IPL 2025 Records: ఐపీఎల్ అరంగేట్రంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, తొలి బంతికే వికెట్- ఎవరీ అశ్వనీ కుమార్
IPL 2025 MI vs KKR Highlights | ఐపీఎల్ అరంగేట్రంలో అత్యధిక వికెట్లు తీసిన దేశీ బౌలర్ గా అశ్వనీ కుమార్ నిలిచాడు. ఐపీఎల్ కెరీర్ లో తొలి బంతికే వికెట్ సైతం పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసర్ అశ్వనీ కుమార్ చరిత్ర సృష్టించాడు. యువ పేసర్ ఐపీఎల్ అరంగేట్రంలోనే 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. దాంతో ఐపీఎల్ అరంగేట్రంలో భారత్‌కు చెందిన ఓ బౌలర్ నమోదు చేసిన అత్యుత్తమ బౌలింగ్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన IPL 2025 మ్యాచ్ అశ్వనీ కుమార్ డిఫెండింగ్ ఛాంపియన్లను హడలెత్తించాడు. 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి ముంబై బౌలర్ అశ్వనీ కుమార్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ కు సీజన్ లో తొలి విజయాన్ని అందించి అరంగేట్రంలో అదుర్స్ అనిపించుకున్నాడు.
అవకాశాన్ని అందిపుచ్చుకున్న పేసర్
డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన పేసర్ అశ్వని కుమార్ మొహాలీలో జన్మించాడు. 2022 లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో పంజాబ్ తరఫున అరంగేట్రం చేశాడు. నాలుగు మ్యాచ్లు ఆడిన అశ్వని కుమార్ 6 కంటే తక్కువ ఎకానమీతో మూడు వికెట్లు తీశాడు. 2024 లో జరిగిన షేర్ ఏ పంజాబ్ t20 టోర్నీలో సత్తా చాటడంతో వార్తల్లో నిలిచాడు. రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో నాలుగు ఎకనామితో 3 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ కింగ్స్ అశ్విని కుమార్ ను తీసుకుంది కానీ గత ఏడాది ఒక్క మ్యాచ్ ఆడేందుకు సైతం అవకాశం దక్కలేదు. గతేడాది చివర్లో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ పేసర్ అశ్వని కుమార్ ను తీసుకుంది.
ASHWANI KUMAR DISTURBING ANDRE RUSSELL'S TIMBERS ON DEBUT. 🥶pic.twitter.com/UIOvCb5gjP
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 31, 2025
సీజన్లో మూడో మ్యాచ్లో పేసర్ అశ్విని కుమార్ కు ఛాన్స్ ఇచ్చింది. ఐపీఎల్ కెరీర్ లో తొలి బంతికే వికెట్ పడగొట్టి అరుదైన జాబితాలో నిలిచాడు. తిలక్ వర్మ ఇబ్బంది పడినప్పటికీ చివరికి బంతిని అందుకోవడంతో రహానే ఔటయ్యాడు. ఐపీఎల్ కెరీర్ లో ఇదే తనకు తొలి వికెట్. ఆపై ఒకే ఓవర్‌లో కేకేఆర్ బ్యాటర్లు రింకు సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్ మనీశ్ పాండేను సైతం ఔట్ చేశాడు. పవర్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్‌ను సైతం పెవిలియన్ చేర్చడంతో అరంగేట్రంలో నాలుగు వికెట్లు తీసిన తొలి దేశీ బౌలర్ గా నిలిచాడు.
IPL అరంగేట్రంలో దేశీ బౌలర్ అత్యుత్తమ బౌలింగ్
- 4/24 - అశ్వనీ కుమార్ (ముంబై ఇండియన్స్) vs కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై 2025
- 3/9 - అమిత్ సింగ్ (రాజస్థాన్ రాయల్స్) vs పంజాబ్ కింగ్స్, డర్బన్ 2009
- 3/20 వైషాక్ విజయ్‌కుమార్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) vs ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు 2023
- 3/21 సందీప్ శర్మ (పంజాబ్ కింగ్స్) vs సన్‌రైజర్స్ హైదరాబాద్, మొహాలి 2013
- 3/23 మయాంక్ మార్కండే (ముంబై ఇండియన్స్) vs చెన్నై సూపర్ కింగ్స్, ముంబై 2018
- 3/30 - సుయాష్ శర్మ (కోల్‌కతా నైట్ రైడర్స్) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా 2023
- 3/32 - విఘ్నేష్ పుత్తూర్ (ముంబై ఇండియన్స్) vs చెన్నై సూపర్ కింగ్స్, చెన్నై 2025
- 3/42 - జీషన్ అన్సారీ (సన్‌రైజర్స్ హైదరాబాద్) vs ఢిల్లీ క్యాపిటల్స్, వైజాగ్ 2025





















