LSG vs MI Match Highlights IPL 2025 | ముంబై పై 12పరుగుల తేడాతో లక్నో ఘన విజయం | ABP Desam
ఆడిన మూడు మ్యాచులకు మూడూ ఓడిపోయిన ముంబై ఇండియన్స్ ఇవాళ నాలుగో మ్యాచ్ అయినా గెలిచి తన గెలుపు స్ట్రీక్ మొదలుపెడుతుంది ఎక్స్ పెక్ట్ చేసిన MI ఫ్యాన్స్ కి ఈ రోజు నిరాశే ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో టార్గెట్ ఛేజ్ చేయలేక మ్యాచ్ ను LSG కి అప్పగించి ముంబై ఇండియన్స్ నాలుగో పరాజయాన్ని చవి చూసిన ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. మిచ్ మార్ష్ మాస్
లక్నో ఎకానా స్టేడియంలో టాస్ గెలిచి లక్నోనే బ్యాటింగ్ చేయాలని ఆహ్వానించిన ముంబై ఇండియన్స్ స్టార్టింగ్ లోనే ఫీల్ అయ్యి ఉంటుంది ఎందుకంటే మిచ్ మార్ష్, మరో ఓపెనర్ ఏడెన్ మార్ క్రమ్ తో కలిసి అంత స్ట్రాంగ్ పార్టనర్ షిప్ ను పెట్టాడు. అసలు మ్యాచ్ లో మార్ క్రమ్ ఉన్నాడో లేదా డౌట్ వచ్చేలా బల్స్ అనీ తనే ఫేస్ చూస్తూ రాకెట్ వేగంతో హాఫ్ సెంచరీ కొట్టేశాడు మిచ్ మార్ష్. 31 బాల్స్ లో 9 ఫోర్లు 2 సిక్సర్లతో 60 పరుగులు చేసి అవుటైపోయాడు. మార్ష్ అవుటయ్యేప్పటికి టీమ్ స్కోరు 76 పరుగులంటే అర్థం చేసుకోవచ్చు..మ్యాచ్ లో ఎంతెలా విజృంభించాడో.
2. కూల్ అండ్ కామ్ మార్ క్రమ్
మార్ష్ ఆడుతున్నంత సేపు దాక్కుని దాక్కుని తిరిగిన మార్ క్రమ్ వన్స్ మార్ష్ అయిపోయిన తర్వాత మాత్రం రెచ్చిపోయాడు. 38 బాల్స్ లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 53పరుగులు చేసి హార్దిక్ బౌలింగ్ లో అవటయ్యాడు మార్ క్రమ్. మార్ క్రమ్ తర్వాత చివర్లో బడోని, డేవిడ్ మిల్లర్ లు క్యామియోలు ఆడటం తప్ప పంత్ సహా మిగిలిన బ్యాటర్లు విఫలం అవ్వటంతో ఇంకా భారీ స్కోరు చేయాల్సిన లక్నో 203 పరుగులు చేసింది.
3. ఫైరీ హార్దిక్ పాండ్యా
లక్నో మ్యాచ్ పై కంప్లీట్ డామినెన్స్ చూపించినా వాళ్ల బ్యాటర్లను రెగ్యూలర్ ఇంటర్వెల్స్ లో ఇంటికి పంపుతూ తన కెప్టెన్సీ షో చూపించాడు హార్దిక్ పాండ్యా. మార్ క్రమ్, పూరన్, పంత్, డేవిడ్ మిల్లర్ లాంటి లక్నో తోపు బ్యాటర్లందరినీ పెవిలియన్ కు పంపాడు పాండ్యా. చివర్లో ఆకాశ్ దీప్ వికెట్ కూడా తీసి 4 ఓవర్లలో 36పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయటం ద్వారా సంచలన ప్రదర్శన చేశాడు పాండ్యా
4. ఆశలు రేపిన సూర్య
కళ్ల ముందు భారీ స్కోరున్నా గాయం కారణంగా మ్యాచ్ ఆడకపోయినా..ఓపెనర్లు విల్ జాక్స్, ర్యాన్ రికెల్టెన్ దారుణంగా ఫెయిల్ అయినా ముంబై పోరాడింది అంటే కారణం సూర్య కుమార్ యాదవ్. నమన్ ధీర్ తో కలిసి ముంబైని గెలిపించాలని తీవ్రంగా ప్రయత్నించాడు స్కై. 43 బాల్స్ లో 9 ఫోర్లు 1 సిక్సర్ తో 67 పరుగులు చేశాడు. నమన్ ధీర్ 46 పరుగులు చేయటంతో ముంబై మ్యాచ్ పై ఆశలైతే పెట్టుకుంది.
5. ఫైనల్ ఓవర్స్ డ్రామా
రెండు ఓవర్లలో 28 పరుగులు చేయాలి గెలవాలంటే క్రీజులో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఉన్నారు. ఈ టైమ్ లో తిలక్ పరుగులు చేయాటనికి బాగా ఇబ్బంది పడ్డాడు. మే బీ తను ఇంజ్యూర్డ్ అనుకుంటా ఎక్కువగా బాల్ స్ట్రైక్ చేయలేకపోయాడు. బంతులు వృథా ఎందుకు అన్నాడో ఏమో రిటైర్డ్ హర్ట్ ఇచ్చి వెళ్లిపోయాడు. 19 ఓవర్ లో 7 పరుగులే వచ్చాయి. తర్వాత ఓవర్ మొదటి బంతికి పాండ్యా సిక్స్ కొట్టడంతో ముంబై ఏమన్నా అద్భుతం చేస్తుందా అన్న టెన్షన్ వచ్చింది కానీ LSG బౌలర్ ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేయటంతో లక్నోను ముంబైని ఓడించి 12 పరుగుల తేడాతో మ్యాచ్ ను కైవసం చేసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడిన అన్ని మ్యాచులు ఓడిన ముంబైకి ఇది నాలుగో ఓటమి కాగా...LSG కి నాలుగు మ్యాచుల్లో రెండో విజయం ఇది.





















