MPV కార్లు ఎక్కువ మంది ప్రయాణికులకు స్థలాన్ని అందిస్తాయి. కుటుంబ సభ్యులందరూ సౌకర్యవంతంగా ప్రయాణించడానికి, లగేజీని పెట్టుకోవడానికి ఇవి అనువుగా ఉంటాయి.
Best Family MPV Cars 2026: మారుతి ఎర్టిగా vs టయోటా ఇన్నోవా హైక్రాస్ vs కియా సెరెన్స్– ధర, మైలేజీ, ఫీచర్లు పూర్తి కంపారిజన్ ఇదే!
Best MPV Family Cars India 2026: భారత్‌లో కుటుంబాల అవసరాల కోసం జనం ఎంపీవీ కార్లను ఎంచుకుంటున్నారు. ఈ విభాగంలో టాప్ కార్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

- కుటుంబ ప్రయాణాలకు ఎక్కువ మంది MPVల వైపు మొగ్గు చూపుతున్నారు.
- మారుతి ఎర్టిగా తక్కువ ధర, మంచి మైలేజీతో ప్రజాదరణ పొందింది.
- కియా కారెన్స్ ఆధునిక ఫీచర్లు, SUV లాంటి లుక్ అందిస్తుంది.
- టయోటా ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్ విశ్వసనీయత, విలాసాన్ని అందిస్తాయి.
Best MPV Family Cars India 2026: గత కొన్నేళ్లుగా భారతీయ వాహన మార్కెట్లలో వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు లేదా ఎక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాలు ప్రయాణాల కోసం మల్టీ పర్పస్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ కార్లలో మూడు వరుసల సీటింగ్ సౌకర్యవంతపాటు, సుదూర ప్రయాణాలకు అవసరమైన సౌకర్యం లభించడం దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం మార్కెట్‌లో బడ్జెట్ ధర నుంచి ప్రీమియం ఫీచర్ల వరకు రకరకాల ఎంపీవీలు అందుబాటులో ఉన్నాయి
సాధారణంగా హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లతో పోలిస్తే, ఎంపీవీలు ఎక్కువ స్థలాన్ని అందిస్తాయి. ఒకే వాహనంలో 7 నుంచి 8 మంది ప్రయాణించే అవకాశం ఉండటంతో కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రయాణం చేసేందుకు కావాల్సినంత స్థలం లభిస్తుంది. కలిసి ట్రావెల్ చేయడమే కాకుండా ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఎంత లగేజీ అయినా సరే పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఎంపీవీలు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. స్పేస్ మాత్రమే కాకుండా సౌకర్యవంతంగా ఉంటాయి. భద్రతా విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టాప్ 5 ఆప్షన్లు
మారుతి సుజుకి ఎర్టిగా
బడ్జెట్‌లో రావడమే కాకుండా మైలేజీలో కూడా కింగ్‌గా ఉంది మారుతి ఎర్టిగా. భారతీయ మార్కెట్‌లో ఎంపీవీల గురించి చర్చకు వస్తే మొదటగా వినిపించే పేరు మారుతి ఎర్టిగా. ఇది తక్కువ బడ్జెట్, అత్యుత్తమ మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో లక్షలాది మంది మనసులు గెలుచుకుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. 7 మంది ప్రయాణించడానికి తగినంత స్థలం ఉంటుంది. టాప్ వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
కియా క్యారెన్స్
ఆధునిక లుక్, అత్యాధునిక సాంకేతికత కోరుకునే వారికి కియా క్యారెన్స్ అద్భుతమైన ఎంపిక. ఇది ఎస్‌యూవీ లాంటి మస్కులర్ లుక్‌ను కలిగి ఉంటుంది. పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, వెన్టిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇందులో అడ్వాన్స్డ్ లెవల్-2 అడాస్ వంటి భద్రతా ఫీచర్లు అందించారు.
మారుతి సుజుకి XL6
ప్రీమియం అనుభూతి కలిగి ఉంది. ఇది ఎర్టిగా కంటే కొంచెం ఎక్కువ స్టైల్, లగ్జరీ కోరుకునే వారి కోసం మారుతి XL6ను రూపొందించింది. ఇది మారుతి నెక్సా అవుట్‌లెట్ ద్వారా విక్రయిస్తున్నారు. బ్లాక్ థీమ్ ఇంటీరియర్, వెన్టిలేటెడ్ సీట్లు దీని ప్రత్యేకత. ఇందులో 360 డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
టయోటా ఇన్నోవా క్రిస్టా
భారతీయ రోడ్లపై అత్యంత నమ్మకమైన వాహనంగా ఇన్నోవా క్రిస్టాకు పేరుంది. ఇది ముఖ్యంగా దాని బలమైన బాడీ, శక్తిమంతమైన ఇంజిన్ కోసం ప్రసిద్ధి చెందింది. 2.4 లీటర్ డీజిల్ ఇంజన్, రియల్ వీల్ డ్రైవ్ సెటప్‌తో వస్తుంది. ఇది ఎగుడుదిగుడు రోడ్లపై కూడా సాఫీగా సాగుతుంది. మార్కెట్‌లో దీనికి రీసేల్ వాల్యూ చాలా ఎక్కువ.
Also Read: 10 లక్షల బడ్జెట్‌తో లభించే అత్యుత్తమ కార్లు! ఫీచర్లు, మైలేజీ వివరాలు ఇవే!
టయోటా ఇన్నోవా హైక్రాస్
భవిష్యత్ అవసరాలు అనుగుణంగా విలాసవంతమైన ప్రయాణాన్ని కోరుకునే వారికి ఇది అల్టిమేట్ ఆప్షన్. ఇది టయోటా సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండింటిని కలిగి ఉంటుంది. ఆటోమేటిక్ ఒట్టోమన్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వీఐపీ ఫీచర్లు ఇందులో ఉనాయి.
Also Read: పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?
ప్రస్తుతం ఆటోబైల్ కంపెనీలు పండుగ సీజన్లు, ఇయర్ ఎండ్ సేల్స్ సమయంలో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి. మహీంద్రా బొలెరో నియో, బొలెరో వంటి మోడళ్లపై పరిమితి కాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త ఫీచర్లతో వస్తున్న ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల కోసం వేచి చూడటం లేదా ప్రస్తుతం ఉన్న మోడళ్లపై డిస్కౌంట్‌పై పొందడం కొనుగోలుదారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
కారును ఎంచుకునే ముందు గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు
కారును ఎంచుకునే ముందు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మీ బడ్జెట్ పది లక్షల లోపు ఉంటే ఎర్టిగా లేదా బొలెరో సరైనవి. రూ 20-30 లక్షల బడ్జెట్ ఉంటే ఇన్నోవా శ్రేణిని పరిశీలించవచ్చు. మీరు ఎక్కువ హైవేలపై ప్రయాణం చేస్తే ఇన్నోవా క్రిస్టా డీజిల్ లేదా హైక్రాస్ హైబ్రిడ్ ఉత్తమం. మీకు లేటెస్ట్ గ్యాడ్జెట్లు, అడాస్ భద్రత కావాలంటే కియా క్యారెన్స్ బెస్ట్ ఛాయిస్.
Also Read: పెట్రోల్ వర్సెస్ ఎలక్ట్రిక్ బైక్స్: వాహనదారులకు ఏది బెస్ట్ ఆప్షన్?
Before You Go
Auto Expo 2023 Day 1 Highlights: ఎంతో హైప్ తో మొదలైన ఆటో ఎక్స్ పో మొదటి రోజు హైలైట్స్
Frequently Asked Questions
MPV కార్ల ప్రాముఖ్యత ఏమిటి?
మారుతి సుజుకి ఎర్టిగా యొక్క ప్రధాన ఆకర్షణలు ఏమిటి?
మారుతి ఎర్టిగా తక్కువ బడ్జెట్, అత్యుత్తమ మైలేజీ, తక్కువ నిర్వహణ ఖర్చులతో వస్తుంది. 7 మంది ప్రయాణించడానికి తగినంత స్థలం, 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి భద్రతా ఫీచర్లను అందిస్తుంది.
కియా క్యారెన్స్ ఎలాంటి ఫీచర్లతో వస్తుంది?
కియా క్యారెన్స్ ఆధునిక లుక్, అత్యాధునిక సాంకేతికతతో వస్తుంది. పెద్ద టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్-2 ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి.
టయోటా ఇన్నోవా క్రిస్టా ఎందుకు ప్రసిద్ధి చెందింది?
టయోటా ఇన్నోవా క్రిస్టా బలమైన బాడీ, శక్తివంతమైన ఇంజన్, నమ్మకమైన పనితీరుకు ప్రసిద్ధి చెందింది. మంచి రీసేల్ వాల్యూ కూడా దీని ప్రత్యేకత.
ట్రెండింగ్ వార్తలు






















