అన్వేషించండి

Best Family Cars Under 10 Lakhs:ఎస్‌యూవీల హవాలోనూ తగ్గని మారుతి డిజైర్ జోరు! వినియోగదారుల మనసులు గెలుచుకుంటున్న విషయాలు ఇవే!

Best Family Cars Under 10 Lakhs:భారత్ ఆటోమొబైల్ రంగంలో ఎస్‌యూవీల ప్రభంజనం కొనసాగుతోంది. అయినా మారుతి సుజుకి డిజైర్ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. అంతలా  కారులో ఆకట్టుకునే అంశాలు ఏం ఉన్నాయో చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి సుజుకి డిజైర్ ఎస్‌యూవీల జోరులోనూ ప్రజాదరణ పొందుతోంది.
  • డ్రైవింగ్, పార్కింగ్, ఇంధన ఆదా, మెయింటెనెన్స్‌లో సులభంగా ఉంటుంది.
  • విశాలమైన క్యాబిన్, ఆకర్షణీయమైన ధర, రీసేల్‌ విలువ దీని బలం.
  • అమ్మకాలలో 3 మిలియన్ల మైలురాయి, అధిక అమ్మకాలు నమోదయ్యాయి.

Best Family Cars Under 10 Lakhs:నేటి భారతీయ కార్ల మార్కెట్‌ను ఒక్కసారి గమనిస్తే, ఎక్కడ చూసిన ఎస్‌యూవీల సందడే కనిపిస్తోంది. ప్రతి కొత్త లాంచ్, ప్రతి ప్రకటన అడ్వెంచ్, రోడ్ ప్రెజెన్స్ గురించి మాట్లాడుతున్నాయి. కొనుగోలుదారులు కూడా ఎత్తుగా ఉండే వాహనాలు, మెరుగైన విజిబిలిటీ, సాఫీగా సాగిపోయే గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగిన వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ ఎస్‌యూవీల తుపానులోనూ ఒక సెడన్ మాత్రం చెక్కుచెదరకుండా వినియోగదారుల మనసులు గెలుచుకుంటోంది. అదే మారుతి సుజుకి డిజైర్(Maruti Suzuki Dzire Performance). 

భారత్‌లో ఎస్‌యూవీల పెరుగదల అనేది కేవలం ప్రాక్టికాలిటీకి సంబంధించింది మాత్రమే కాదు. అది ఒక ఎమోషన్. ఎస్‌యూవీలు(Sedan vs SUV Market India) కొనుగోలుదారులకు భద్రతను, సామాజిక హోదాను, ఆత్మవిశ్వసాన్ని ఇస్తాయి. గుంతలతో నిండిన రోడ్లు, అస్తవ్యస్తమైన స్పీడ్‌ బ్రేకర్లు ఉన్న మన దేశ పరిస్థితుల్లో  ఎస్‌యూవీలు మరింత ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే కాంపాక్ట్ ఎస్‌యూవీలు కూడా ఒకప్పుడు సెడాన్‌లు, హ్యాచ్‌బ్యాక్‌లు కలిగి ఉన్న క్రేజ్‌ను ఇప్పుడు పొందుతున్నాయి. 

డిజైర్ బిగ్ హిట్‌కు కారణం ఏంటీ?(Why Indians Buy Dzire)

మార్కెట్‌ మొత్తం ఆర్భాటంగా, ఎమోషనల్‌గా మారుతున్నా, డిజైర్‌ (Dzire Sales 2026)మాత్రం ఒకే ఒక్క అంశంపై దృష్టి పెట్టింది. అదే ఈజ్‌. ఈ కారును డ్రైవ్ చేయడం సులభం. పార్క్ చేయడం సులభం ఇంధన పొదుపులో మేటి, అన్నింటికంటే ముఖ్యంగా దీనిని మెయింటెన్‌ చేయడం చాలా సులభం.

Also Read: కుటుంబ ప్రయాణాలకు అనువైన టాప్‌ ఎంపీవీలు ఇవే! ధర, ఫీచర్స్‌ ఇతర వివరాలు తెలుసుకోండి!

ఫ్యామిలీ వినియోగదారుల దృష్టి

కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా విశాలమైన క్యాబిన్, ఉపయోగకరమైన బూట్స్ పేస్‌ దీని సొంతం.  ఈ కారులో ఏది క్లిష్టంగా ఉండదు. విజిబిలిటీ బాగుంటుంది. ప్రయాణం సౌకర్యవంతంగా సాగుతుంది. 6. 26 లక్షల ప్రారంభ ధరతో ఇది మధ్యతరగతి వినియోగదారుడికి అందుబాటులో ఉంది. మారుతి సుజుకి నెట్‌వర్క్, రీసేల్ వాల్యూ కొనుగోలుదారులకు ఒక భరోసా ఇస్తాయి. 

Also Read: పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?

