Obesity : అధిక బరువునకు కారణాలివే.. యువత ఒబెసిటీని కంట్రోల్ చేయాలంటే ఇవి కచ్చితంగా ఫాలో అవ్వాలి
Obesity Causes : ఊబకాయం సమస్య చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది రావడానికి కారణాలు ఉన్నాయి? అవేంటో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Obesity in Young People : శరీరంలో ఉండాల్సిన కొవ్వుకంటే ఎక్కువగా కొవ్వుకు పేరుకుపోవడం వల్ల అధికబరువు పెరుగుతారు. దీనివల్ల ఊబకాయం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీని బాధితులు పెరుగుతున్నారు. ప్రతి పది మందిలో 7 మంది అధిక బరువు లేదా ఊబకాయంతో సఫర్ అవుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. 2 సంవత్సరాల నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లల్లో కూడా ఇది 20 శాతం ఉంది. యుక్తవయసులను కూడా ఇది ప్రభావితం చేస్తుండడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధిక బరువు, ఊబకాయం వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. అయితే ఈ ఒబేసిటికి డీఎన్ఏ, ఫ్యామిలీ చరిత్ర ఓ కారణమైతే.. లైఫ్‌స్టైల్ కూడా ఇప్పుడు ప్రధానకారణంగా మారింది. ఆహారపు అలవాట్లు, తగినంత నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, కొన్ని మందుల వల్ల ఈ సమస్య పెరుగుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్యవల్ల కార్డియోవాస్కులర్ సమస్యలు పెరగడమే కాకుండా.. మరణాలకు ప్రధాన కారణంగా మారుతుంది. టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఇలా గుర్తించొచ్చు..
ఈ ప్రమాదకరమైన సమస్యను వీలైనంత త్వరగా గుర్తించి.. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలంటున్నారు. దీనిని గుర్తించడానికి బాడీ మాస్ ఇండెక్స్ అనే స్క్రీనింగ్ విధానం ద్వారా గుర్తించొచ్చు. ఓ వ్యక్తి ఎత్తు, బరువు, శరీరంలోని కొవ్వు శాతాన్ని అంచనా వేసి.. ఒబేసిటీని గుర్తిస్తారు. మీ BMI సాధారణ పరిధి కంటే ఎక్కువగా ఉంటే మీరు అధిక బరువు లేదా ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారని అర్థం. అంతేకాకుండా వివిధ టెస్ట్‌ల ద్వారా కూడా వైద్యులు సూచిస్తారు. ఇది ఏ స్టేజ్‌లో ఉందో.. ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుందో.. ఇతర ఆరోగ్య సమస్యలకు ఎలా కారణమవుతుందో చెప్తారు.
ప్రమాద కారకాలివే..
ఈ మధ్యకాలంలో ఒబెసిటీ పెరగడానికి స్మార్ట్ ఫోన్ కూడా ఓ కారణమవుతుంది. ఫోన్‌కి ఎక్కువగా అలవాటై.. సరైన నిద్రలేక, శారీరక శ్రమపై ఆసక్తి లేక్, ఫుడ్ ఆర్డర్స్ ఇస్తూ చాలామంది ఈ సమస్య బారిన పడుతున్నారు. ప్రాసెస్ చేసిన, అధిక కేలరీల ఫుడ్, డ్రింక్స్ తాగడం ఒబెసిటీకి ప్రమాద కారకాలుగా చెప్తున్నారు. స్మార్ట్‌ఫోన్ ప్రజల్ని సోమరిపోతులుగా మారుస్తుందని ఓ స్టడీ కూడా తేల్చి చెప్పింది. దీనివల్ల కూడా అధిక బరువు పెరుగుతున్నారు. ఈ ఒబెసిటీ మధుమేహం, ఒత్తిడి, బీపీని ప్రేరేపించడంతో పాటు.. వాటివల్ల కూడా రిటర్న్‌లో పెరుగుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తక్కువ కేలరీలు ఉండే ఫుడ్ తీసుకోవడం.. అన్‌హెల్తీ ఫ్యాట్స్ జోలికి వెళ్లకపోవడం, గుండె ఆరోగ్యానికై హెల్తీ డైట్ ఫాలో అవ్వడం మంచి ఫలితాలు ఇస్తాయి. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, తృణధాన్యాలు, నట్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది. శారీరక వ్యాయామం కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. వారంలో కనీసం 150 నిమిషాలైనా ఎక్స్‌ర్‌సైజ్ చేస్తే మంచిది. ఈ సమస్యను గుర్తించిన వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలి. ప్రొపర్ డైట్ ఫాలో అవ్వాలి. పోషకాలతో కూడిన ఆహారం ఆరోగ్యం విషయంలో కీలకపాత్ర పోషిస్తుంది.
Also Read : మధుమేహం ఈ మధ్యే వచ్చిందా? అయితే ఈ డైట్ ప్లాన్‌ని ఫాలో అవుతూ.. లైఫ్ స్టైల్లో ఈ మార్పులు చేసేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

