అన్వేషించండి

Sea Monster Leviathan Snake : లెవియాథన్ పాము బతికే ఉందట.. ప్రళయం తప్పదట.. ఇది కల్పితమా? నిజమా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే

Leviathan Snake : ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది. లెవియాథన్ పాము కూడా బతికే ఉంది. కొన్నిరోజుల్లో యుగాంతం వచ్చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. దీనిలో నిజమెంత?

Interesting Facts About the Leviathan Snake : ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఎన్నో వింతలు జరుగుతున్నాయి. నమ్మలేని విధంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. వాటిలో మెక్సికోలో ఓర్స్ ఫిష్ బయటకొచ్చింది. తాబేళ్లు కూడా షీ షోర్​కి వచ్చాయి. లెవియాథన్ పాము కూడా ఇంకా బతికే ఉంది. ఇవన్నీ యుగాంతాన్ని సూచించే సంకేతాలే అంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. 800 అడుగులు.. సారీ సారీ 800 కిలోమీటర్లు ఉండే ఈ పాము బయటకొస్తే ప్రపంచ ప్రళయం తప్పదట. అసలు దీనివెనకున్నా బ్యాక్ ఎండ్ స్టోరి ఏంటో తెలుసా? ఫిక్షనలా? రియలా? చూసేద్దాం. 

లెవియాథన్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు

లెవియాథన్ పాము గురించి ఇప్పుడొస్తున్న కథనాలు పక్కన పెడితే.. దీని గురించిన ప్రస్తావన ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. కొన్ని వందలు కాదండోయ్.. కొన్ని వేల ఏళ్ల వెనుక కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. పలు మత గ్రంథాలు.. లెవియాథన్​ పాముని వివిధ రకాలుగా వర్ణించాయి. ఈ పాము గురించి కొందరు బుక్స్ కూడా రాసి ప్రచురించారు. వాటి ప్రకారం లెవిథన్ సైజ్​ చాలా పెద్దది. 

కొన్ని మత గ్రంధాల ప్రకారం ఇది లెవియాథన్ 800 అడుగులు ఉంటుందట. సైజ్​లో ఇంత భారీగా ఉండే ఈ సముద్రపు జీవికి.. పొరలు పైన ఉంటాయట. ఇవి ఇనుము పొరల్లా ఉండి.. దానికి రక్షణ కవచంగా పనిచేస్తాయట. అలాగే దాని పళ్లు ఎంత స్ట్రాంగ్ ఉంటాయటే.. ఒక పెద్ద షిప్​ని కరిస్తే ముక్కలు ముక్కలు అయిపోతుందట. అది గర్జిస్తే నోటి నుంచి ఫైర్ వస్తుందట. ఇవన్నీ ప్రపంచాన్ని నాశనం చేసేందుకు దానికి హెల్ప్ చేస్తాయట. అలాంటి ఈ పాము సముద్రానికి అట్టడుగు భాగంలో ఉందని కథలుగా చెప్తున్నారు. 

అప్పుడే బయటకు వస్తుందట.. 

ఈ కథలను మెసపటోమియన్, క్రిస్టియన్స్​, జూయిష్ వంటి పలు మత గ్రంథాలను నమ్మే ప్రజలు సమర్థిస్తున్నారు. అయితే వేటిలో దీని ప్రస్తావన వచ్చినా.. చివర్లో చెప్పింది ఏంటంటే.. అది బయటకు వస్తే మాత్రం భూకంపం, ప్రళయం వస్తుందని చెప్తున్నారు. ప్రపంచంలో తప్పులు ఎక్కువైనప్పుడు, విచక్షణ కోల్పోయి ప్రజలు బిహేవ్ చేస్తున్నప్పుడు ఈ లెవియాథన్ బయటకు వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు అలాంటి సంకేతాలనే ఉన్నాయని.. లెవియాథన్ బయటకు వస్తే దాని చుట్టూ సముద్ర జంతువులు ఉండవని.. అందుకే సముద్రం నుంచి వివిధ జంతువులు బయటకు వచ్చేస్తున్నాయని అంటున్నారు. అలాగే దీనిని స్కాషియో ప్లేట్స్​కి రిలేట్ చేసి చెప్తున్నారు. 

స్కాషియా ప్లేట్స్ (Scotia Plates)

ఈ లెవియాథన్​ పాముకి స్కాషియా ప్లేట్స్​కి లింక్​ పెడుతూ కొందరు భయపడుతున్నారు. అసలు దానికి దీనికి లింక్ ఏంటంటే.. భూమి అనేది అనేక ప్లేట్స్ నిర్మితం. వాటిని టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. వీటి గురించి చాలామంది స్టడీ కూడా చేశారు. అయితే ఈ స్కాషియా ప్లేట్​ గురించి అంతగా రీసెర్చ్ చేయలేదు. ఇన్​ఫర్మేషన్​ కూడా తక్కువ. తక్కువ ప్లేస్​ ఉందేమో.. అందుకే తెలియట్లేదేమో అనుకుంటే పొరపాటే. ఇది దాదాపు 800 కిలోమీటర్లు ఉంటుంది. అయినా సరే దీని గురించిన సరైన డిటైల్స్ లేవట. ఇది అంటార్కిటికాకి, సౌత్ అమెరికాకి మధ్యలో ఉంది. ఆ లొకేషన్​ని మనం పైనుంచి చూస్తే అది పాము తలలా ఉంటుందట. దాని సైజ్ కూడా పరిగణలోకి తీసుకుంటే లెవియాథాన్ పాము ఊహలను నిజంచేసేలానే ఉంది. ఎందుకంటే ఈ స్కాషియా ప్లేట్స్ వెడల్పు 800 కిలోమీటర్లట. అందుకే కొందరు లెవియాథాన్ పామును 800 అడుగులకు బదులు 8 వందల కిలోమీటర్లు అంటున్నారు. 

కల్పితమా? వాస్తవమా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెవియాథన్​ని Sea Monsterగా చెప్తూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాగే స్కాషియో ప్లేట్ కూడా దాని రూపాన్ని పోలి ఉండడంతో ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ మ్యాప్ లుక్​ నిజమే అయినా.. సముద్ర రాక్షసుడిగా చెప్పే లెవియాథన్​ పూర్తిగా కల్పితమని చెప్తున్నారు. కొన్ని గ్రంథాల్లో ప్రస్తావన ఉందనే మాట నిజమే కానీ.. వాటి ప్రజలు నమ్మకపోవడమే మంచిదని చెప్తున్నారు. 

మరికొందరు ఇది చైనీస్ డ్రాగన్ లుక్​ని పోలి ఉందని చెప్తున్నారు. మరికొందరు ఇంట్రెస్టింగ్ టాపిక్​గా చూస్తుంటే.. కొందరు మాత్రం తమ మత గ్రంథాలు చెప్తున్నాయని.. ప్రళయం తప్పదని భయపడుతున్నారు. కానీ ఆన్​లైన్​లో​ చూసే ప్రతి అంశాన్ని నమ్ముతూ భయపడడం కరెక్ట్​ కాదని చెప్తున్నారు. పైగా ఈ మధ్య నిజాన్ని దాచేసే, ప్రజలను భయభ్రాంతులను చేసే ఎన్నో ఏఐ వీడియోలు కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి.. ఊహాగానాలకు దూరంగా, వాస్తవాలకు దగ్గరగా ఉంటే మంచిది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Traffic challan cyber scam: సైబర్ ఫ్రాడ్ అలర్ట్ - ట్రాఫిక్ చలాన్ అని మెసెజ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ !
సైబర్ ఫ్రాడ్ అలర్ట్ - ట్రాఫిక్ చలాన్ అని మెసెజ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ !
Bondi Beach Shooting: తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై పోలీసుల అప్డేట్‌
తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై పోలీసుల అప్డేట్‌
Gujarat News: ప్రేమించుకున్నాం పారిపోయి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు! వివాహ చట్టంలో సంచలన మార్పులు చేస్తున్న గుజరాత్‌ ప్రభుత్వం
ప్రేమించుకున్నాం పారిపోయి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు! వివాహ చట్టంలో సంచలన మార్పులు!

వీడియోలు

అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Traffic challan cyber scam: సైబర్ ఫ్రాడ్ అలర్ట్ - ట్రాఫిక్ చలాన్ అని మెసెజ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ !
సైబర్ ఫ్రాడ్ అలర్ట్ - ట్రాఫిక్ చలాన్ అని మెసెజ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ !
Bondi Beach Shooting: తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై పోలీసుల అప్డేట్‌
తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై పోలీసుల అప్డేట్‌
Gujarat News: ప్రేమించుకున్నాం పారిపోయి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు! వివాహ చట్టంలో సంచలన మార్పులు చేస్తున్న గుజరాత్‌ ప్రభుత్వం
ప్రేమించుకున్నాం పారిపోయి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు! వివాహ చట్టంలో సంచలన మార్పులు!
Karimnagar Cricketer Aman Rao : రాజస్థాన్ రాయల్స్‌లో చోటు దక్కించుకున్న కరీంనగర్‌ కుర్రాడు! 30 లక్షలకు కొనుగోలు 
రాజస్థాన్ రాయల్స్‌లో చోటు దక్కించుకున్న కరీంనగర్‌ కుర్రాడు! 30 లక్షలకు కొనుగోలు 
Director Kiran Kumar Death: తెలుగు చిత్రసీమలో విషాదం... నాగార్జున 'కేడీ' దర్శకుడు మృతి
తెలుగు చిత్రసీమలో విషాదం... నాగార్జున 'కేడీ' దర్శకుడు మృతి
Telangana Latest News: పోలవరం-బనకచర్ల, నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టుకు తెలంగాణ- ఏపీతోపాటు కేంద్ర సంస్థలను ఆపాలని రిక్వస్ట్‌ 
పోలవరం-బనకచర్ల, నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టుకు తెలంగాణ- ఏపీతోపాటు కేంద్ర సంస్థలను ఆపాలని రిక్వస్ట్‌ 
Nagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
Embed widget