అన్వేషించండి

Honda City Facelift News: కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ లాంచ్: కారును పూర్తిగా మార్చేసిన టాప్ 5 మేజర్ అప్‌డేట్స్ ఇవే

హోండా కార్స్ ఇండియా సరికొత్త డిజైన్, ఇంటీరియర్ చేంజ్స్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కూడిన 2026 సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

Five Big Updates In 2026 Honda City Facelift: ఇండియ‌న్ ఆటోమొబైల్ మార్కెట్లో సుదీర్ఘ చరిత్ర కలిగిన హోండా సిటీ సెడాన్ కారు సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ. 12 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ అనౌన్స్ చేసింది. మిడ్‌సైజ్ సెడాన్ సెగ్మెంట్ లో తన మార్కెట్ ను కాపాడుకోవడానికి హోండా ఈ కారులో ఐదు ముఖ్యమైన మార్పులు చేసింది. మునుపటి మోడల్ తో పోలిస్తే ఈ కొత్త వెర్షన్ మరింత మోడర్న్ లుక్, హైటెక్ ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునేలా సిద్ధమైంది. ఈ లేటెస్ట్ అప్‌డేట్ లో కారు ఎక్స్‌టీరియర్ స్టైలింగ్ నుండి సేఫ్టీ వరకు చాలా విషయాలను అప్‌గ్రేడ్ చేశారు.

Read Also: AC ఆన్‌లో ఉన్నా Petrol ఖర్చులు తగ్గించుకోవచ్చు.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి 

కొత్త ఎక్స్‌టీరియర్ స్టైలింగ్.. 

కొత్త 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ లో లుక్ పరంగా మెరుగైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కారు ఫ్రంట్ ప్రొఫైల్ లో బై-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌తో కనెక్ట్ అయిన ఎల్ఈడీ డీఆర్ఎల్ (DRL) లైట్ బార్‌ను అమర్చారు. బ్లాక్ మ్యాట్రిక్స్ మెష్ గ్రిల్, రీపోజిషన్ చేసిన హోండా లోగో కారుకు స్పోర్టీ లుక్ ఇస్తున్నాయి. కారు పొడవును 11 మిమీ పెంచడంతో ఇప్పుడు ఇది 4,594 మిమీ పొడవుతో మరింత లగ్జరీగా కనిపిస్తోంది. కలర్ ప్యాలెట్ లో పాత ఐదు రంగులతో పాటు సరికొత్తగా 'క్రిస్టల్ బ్లాక్ పెర్ల్' ఫినిష్ రంగును కూడా కంపెనీ యాడ్ చేసింది.

Read Also: Harley-Davidson X440 S vs Royal Enfield Guerrilla 450: రోడ్‌పై అసలైన కింగ్ ఎవరు? ఫుల్ డీటెయిల్స్! 

రిఫ్రెష్డ్ ఇంటీరియర్ క్యాబిన్..

కారు లోపలి భాగంలో డ్యూయల్-టోన్ ఐవరీ, బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌ను అందించారు. క్యాబిన్ లో కంఫర్ట్ పెంచడానికి 40 శాతం మెరుగైన కూలింగ్ సామర్థ్యం ఉన్న అప్‌గ్రేడెడ్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లను అమర్చారు. సెంటర్ కన్సోల్ లో వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే కొత్త 10.1-ఇంచుల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇవే కాకుండా రియర్ లాంజ్ సీటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సన్‌రూఫ్, రిమోట్ ఏసీ ఆపరేషన్ వంటి లగ్జరీ ఫీచర్లు రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ను మారుస్తాయి.

అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు.. 

సేఫ్టీ పరంగా ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌లతో పాటు లెవెల్ 2 అడాస్ (ADAS) టెక్నాలజీని కంటిన్యూ చేశారు. ఈ ఫేస్‌లిఫ్ట్ లో కొత్తగా యాడ్ చేసిన 360-డిగ్రీ కెమెరా సిటీ ట్రాఫిక్ లో కారును ఈజీగా నడపడానికి హెల్ప్ అవుతుంది. ధరల విషయానికి వస్తే స్టాండర్డ్ పెట్రోల్ మోడల్ ప్రారంభ ధర పాత కారు లాగే రూ. 12 లక్షలుగా ఉంది. అయితే ఈ:హెచ్‌ఈవీ (e:HEV) స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ధర మాత్రం దాదాపు లక్ష రూపాయలు పెరిగి రూ. 21 లక్షలు (ఎక్స్-షోరూమ్) కు చేరుకుంది.

టాప్ హెడ్ లైన్స్

Driving In Fog: వింటర్ ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ చిన్న పొరపాట్లు మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేస్తాయి!
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?
Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
Scorpio N, Tata Safari, XUV 7XO.. ఈ మూడు SUVల్లో మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్? ధర, పవర్, ఫీచర్ల పూర్తి పోలిక!
Scorpio N వర్సెస్‌ Tata Safari వర్సెస్‌ XUV 7XO.. ఈ మూడు SUVల్లో మీకు ఏది బెస్ట్?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Bigg Boss Season 10 Today November 16th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
Embed widget