సముద్రంలో 8 వందల కి.మీ పాము.. బయటకొస్తే ప్రళయమే!

Published by: Geddam Vijaya Madhuri

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెవియాథన్ పాము గురించి మీకు తెలుసా?

కొన్ని మత గ్రంథాల్లో దీని గురించిన ప్రస్తావన ఉంది. దీనిని సముద్ర రాక్షసుడిగా పేర్కొంటూ కొన్ని వ్యాఖ్యలు వాటిలో ఉన్నాయి.

అయితే ఇది సముద్రపు అత్యంత అడుగు భాగంలో ఉందని.. అది బయటకు వస్తే ప్రళయం తప్పదని వాటి సారాంశం.

ఈ పాము దాదాపు 800 అడుగులుగా కొందరు చెప్తుంటే.. మరికొందరు 800 కిలోమీటర్లు ఉందని చెప్తున్నారు.

ఈ పాము శరీరంపై చేపలకున్నట్లే పొరలు ఉంటాయట. కానీ అవి ఐరన్ మాదిరిగా ఉంటాయని. కోసుకునేంత షార్ప్ ఉంటాయని చెప్తున్నారు.

అలాగే దాని పళ్లు ఎంత స్ట్రాంగ్​గా ఉంటాయంటే పెద్ద షిప్​ని కరిస్తే అది చిన్న ముక్కలుగా విడిపోతుందని చెప్తున్నారు.

లెవియాథన్ గర్జిస్తే దాని నోటి నుంచి మంట వస్తుందని.. అది ప్రపంచాన్ని నాశనం చేస్తుందంటున్నారు.

వరల్డ్ మ్యాప్లో ఓ ప్రాంతం కూడా లెవియాథన్ ముఖాన్ని పోలి ఉండడంతో చాలామంది దీనిని నమ్ముతున్నారు.

నిపుణులు మాత్రం అవన్నీ ఊహాగానాలని.. రూమర్స్​ని నమ్మకపోవడమే మంచిదని చెప్తున్నారు.