అన్వేషించండి

AC ఆన్‌లో ఉన్నా Petrol ఖర్చులు తగ్గించుకోవచ్చు.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి

Car AC Settings To Save Fuel: వేసవిలో మీ కారు ACని సరిగ్గా ఉపయోగిస్తే మంచి కూలింగ్‌తో పాటు పెట్రోల్‌ను కూడా ఆదా చేయవచ్చు. కొన్ని సాధారణ సెట్టింగ్స్ ద్వారా మీరు హాయిగా ప్రయాణించవచ్చు.

Save Fuel with Car AC Settings | వేసవి కాలంలో కార్లు, బైక్స్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సమ్మర్ సీజన్లో కార్లలో AC వాడకం ఒక అవసరంగా మారిపోయింది. తీవ్రమైన ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా AC లేకుండా జర్నీ ఊహించుకోలేం.  కానీ చాలా మంది ACని సరైన పద్ధతిలో ఉపయోగించకపోవడం వల్ల పెట్రోల్, డీజిల్ వినియోగం పెరిగి కార్ మైలేజ్ తగ్గుతుంది. సాధారణంగా AC ఎంత వేగంగా ఆన్ చేస్తే, కార్ అంత త్వరగా అవుతుందని వాహనదారులు భావిస్తారు. కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంటుంది.

సరైన AC సెట్టింగ్స్, కొన్ని చిన్న చిట్కాలను పాటించడం ద్వారా మెరుగైన కూలింగ్‌తో పాటు ఇంధనాన్ని మీరు ఆదా చేయవచ్చు. కార్ ACని స్మార్ట్‌గా ఉపయోగించడం వల్ల మీ పర్సుపై పడే భారం తగ్గడమే కాకుండా, AC సిస్టమ్ లైఫ్ (జీవిత కాలం) పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా లాంగ్ జర్నీలలో, నగర ట్రాఫిక్‌లో ఈ పద్ధతి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 

Also Read: నష్టాల నుంచి రికవర్ అవుతున్న Ola Electric .. బ్యాటరీ ఉత్పత్తిపై ఫోకస్, దిగిరానున్న EV ధరలు

ప్రారంభంలో ACని ఇలా వాడాలి

వేసవిలో ఎండలో నిలిపి ఉంచిన కార్ కేబిన్ కొంత సమయానికే చాలా వేడెక్కిపోతుంది. అలాంటప్పుడు కార్‌లో కూర్చోగానే నేరుగా ACని ఫుల్ స్పీడ్‌లో పెడితే సరిపోతుందని భావిస్తారు. కానీ మొదట కొన్ని సెకన్లపాటు కిటికీలు తెరిచి లోపలి వేడి గాలిని బయటకు పోనివ్వాలి. ఆ తర్వాతే కారులో ACని ఆన్ చేయాలి. మొదట బ్లోవర్‌ను మీడియం స్పీడ్‌లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల కేబిన్ త్వరగా చల్లబడుతుంది. 

మొదట బ్లోవర్ మీడియంలో పెట్టడంతో AC సిస్టమ్‌పై అకస్మాత్తుగా ఎక్కువ ఒత్తిడి పడదు. కార్‌లో 'రీసర్క్యులేషన్ మోడ్' (Recirculation Mode) ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. దీనివల్ల బయట ఉండే వేడి గాలి లోపలికి రాదు. దాంతో కేబిన్ త్వరగా చల్లగా అవుతుంది. అందుకే ACని స్మార్ట్ పద్ధతిలో ఉపయోగిస్తే మెరుగైన కూలింగ్‌తో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది.

Also Read: Harley-Davidson X440 S vs Royal Enfield Guerrilla 450: రోడ్‌పై అసలైన కింగ్ ఎవరు? ఫుల్ డీటెయిల్స్!

మైలేజీని పెంచే చిన్న చిన్న అలవాట్లు 

చాలా సార్లు డ్రైవింగ్ సమయంలో చేసే చిన్న పొరపాట్లు మీ పెట్రోల్ ఖర్చును పెంచేస్తాయి. ఒకవేళ కార్ చాలా సేపటి వరకు నిలిచి ఉంటే, ఇంజన్ ఆన్ చేసి AC రన్ చేయడం వల్ల ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. AC Temperature చాలా తక్కువగా సెట్ చేయడంతో కూడా ఇంజన్‌పై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. ఉష్ణోగ్రతను 22 నుండి 24 డిగ్రీల మధ్య ఉంచాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇది కూలింగ్, మైలేజ్ రెండింటికీ బెస్ట్ అని భావిస్తున్నారు. 

టైమ్ టు టైమ్ AC సర్వీసింగ్ చేయించడం, ఎయిర్ ఫిల్టర్ శుభ్రంగా ఉంచుకోవాలి. మురికిగా ఉన్న ఫిల్టర్ AC కూలింగ్‌ను తగ్గిస్తుంది. దీనివల్ల ఇంజన్ పై ప్రెజర్ తగ్గుతుంది. డ్రైవింగ్ సమయంలో ఈ సులభమైన విషయాలు పాటిస్తే వేసవిలో సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు కొంచెం పెట్రోల్‌ను ఆదా చేయవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కియా సిరోస్‌ EVకి అదిరిపోయే డిమాండ్‌.. 650కి పైగా బుకింగ్స్‌, ఒక్కరోజులోనే 150 డెలివరీలు
ఈ EV డిమాండ్‌ మామూలుగా లేదుగా! ఒక్కరోజులో 150.. ఇది నేషనల్‌ రికార్డ్‌
KTM 390 Duke వర్సెస్‌ RE Guerrilla 450 Apex.. ధర, పవర్‌, ఫీచర్లలో ఏది బెస్ట్‌?
KTM 390 Duke వర్సెస్‌ Guerrilla 450.. పెద్ద ఇంజిన్‌ ఉన్నా తక్కువ ధరలో RE బైక్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త ఫీచర్లతో అదరగొడుతున్న సెడాన్! బుకింగ్స్‌ ప్రారంభం
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget