అన్వేషించండి

IPL 2026 Mohammed Shami: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా అరుదైన ఘనత

Mohammed Shami Wickets on First Ball IPL: పంజాబ్ కింగ్స్‌తో శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో ప్రియాంష్ ఆర్య వికెట్ తీయడంతో మహమ్మద్ షమీ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.

IPL 2026 LSG vs PBKS |  ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో మహ్మద్ షమీ (Mohammed Shami) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) బ్యాటర్ ప్రియాంశ్ ఆర్యను తొలి బంతికే అవుట్ చేయడం ద్వారా ఈ చారిత్రాత్మక రికార్డును షమీ నెలకొల్పాడు. ఈ వికెట్ ద్వారా షమీ ఇప్పుడు ఐపీఎల్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింగ్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

పంజాబ్ కింగ్స్ జట్టు 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగింది. ప్లే ఆఫ్ ఆశలు నిలుపుకోవాలంటే ఈ మ్యాచులో పంజాబ్ కచ్చితంగా విజయం సాధించాలి. మహ్మద్ షమీ ఇన్నింగ్స్ మొదటి బంతికే పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను ఔట్ చేశాడు. అర్జున్ టెండూల్కర్ క్యాచ్ పట్టడంతో ప్రియాంశ్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో షమీ ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీయడం ఇది మొత్తంగా ఆరోసారి. ఈ విషయంలో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను వెనక్కి నెట్టాడు.

Also Read: Virat Kohli vs Travis Head : కోహ్లీ... నీకు అంత అహంకారమా? హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంపై నెటిజన్లు ఫైర్!

ఆర్చర్ ఐపీఎల్ ఇన్నింగ్స్ మొదటి బంతికి 5 సార్లు వికెట్ పడగొట్టాడు. ఈ జాబితాలో నంబర్-3 లో ముంబై తరఫున ఆడుతున్న ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. బౌల్ట్ ఇన్నింగ్స్ మొదటి బంతికి 3 సార్లు వికెట్లు పడగొట్టాడు.

IPL ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్:

6 సార్లు - మహ్మద్ షమీ

5 సార్లు - జోఫ్రా ఆర్చర్

3 సార్లు - ట్రెంట్ బౌల్ట్

ఐపీఎల్ 2026 సీజన్ మహ్మద్ షమీకి అంతగా కలిసిరాలేదు. లక్నో బౌలర్ షమీ ఇప్పటివరకు ఈ సీజన్ మొత్తంలో 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 12 వికెట్లు మాత్రమే తీశాడు. మొత్తం టీ20 క్రికెట్ విషయానికి వస్తే, ఇన్నింగ్స్ మొదటి బంతికే అత్యధిక వికెట్లు తీసిన రికార్డు షాహీన్ అఫ్రిది, ల్యూక్ వుడ్ పేరిట ఉంది. ఈ బౌలర్లు ఇన్నింగ్స్ తొలి బంతికే 9 సార్లు వికెట్లు పడగొట్టారు.

ఐపీఎల్ 2026లో మహ్మద్ షమీ ఇన్నింగ్స్ తొలి ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ సీజన్‌లో షమీ 13 సార్లు ఇన్నింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ వేయగా, అందులో కేవలం 7.23 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చి 5 వికెట్లు కూడా పడగొట్టాడు.

Also Read: Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lalit Modi Interview:
"నేను, మోదీ చాలా క్లోజ్‌, త్వరలోనే భారత్‌ వస్తాను" లలిత్ మోడీ కీలక స్టేట్మెంట్
Lalit Modi On Dawood Ibrahim:
"ఆ ఫోన్ కాల్‌తో ప్యాంట్‌ తడిసిపోయింది, అందుకే క్రికెట్‌ను వదిలేశా" దావూద్ ఇబ్రహీం బెదిరింపులపై లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
Vaibhav Sooryavanshi: చిచ్చరపిడుగు సూర్యవంశీకి మరో అరుదైన ఘనత! అతని మైండ్‌ సెట్‌పై ఐఐఎం ఇండోర్ పరిశోధన!
చిచ్చరపిడుగు సూర్యవంశీకి మరో అరుదైన ఘనత! అతని మైండ్‌ సెట్‌పై ఐఐఎం ఇండోర్ పరిశోధన!
India Next T20 Squad Based on IPL:  ఐపీఎల్ 2026 పర్ఫార్మెన్స్ తో న‌యా టీమిండియా ఇలా..! సంచలన లైనప్ తో టీ20 కిర్రాక్ స్క్వాడ్
ఐపీఎల్ 2026 పర్ఫార్మెన్స్ తో న‌యా టీమిండియా ఇలా..! సంచలన లైనప్ తో టీ20 కిర్రాక్ స్క్వాడ్
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget