అన్వేషించండి

Tata Nexon లేదా Nissan Magnite .. ధర, మైలేజ్, ఫీచర్ల పరంగా ఏ కారు కొనడం మంచిది?

నిస్సాన్ మాగ్నైట్ తక్కువ ధర, మంచి మైలేజ్, సిటీ డ్రైవింగ్‌కు అనుకూలమైన ఫీచర్లతో రాగా, టాటా నెక్సాన్ 5 స్టార్ సేఫ్టీ, ప్రీమియం ఇంటీరియర్‌తో ఫ్యామిలీ జర్నీకి సరిపోతుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కాంపాక్ట్ SUVల క్రేజ్: నెక్సాన్, మాగ్నైట్ కార్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
  • ధర: నిస్సాన్ మాగ్నైట్ టాటా నెక్సాన్ కంటే తక్కువ ధరకే లభిస్తుంది.
  • ఇంటీరియర్: టాటా నెక్సాన్ ప్రీమియం ఫీచర్లతో మెరుగైన అనుభూతిని ఇస్తుంది.
  • సేఫ్టీ: టాటా నెక్సాన్ 5-స్టార్ రేటింగ్‌తో అత్యంత సురక్షితమైన SUV.
  • ఇంజిన్, మైలేజ్: నెక్సాన్ పవర్‌ఫుల్, మాగ్నైట్ సిటీలో పొదుపుగా ఉంటుంది.

ప్రస్తుతం భారత ఆటో మార్కెట్లో కాంపాక్ట్ SUVలకు సైతం క్రేజ్ వేగంగా పెరుగుతోంది. ఫీచర్లు, లగ్జరీకి సైతం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో ఇప్పుడు చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే సూపర్ లుక్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, ఎక్కువ స్పేస్, మోడ్రన్ ఫీచర్లు ఉన్న SUVలను కొనడానికే ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా టాటా నెక్సాన్ (Tata Nexon), నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) వంటి కార్ల మధ్య మార్కెట్లో గట్టి పోటీ నెలకొంది. 

ఒకవైపు టాటా నెక్సాన్ తన స్ట్రాంగ్ బాడీ, సేఫ్టీ, ప్రీమియం ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. మరోవైపు నిస్సాన్ మాగ్నైట్ తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు, మంచి మైలేజ్ ద్వారా విక్రయాలను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటువంటి పరిస్థితిలో చాలా మంది ఈ రెండు SUVల మధ్య ఏ కారు తమకు మరింత మెరుగ్గా ఉంటుందనే విషయంలో క్లారిటీ లేక ఆలోచిస్తుంటారు. 

రెండు కార్ల ధరలు
అన్నింటికంటే ముందుగా ధరల విషయానికి వస్తే, టాటా నెక్సాన్ ధర ₹7.37 లక్షల రూపాయలుగా ఉంది. నిస్సాన్ మాగ్నైట్ మరింత బడ్జెట్ ఫ్రెండ్లీ SUVగా భావిస్తారు. దీని ప్రారంభ ధర ₹5.65 లక్షలు, ఇది టాటా నెక్సాన్ కంటే చాలా తక్కువ ధర కావడంతో కొనుగోళ్లు బాగుంటాయి. కాగా నిస్సాన్ మాగ్నైట్ ఒక బెటర్ ఎస్‌యూవీగా మారుతుంది.

Read Also: Mahindra BE6 Discount: మహీంద్రా ఈవీపై రూ.2 లక్షల భారీ డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి

కార్ల ఇంటీరియర్, ఫీచర్లు
ఇంటీరియర్, కేబిన్ విషయానికి వస్తే, టాటా నెక్సాన్ మరింత ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. దీని లోపల కూర్చోగానే మోడరన్ డిజైన్, మెరుగైన క్వాలిటీ స్పష్టంగా గుర్తిస్తారు. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు మరియు JBL సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు వస్తాయి. టాటా నెక్సాన్ కేబిన్ మరింత ప్రీమియం, ఫ్యూచరిస్టిక్‌గా కనిపిస్తుంది.

మరోవైపు నిస్సాన్ మాగ్నైట్‌లో కూడా మంచి కేబిన్ ఇచ్చారు. కానీ ఫీచర్లు కొంచెం తక్కువగా అనిపిస్తాయి. అయితే దీని సీటింగ్ చాలా కంఫర్టుగా ఉంటుంది. వెనుక కూర్చునే వారికి కూడా మంచి లెగ్‌రూమ్ లభిస్తుంది. తక్కువ ధరలో కావాల్సిన ఫీచర్లు, సౌకర్యవంతమైన SUVని కోరుకునే వారికి నిస్సాన్ మాగ్నైట్ బెస్ట్ ఛాయిస్. 

