భారతదేశంలో టీవీఎస్ రైడర్, హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా షైన్, బజాజ్ ప్లాటినా 110, టీవీఎస్ రేడియాన్ వంటి బైక్‌లు మంచి మైలేజీని అందిస్తాయి.
Best Mileage Bikes India: మధ్యతరగతి భరోసా తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే టాప్ 24 బైక్‌లు ఇవే!
Affordable Commuter Bikes: పెరిగిన ఇంధన ధరల నేపథ్యంలో భారతీయ వాహనదారులు మైలేజీకి పెద్ద పీట వేస్తున్నారు. దేశీయ మార్కెట్‌లో లక్ష రూపాయల లోపు లభిస్తున్న బైక్స్ గురించి చూద్దాం.

- భారత్‌లో మధ్యతరగతి వారికి కమ్యూటర్ బైక్‌లే మొదటి ఎంపిక.
- 70వేల-లక్షలోపు బైక్‌లు మైలేజీతోపాటు ఆధునిక ఫీచర్లను అందిస్తున్నాయి.
- TVS రైడర్, హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ ప్లాటినా అందుబాటులో ఉన్నాయి.
- TVS రేడియాన్, TVS స్పోర్ట్స్, హీరో HF 100 తక్కువ ధరలో మంచి మైలేజీనిస్తాయి.
- TVS స్టార్ సిటీ ప్లస్ 83.09 కిమీ మైలేజీతో అగ్రస్థానంలో ఉంది.
- పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవడానికి అటుమ్ వెర్షన్ 1.0 EV అందుబాటులో ఉంది.
Affordable Commuter Bikes: భారత్‌లో టూ వీలర్స్ రంగం ఒక కీలకమైన దశలో ఉంది. విలాసవంతమైన స్పోర్ట్స్ బైక్‌లు ఎన్ని ఉన్నా, మధ్య తరగతి ఫ్యామిలీస్‌కు మొదటి ఎంపిక మాత్రం ఎప్పుడూ కమ్యూటర్ బైక్‌లే. తక్కువ నిర్వహణ ఖర్చు, అత్యధిక మైలేజీ, సుదీర్ఘ కాలం మన్నే నమ్మకం ఈ విభాగం విజయానికి రహస్యం. ప్రస్తుతం భారత్ మార్కెట్‌ల యాభై వేల నుంచి లక్ష రూపాయల మధ్యలో సూపర్ మైలేజీ ఇచ్చే 24బైక్‌లు అందుబాటులో ఉన్నాయి.
ముందు 70వేల నుంచి లక్ష రూపాయల బడ్జెట్‌లో సుమారు ఇరవైకి పైగా మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం మైలేజీ మాత్రమే కాకుండా ఆధునిక ఫీచర్లను కూడా అందిస్తున్నాయి.
టీవీఎస్ రైడర్
ఈ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఇది ఒకటి. దీని ధర 95, 611 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. 124.8cc ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ లీటరకు 71.94 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీ అందిస్తుంది.
హీరో స్ప్లెండర్ ప్లస్
దశాబ్దాలుగా భారతీయుల నమ్మకమైన నేస్తంగా స్ప్లెండర్ ఉంది. దీని ధర 90, 570 నుంచి ప్రారంభమవుతుంది. 97.2cc ఇంజిన్‌తో ఇది 70కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో ఐ3ఎస్, ఎక్స్-టె్ వంటి వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి సుమారు 73 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి.
హోండా షైన్
123.94cc ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ ధర 96.380. ఇది లీటర్‌కు 55 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మెరుగైన పవర్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.
బజాబ్ ప్లాటినా 110
మైలేజీకి మారుపేరుగా నిలిచే ప్లాటినా 110 ధర 84, 146 రూపాయలు. ఇది 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
యాభైవేల నుంచి 70 వేల మధ్య బడ్జెట్‌లో లభించే బైక్స్ ఆప్షన్ అందుబాటులో ఉన్నాయి. అత్యంత తక్కువ ధరలో బైక్ కావాలనుకునే వారి కోసం మార్కెట్‌లో మంచి ఆప్షన్స్ ఉన్నాయి.
టీవీఎస్ రేడియాన్
65,888 రూపాయల ధరతో లభిస్తున్న ఈ బైక్, ఈ విభాగంలో అత్యంత సరసమైందిగా గుర్తింపు పొందింది. ఇది లీటర్‌కు 73. 68 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
టీవీఎస్ స్పోర్ట్స్
65, 996 ధరతో లభించే ఈ బైక్ 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
హీరో హెచ్‌ఎఫ్ 100
69,247 రూపాయల ధరతో 97.2 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ సామాన్యులకు ఎంతో మేలు చేస్తుంది.
మైలేజీ, టెక్నాలజీ సామర్థ్యం
కస్టమర్లు బైక్ ఎంచుకునేటప్పుడు మైలేజీకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఈ విభాగంలో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఏకంగా 83.09 కిలోమీటర్ల మైలేజీతో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు టెక్నాలజీ పరంగా ఆధునిక సాంకేతికత కావాలనుకునే వారికి డిజిక్లస్టర్ ఎడిషన్లతో వచ్చే టీవీఎస్ రేడియాన్ వంటి మోడళ్లను ఎంచుకోవచ్చు.
కంపారిజన్ ఇక్కడ చూడవచ్చు.
బైక్ పేరు | ఇంజిన్ సామర్థ్యం | మైలేజీ | ప్రారంభ ధర(సుమారు) |
| టీవీఎస్ రైడర్ | 124.8 సీసీ | 71.94 | రూ. 95,611 |
| హీరో స్ప్లెండర్ ప్లస్ | 97.2సీసీ | 70.00 | రూ. 90,570 |
| టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ | 109.7సీసీ | 83.09 | రూ. 86,448 |
| బజాజ్ ప్లాటినా 110 | 115.45సీసీ | 70.00 | రూ. 84,146 |
| టీవీఎస్ రేడియాన్ | 109.7 సీసీ | 73.68 | రూ. 65,888 |
పెట్రోల్ ఖర్చు ఎందుకు ఈవీ వైపు చూద్దామనుకునే వారి కోసం అటుమ్ వెర్షన్ 1.0 అందుబాటులో ఉంది. దీన ధర 71 224 రూపాయలుగా ఉంది. ఇది ఒకసారి ఛార్జింగ్ చేస్తే వంద కిలోమీటర్లు దూసుకెళ్లొచ్చు. కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లోనే పూర్తి ఛార్జింగ్ అవుతుంది. ఇది నగర ప్రయాణాలకు, స్వల్ప దూరాలకు బాగా యూజ్ అవుతుంది.
లక్ష రూపాయల లోపు బడ్జెట్‌లో భారతీయ ఆటోమొబైల్ రంగం విభిన్నమైన ఎంపికలను అందిస్తోది. మీరు రోజు వారీ ఆఫీస్ పనులకు వెళ్లినా, లేదా గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించినా, పైన పేర్కొన్న బైక్‌లు మీ జేబుకు భారం కాకుండా భరోసానిస్తాయి. కొనుగోలు చేసే ముందు షో రూమ్‌లో టెస్ట్ రైడ్ చేయడం మంచిది. ఆన్‌రోడ్ రేటును కూడా చెక్ చేయండి.
మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Before You Go
Auto Expo 2023 Day 1 Highlights: ఎంతో హైప్ తో మొదలైన ఆటో ఎక్స్ పో మొదటి రోజు హైలైట్స్
Frequently Asked Questions
భారతదేశంలో ఎక్కువ మైలేజీని ఇచ్చే టాప్ బైక్‌లు ఏవి?
70,000 నుండి లక్ష రూపాయల బడ్జెట్‌లో మైలేజీ బైక్‌లు ఉన్నాయా?
అవును, ఈ బడ్జెట్‌లో టీవీఎస్ రైడర్, హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా షైన్, బజాజ్ ప్లాటినా 110 వంటి బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి మంచి మైలేజీతో పాటు ఆధునిక ఫీచర్లను కూడా అందిస్తాయి.
తక్కువ ధరలో ఎక్కువ మైలేజీని ఇచ్చే బైక్‌లు ఏవి?
50,000 నుండి 70,000 రూపాయల మధ్య, టీవీఎస్ రేడియాన్, టీవీఎస్ స్పోర్ట్స్, హీరో హెచ్ఎఫ్ 100 వంటి బైక్‌లు మంచి మైలేజీతో సరసమైన ధరలలో లభిస్తాయి.
అత్యధిక మైలేజీని ఇచ్చే బైక్ ఏది?
ఈ విభాగంలో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ 83.09 కిలోమీటర్ల మైలేజీతో అత్యధికంగా నిలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు






