మారుతి డిజైర్‌ అనగానే చాలా మందికి ట్యాక్సీ మార్కెట్ గుర్తుకు వస్తుంది. వాస్తవానికి డిజైర్ బలాన్ని మరింత పెంచుతుంది. ఫ్లీట్ ఆపరేటర్లు అత్యంత ఆచరణాత్మకమైన కొనుగోలుదారులు. వారు మైలేజీ, మెయింటెనెన్స్ ఖర్చులు, విశ్వసనీయత, రీసేల్ విలువను లెక్కలు వేసుకొని కారును ఎంచుకుంటారు. సంవత్సరాలుగా డిజైర్ ఈ పరీక్షలన్నింటినీలోనూ నెగ్గుతూ వస్తోంది. ప్రైవేటు కొనుగోలుదారులు మెరిసే ఎస్‌యూవీలను ఇష్టపడవచ్చు. కానీ ఫ్లీట్ మార్కెట్(Maruti Suzuki Fleet Market) మాత్రం డిజైర్‌ ఎంతటి దృఢమైన కారో నిరూపిస్తూనే ఉంది. 

Also Read: పెట్రోల్ వర్సెస్ ఎలక్ట్రిక్ బైక్స్: వాహనదారులకు ఏది బెస్ట్ ఆప్షన్?

డిజైర్ విజయ ప్రస్థానం యాదృచ్చికం కాదు. మార్చి 2026లో డిజైర్‌ అన్ని ఎస్‌యూవీల కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. అంతేకాకుండా, మార్చి 2026 నాటికి 3 మిలియన్ల విక్రయాలు మైలురాయిని ఈ కారు అందుకుంది. 2025 క్యాలెండర్‌ ఇయర్‌లో మారుతి సుజుకి మొత్తంగా  22. 55 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగా, అందులో డిజైర్‌ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఈ గణాంకాలే సామాన్యుడి నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 

Also Read: 10 లక్షల బడ్జెట్‌తో లభించే అత్యుత్తమ కార్లు! ఫీచర్లు, మైలేజీ వివరాలు ఇవే!

ఎవరితో పోటీ పడుతుంది?

మారుతి డిజైర్‌ తన స్థానాన్ని కాపాడుకోవడానికి హోండా అమేజ్‌, హ్యుందాయ్ ఆరా వంటి బలమైన పోటీదారులను ఎదుర్కొంటోంది. సేఫ్టీ విషయంలో అమేజ్‌, డిజైర్‌ మధ్య నిరంతర చర్చ జరుగుతూనే ఉంటుంది. మరోవైపు మారుతి విక్టోరిస్‌ వంటి కొత్త మోడళ్లు విభిన్నమైన అనుభూతిని అందిస్తున్నప్పటికీ, డిజైర్‌ తనకంటూ ఒక ప్రత్యేకమైన వర్గాన్ని కలిగి ఉంది. 

Also Read: Electric Bike లో క్లచ్‌ పనితీరు ఏంటీ? Honda కొత్త EVలో ఫేక్ క్లచ్ ఇవ్వడానికి కారణమిదే

ప్రాక్టికాలిటీ ఎప్పుడూ ఫ్యాషన్ అవుట్ కాదు

మారుతి డిజైర్‌ విజయం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. భారతీయ వినియోగదారులు ఆకాంక్షలను గౌరవిస్తారు. కానీ అవసరాలను విస్మరించరు. పెరుగుతున్న కారు ధరలు, ఇంధన ఖర్చుల దృష్ట్యా, ఒక మధ్యతరగతి కుటుంబానికి లేదా ఒక పట్టణ వినియోగదారుడికి తక్కువ ఖర్చుతో కూడిన సౌకర్యవంతమైన సెడాన్ ఇప్పటికీ ఒక స్మార్ట్ నిర్ణయమే. ఎస్‌యూవీలు ట్రెండీగా ఉన్నా సరే రోజువారి జీవితాన్ని సులభతరం చేసే మారుతి డిజైర్ వంటి కార్లు ఎప్పటికీ తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. 

Also Read: హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ సరికొత్త లుక్ - డీలర్‌షిప్స్‌లో సందడి చేస్తున్న లగ్జరీ సెడాన్ కార్

Frequently Asked Questions

ప్రస్తుత భారత కార్ల మార్కెట్లో ఎక్కువగా ఏ రకం వాహనాలు కనిపిస్తున్నాయి?

ప్రస్తుత భారత కార్ల మార్కెట్లో ఎక్కువగా ఎస్‌యూవీలు కనిపిస్తున్నాయి. ఇవి ఎత్తుగా, మెరుగైన విజిబిలిటీ, మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి ఉంటాయి.

మారుతి సుజుకి డిజైర్‌ ఇతరుల కంటే ఎందుకు భిన్నంగా నిలుస్తుంది?

మారుతి సుజుకి డిజైర్‌ డ్రైవ్ చేయడం, పార్క్ చేయడం సులభం. ఇది ఇంధన పొదుపులో మేటి మరియు నిర్వహణ ఖర్చులు కూడా తక్కువ.

కుటుంబ వినియోగదారులకు మారుతి డిజైర్‌ ఎందుకు అనుకూలమైనది?

డిజైర్‌ విశాలమైన క్యాబిన్, ఉపయోగకరమైన బూట్ స్పేస్‌తో వస్తుంది. ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది మరియు మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటు ధరలో ఉంది.

మారుతి డిజైర్‌ అమ్మకాల గణాంకాలు ఏమిటి?

మార్చి 2026 నాటికి డిజైర్‌ 3 మిలియన్ల విక్రయాల మైలురాయిని అందుకుంది. 2025 క్యాలెండర్‌ ఇయర్‌లో ఇది అత్యధికంగా అమ్ముడైన మారుతి సుజుకి కారు.

టాప్ హెడ్ లైన్స్

రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Embed widget