Earthquake: పపువా న్యూగినియాలోలో భారీ భూకంపం, 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలతో సునామీ వార్నింగ్
Papua New Guinea Earthquake: పపువా న్యూగినియాలోలో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపు తీవ్రత 6.9తో భూమి కంపించినట్లు అమెరికా నిపుణులు తెలిపారు.

Earthquake strikes Papua New Guinea | ఈ ఏడాది భారత్‌తో పాటు పలు దేశాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇటీవల మయన్మార్ లో సంభవించిన భారీ భూకంపం దాదాపు 3 వేలకు పైగా ప్రాణాలు బలి తీసుకుంది. తాజాగా పపువా న్యూగినియాలోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు.
శనివారం ఉదయం పపువా న్యూ గినియాలో భారీ భూకంపం సంభవించింది. 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో మొదట పపువా న్యూ గినియాకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం అదికారులు సునారీ వార్నింగ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన జారీ చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. యూఎస్ బయోలాజికల్ సర్వే ప్రకారం 10 కిలోమీటర్ల లోతులో పసిఫిక్ ద్వీప దేశాన్ని భూకంపం ప్రభావితం చేసింది. న్యూ బ్రిటన్ ద్వీపంలోని కింబే పట్టణానికి తూర్పున 194 కి.మీ దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది.
4 high magnitude (> M6) #Earthquake since 1st April
— A. Kumar (@kaknki_) April 5, 2025
32 #earthquake of magnitude > M5 since 1st April
Shows the increasing occurrence of earthquake and potential for a much bigger one.
. pic.twitter.com/2GdARQBFYx
భూకంపం సంభవించిన సమయంలో పపువా న్యూ గినియా తీరంలో కొన్ని ప్రాంతాలలో 1 నుంచి ఏకంగా 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడతాయని అధికారులు మొదట హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత పసిఫిక్ ప్రాంతంలో జారీ అయిన సునామీ హెచ్చరిక కేంద్రం వెంటనే ప్రకటనను ఉపసంహరించుకుంది. సమీపంలోని సోలమన్ దీవులకు 0.3 మీటర్ల ఎత్తులో చిన్న అలలు ఎగసిపడతాయన్న హెచ్చరికను కూడా ఉపసంహరించుకున్నారు. న్యూ బ్రిటన్ ద్వీపంలో 500,000 మందికి పైగా నివసిస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి నష్టం జరిగినట్లు, వార్తలు, నివేదికలు రాలేదు. నష్ట తీవ్ర తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
పపువా న్యూ గినియాకు అత్యంత పొరుగు దేశమైన ఆస్ట్రేలియా వాతావరణ శాస్త్ర నిపుణులు సునామీ ముప్పు లేదని తెలిపారు. న్యూజిలాండ్‌కు సైతం ఎలాంటి భూకంపం, సునామీ హెచ్చరిక జారీ కాలేదు. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న భూకంప వలయంలో పపువా న్యూ గినియా ఉంది. దాంతో ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. సునామీ రావడానికి అవకాశాలు సైతం అధికంగా ఉంటాయి. అగ్నిపర్వతాలు చురుకుగా ఉంటాయి. అగ్నిపర్వతాల నుంచి లావా బయటకు రావడం, బద్ధలవడం లాంటివి ఎక్కువగా జరుగుతాయని నిపుణులు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