కారు సేఫ్టీ ఎలా ఉంది?
సేఫ్టీ విషయంలో టాటా నెక్సాన్ బలమైన SUVగా నిలుస్తుంది. ఇది గ్లోబల్ NCAP (Global NCAP),భారత్ NCAP (Bharat NCAP) రెండింటిలోనూ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సాధించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, ADAS వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

కుటుంబ సమేతంగా లాంగ్ జర్నీ చేసే కస్టమర్లు నెక్సాన్‌ను మరింత సురక్షితమైన SUVగా భావిస్తారు. మరోవైపు నిస్సాన్ మాగ్నైట్ కూడా భద్రత విషయంలో మంచి SUVగా ఉంది. ఇందులో కూడా ట్రాక్షన్ కంట్రోల్,  6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ ఫీల్ విషయానికి వస్తే నెక్సాన్ ఎక్కువ దృఢంగా అనిపిస్తుంది.

Read Also: Hybrid Cars Mileage: ఇంధన ధరల టెన్షన్‌కు చెక్.. మార్కెట్లో బెస్ట్ హైబ్రిడ్ కార్లు ఇవే.. వర్కౌట్ అవుతుందా ?

ఇంజిన్, పర్ఫార్మెన్స్
ఇంజిన్, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టాటా నెక్సాన్ పవర్‌ఫుల్ SUVగా చెబుతారు. ఇందులో పెట్రోల్, డీజిల్, CNG వంటి పలు ఇంజిన్ ఆప్షన్లు లభిస్తాయి. దీని టర్బో పెట్రోల్ ఇంజిన్ చాలా పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. హైవేలపై కారు చాలా స్టేబుల్‌గా వెళ్తుంది. కాగా నిస్సాన్ మాగ్నైట్‌లో పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. సిటీ ట్రాఫిక్‌లో మాగ్నైట్ డ్రైవ్ చేయడం చాలా సులభం. దీని CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అయితే ఎవరైనా ఎక్కువ పవర్, లాంగ్ జర్నీ ప్రయాణాల కోసం SUVని కోరుకుంటే, నెక్సాన్ మరింత మెరుగైన ఆప్షన్‌గా చెప్పవచ్చు. 

మైలేజ్ విషయానికి వస్తే, నిస్సాన్ మాగ్నైట్ కొంచెం ఎక్కువ పొదుపుగా ఉంటుంది. దీని ఇంజిన్ సిటీలో మంచి మైలేజ్ ఇస్తుంది. ప్రతిరోజూ ఆఫీస్‌కు వెళ్లి వచ్చే వారికి బెస్ట్ ఆప్షన్. మరోవైపు, టాటా నెక్సాన్‌లో ఎక్కువ పవర్, భారీ బాడీ ఉండటం వల్ల మైలేజ్ కొంచెం తక్కువగా ఇస్తుంది. అయినప్పటికీ, లాంగ్ జర్నీ చేసే వారికి నెక్సాన్ డీజిల్, CNG వేరియంట్లు చాలా ప్రయోజనకరంగా భావిస్తారు.

Frequently Asked Questions

టాటా నెక్సాన్ మరియు నిస్సాన్ మాగ్నైట్ మధ్య ఏది తక్కువ ధరకు లభిస్తుంది?

నిస్సాన్ మాగ్నైట్ టాటా నెక్సాన్ కంటే తక్కువ ధరలో లభిస్తుంది. మాగ్నైట్ ప్రారంభ ధర ₹5.65 లక్షలు కాగా, నెక్సాన్ ధర ₹7.37 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

టాటా నెక్సాన్ లో ఎలాంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి?

నెక్సాన్ లో పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు మరియు JBL సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ విషయంలో టాటా నెక్సాన్ ఎలా ఉంది?

టాటా నెక్సాన్ గ్లోబల్ NCAP మరియు భారత్ NCAP రెండింటిలోనూ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS వంటి అనేక ఆధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

నగర ప్రయాణాలకు ఏ కారు మరింత అనుకూలంగా ఉంటుంది?

సిటీ ట్రాఫిక్‌లో నిస్సాన్ మాగ్నైట్ డ్రైవ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది మరియు దీని CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. అలాగే, మాగ్నైట్ మంచి మైలేజ్ కూడా ఇస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hybrid SUV: 1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
Car Coolant: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
Top Car Exports From India 2026: భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా? 
భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా?
Alloy Wheel or Steel Wheel: అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!
అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget