Coolie Movie Release Date: రజనీకాంత్ 'కూలీ' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - ఎన్టీఆర్ 'వార్ 2'కు పోటీయేనా!
Rajinikanth Coolie Movie: సూపర్ స్టార్ రజనీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'కూలీ' ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న థియేటర్లలోకి రానుంది.

Rajinikanth's Coolie Movie Official Release Date: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), లోకేశ్ కనగరాజ్ (Lokesh kanagaraj) కాంబో మోస్ట్ అవెయిటెడ్ మూవీ కూలీ (Coolie). ఈ మూవీ రిలీజ్ కోసం తలైవా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మూవీ రిలీజ్‌పై టీం అదిరే అప్ డేట్ ఇచ్చింది.
థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న రిలీజ్ కానున్నట్లు మూవీ టీం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్, శ్రుతిహాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఓ కీలక రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నారు. గోల్ట్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా రూపొందింది. కింగ్ నాగార్జున ఇందులో నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Sound-ah yethu! 📢 Deva Varraaru🔥 #Coolie worldwide from August 14th 😎 @rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @ArtSathees @iamSandy_Off @Dir_Chandhru… pic.twitter.com/KU0rH8kBH7
— Sun Pictures (@sunpictures) April 4, 2025
'వార్ 2' మూవీకి పోటీయేనా..
మరోవైపు, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన అవెయిటెడ్ మూవీ 'వార్ 2' సైతం అదే రోజు థియేటర్లలోకి రాబోతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ సినిమాతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండడం క్రేజీ కాంబో కావడంతో భారీగా హైప్ నెలకొంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ 'రా' ఏజెంట్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ 'వార్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించగా దానికి సీక్వెల్‌గా 'వార్ 2' వస్తోంది. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇదే రోజున రజనీకాంత్ 'కూలీ' సినిమా కూడా రిలీజ్ అవుతుండడంతో ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజో అని ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు.. కూలీకి వార్ 2 పోటీగా నిలుస్తుందని రెండు సినిమాలు మంచి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ఆసక్తి నెలకొంది.






















