అన్వేషించండి

Electric Bike లో క్లచ్‌ పనితీరు ఏంటీ? Honda కొత్త EVలో ఫేక్ క్లచ్ ఇవ్వడానికి కారణమిదే

Honda Electric Bike: సాధారణంగా ఎలక్ట్రిక్ బైక్‌లకు గేర్లు లేదా క్లచ్ అవసరం ఉండదు. EV మోటారు ఎనర్జీ వల్ల మీరు గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే బైక్ నడపవచ్చు.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ టూవీలర్ల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ బైక్ కంపెనీల ఫోకస్ మెరుగైన రేంజ్, వేగవంతమైన స్పీడ్, మరింత ప్రాక్టికల్ ఈవీలను తయారు చేయడంపైనే ఉండేది. కానీ ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్‌లలో సాంప్రదాయ పెట్రోల్ బైక్‌ల వంటి ఫీల్‌ను అందించేందుకు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టూవీలర్ కంపెనీ హోండా ఒక కొత్త టెక్నాలజీపై పేటెంట్ పొందింది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌లో ఫేక్ క్లచ్ (ఆర్టిఫిషియల్ క్లచ్), వైబ్రేషన్ సిస్టమ్‌ను అందించనుంది. ఎలక్ట్రిక్ బైక్‌లో క్లచ్ పని ఏమిటి, హోండా తన కొత్త ఈవీలో నకిలీ క్లచ్‌ను ఎందుకు ఇస్తోందో పూర్తి వివరాలు తెలుసుకోండి. 

హోండా కొత్త ఈవీలో నకిలీ క్లచ్
సాధారణంగా ఎలక్ట్రిక్ బైక్‌లలో గేర్లు, క్లచ్ అవసరం ఉండదు. ఈవీ మోటార్ నేరుగా పవర్‌ అందిస్తుంది. దాంతో బైక్ గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండా డ్రైవింగ్ చేయవచ్చు. అయితే చాలా మంది రైడర్లు పెట్రోల్ బైక్ లాగా క్లచ్, గేర్, ఇంజిన్ వైబ్రేషన్స్ అనుభూతిని మిస్ అవుతున్నారు. ఈ ఎక్స్‌పీరియన్స్ మళ్లీ అందించడానికి, హోండా ఇప్పుడు తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌లో సూడో క్లచ్ అంటే ఆర్టిఫిషియల్ క్లచ్ టెక్నాలజీపై పని చేస్తోంది. హోండా తన 'సీఆర్ ఎలక్ట్రిక్ ప్రోటో' ఎలక్ట్రిక్ మోటోక్రాస్ బైక్ కోసం ఈ పేటెంట్‌ను తీసుకోవాలని చూస్తోంది. ఈ బైక్ ప్రస్తుతం ఒక ప్రోటోటైప్ మోడల్ కాగా, హోండా రేసింగ్ కార్పొరేషన్, ముగెన్‌లతో కలిసి తయారు చేశారు. ఇదే టెక్నాలజీతో కంపెనీ ప్రొడక్షన్ మోడల్ ఎలక్ట్రిక్, డర్ట్ బైక్‌లను కూడా లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు.

Also Read: New FASTag Category Planned: టోల్ మిన‌హాయించిన‌ వాహనాల కోసం కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కేటగిరీ - కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్

ఈ నకిలీ క్లచ్ ఎలా పనిచేస్తుంది?
హోండా కొత్త టెక్నాలజీలో క్లచ్ లివర్ ఉంటుంది. కానీ దాని పనితీరు పూర్తిగా ఎలక్ట్రానిక్‌గా ఉంటుంది. ఇది మెకానికల్ క్లచ్ లాగా నేరుగా ఇంజిన్‌తో అనుసంధానించి ఉండదు. దానికి బదులుగా ఎలక్ట్రిక్ మోటార్ పవర్‌ఫుల్ అవుట్‌పుట్‌ నియంత్రిస్తుంది. పేటెంట్ ప్రకారం, రైడర్ క్లచ్ లివర్‌ను సగం నొక్కితే మోటార్ పవర్ కూడా సగానికి తగ్గుతుంది. క్లచ్ పూర్తిగా నొక్కినప్పుడు మోటార్ పవర్ పూర్తిగా కట్ అవుతుంది. పెట్రోల్ బైక్‌లో క్లచ్ ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. అంటే రైడర్ ఎలక్ట్రిక్ బైక్‌లో కూడా క్లచ్‌ను వదులుతూ ఫాస్ట్ పికప్‌ ఎక్స్‌పీరియన్స్ ఆస్వాదించవచ్చు. కంపెనీ ఈవీలో ఐసిఈ (ICE - ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) బైక్ లాంటి ఫీల్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

ఈవీ బైక్‌లో వైబ్రేషన్

హోండా కేవలం క్లచ్ ఫీల్‌కే పరిమితం చేయాలనుకోలేదు. కంపెనీ బైక్‌లో హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్‌ను అందించబోతోంది. దీని ద్వారా రైడర్‌కు ఇంజిన్ లాంటి వైబ్రేషన్ పీల్ వస్తుంది. రిపోర్టుల ప్రకారం, హ్యాండిల్‌బార్ రెండు చివరలలో, క్లచ్  లివర్‌లో చిన్న హాప్టిక్ మోటార్లను అమర్చుతారు. ఇవి బైక్ నడుపుతున్నప్పుడు వైబ్రేషన్‌ను క్రియేట్ చేస్తాయి. రైడర్‌కు పెట్రోల్ బైక్ నడుపుతున్నట్లే అనుభూతిని అందించడం దాని ఉద్దేశం.

Also Read: Tata Nexon లేదా Nissan Magnite .. ధర, మైలేజ్, ఫీచర్ల పరంగా ఏ కారు కొనడం మంచిది?

పలు కంపెనీలు దీనిపై చేశాయి
సూడో క్లచ్ టెక్నాలజీ అనేది పూర్తిగా కొత్తదేమీ కాదు. దీనికి ముందు కిమ్కో (Kymco) తన సూపర్ నెక్స్, రెవో నెక్స్ ఎలక్ట్రిక్ బైక్‌లలో సాంకేతికతను ప్రదర్శించింది. జీరో మోటార్ సైకిల్స్ కూడా తన హైపెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ ఎస్ఆర్ఎఫ్ (SRF) కోసం ఇదే తరహా  టెక్నాలజీపై పేటెంట్ తీసుకుంది. అయితే హోండా లాంటి పెద్ద కంపెనీ ఈ టెక్నాలజీపై పనిచేస్తుండటం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఈ కంపెనీ భారీ స్థాయిలో ఉత్పత్తి (ప్రొడక్షన్) చేయగల సామర్థ్యాన్ని, గ్లోబల్ మార్కెట్‌లో మంచి పట్టు సాధిస్తోంది.  

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!
కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి
మీ కారు ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కష్టమే!
రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?
రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?
Advertisement

వీడియోలు

Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget