic.twitter.com/Q5sabMbsOo
ఆరంభంలోనే షాక్..
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను మహ్మద్ షమీ డకౌట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే వన్ డౌన్ బ్యాటర్ కూపర్ కానోలీ (18) ని ఔట్ చేసి, షాకిచ్చాడు. ఈ దశలో మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ (39 బంతుల్లో 69, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి శ్రేయస్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. వీరిద్దరూ అలవోకగా లక్నో బౌలర్లను ఎదుర్కోవడంతో స్కోరుబోర్డు వేగంగా కదిలింది. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి 65 పరుగులు సాధించింది.
Read Also: Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
తొలి సెంచరీ..
ఇక గత లీగ్ మ్యాచ్ లో సెంచరీ చేసే అవకాశం వచ్చినప్పటికీ, చేజార్చుకున్న శ్రేయస్ ఈ మ్యాచ్ లో ఆ ముచ్చట తీర్చుకున్నాడు. పవర్ ప్లే ముగిసిన తర్వాత కూడా ఈ జంట ధాటిగా ఆడటంతో లక్నోక్లూ లెస్ అయిపోయింది. ఈక్రమంలో 28 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకోగా, 33 బంతుల్లో శ్రేయస్ అర్థ సెంచరీని కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన యార్కర్ తో ప్రభ్ సిమ్రాన్ ను ఔట్ చేయగా, మూడో వికెట్ కు నమోదైన 140 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రభ్ అవుటైనా, శ్రేయస్ మాత్రం తన జోరు కొనసాగించాడు. యువ బ్యాటర్ సూర్యాంశ్ షెడ్గే (9 నాటౌట్) తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇన్నింగ్స్ లాస్ట్ బంతికి సిక్సర్ కొట్టి, టోర్నీలో తొలి సెంచరీని శ్రేయస్ కంప్లీట్ చేసుకున్నాడు. సెంచరీతో అలరించిన అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
101* in his 101st #TATAIPL game as captain to bring up his first hundred in the league 🫡
— IndianPremierLeague (@IPL) May 23, 2026
A special knock from skipper Shreyas Iyer 💯
HIS KNOCK: https://t.co/tEGWPkE0hU#KhelBindaas | #LSGvPBKS pic.twitter.com/VLgkjZC2gr
Before You Go
Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
ట్రెండింగ్ వార్తలు



















