యాపిల్స్ రోజూ తింటే ఆరోగ్యానికి చాలామంచిది. సమ్మర్​లో తింటే మరిన్ని లాభాలున్నాయి. అవేంటంటే..

యాపిల్స్​లో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది సమ్మర్​లో డీహైడ్రేషన్​ని దూరం చేస్తుంది.

వీటిలోని యాంటీఆక్సిడెంట్​ లక్షణాలు శరీరంలోని వేడిని దూరం చేసి.. ఫ్రీరాడికల్స్​నుంచి రక్షిస్తాయి.

యాపిల్స్​లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సమ్మర్​లో వచ్చే జీర్ణసమస్యలను దూరం చేస్తుంది.

వీటిలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.

విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది స్కిన్​ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది. సన్​ డ్యామేజ్​ను తగ్గిస్తుంది.

వీటిని స్నాక్​గా, సలాడ్స్​లో కలిపి తీసుకోవచ్చు. పిల్లలకు కూడా వీటిని ఇవ్వొచ్చు.

యాపిల్ జ్యూస్​గా లేదా యాపిల్ ఇన్​ఫ్యూజ్డ్ వాటర్​గా తీసుకోవచ్చు. సమ్మర్​లో రిఫ్రెషింగ్​గా ఉంటుంది.

రోజుకు 1 లేదా 2 యాపిల్స్ తీసుకుంటే మంచిది. బరువు తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.