అన్వేషించండి

Mahindra BE6 Discount: మహీంద్రా ఈవీపై రూ.2 లక్షల భారీ డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి

మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ SUVపై మే నెలలో రూ. 2 లక్షల వరకు భారీ డిస్కౌంట్ లభిస్తుండటంతో దీనికి మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరిగింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • BE 6 అమ్మకాలు 113% పెరిగి, పోటీని తీవ్రతరం చేశాయి.

మీరు సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (SUV) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మార్కెట్లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న మహీంద్రా BE 6 మోడల్ వివరాలు తెలుసుకోండి. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా మే 2026 నెలకు గానూ ఈ బీఈ 6 కారుపై బంపర్ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, అదిరిపోయే రేంజ్‌తో యువతతో పాటు ఫ్యామిలీ కస్టమర్లను సైతం మహీంద్రా ఈవీ (EV) ఆకట్టుకుంటోంది.

రూ. 2 లక్షల వరకు తగ్గింపు ఆఫర్
ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు మహీంద్రా ఆఫర్లతో ముందుకు వచ్చింది. మహీంద్రా BE 6 కి చెందిన MY2025 మోడళ్లపై ప్రస్తుతం దాదాపు 2 లక్షల రూపాయల వరకు భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. అయితే, ఈ ఆఫర్ పరిమిత స్టాక్‌కు మాత్రమే వర్తిస్తుందని సమాచారం. నగరాలు, డీలర్‌షిప్‌లను బట్టి ఈ తగ్గింపు ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఒకవేళ డీలర్ల వద్ద కొత్త MY2026 స్టాక్ ఉంటే ఈ ఆఫర్ వర్తించకపోవచ్చు. కనుక కొనుగోలుకు ముందే స్థానిక డీలర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని బెనిఫిట్స్ పొందాలి. 

మహీంద్రా బీఈ 6 ధర, డిజైన్ 
మహీంద్రా BE 6 ప్రారంభ ధర సుమారు రూ. 18.90 లక్షల నుండి మొదలై టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 26.90 లక్షల వరకు ఉంది. దీని స్పోర్టీ, ఫ్యూచరిస్టిక్ లుక్ రోడ్డుపై వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మోడ్రన్ ఎల్‌ఈడీ (LED) లైటింగ్, ఏరోడైనమిక్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్స్ ఈ కారుకు లగ్జరీ లుక్‌ను ఇస్తున్నాయి. 

Also Read: Five Best Electric SUVs: పెట్రోల్ డీజిల్ ధరల సెగ-  మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే

బ్యాటరీ సామర్థ్యం, మైలేజీ రేంజ్
ఈ మహీంద్రా ఎస్‌యూవీలో కస్టమర్ల కోసం 59 kWh, 79 kWh సామర్థ్యం గల రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. ఇందులో ఉండే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 683 కిలోమీటర్ల రేంజ్ వరకు హాయిగా దూసుకెళ్లవచ్చు అని కంపెనీ చెబుతోంది. లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడం ప్లస్ పాయింట్.

నెక్స్ట్ లెవెల్ హైటెక్ ఫీచర్లు
ఫీచర్ల పరంగా మహీంద్రా BE 6 లో ఎక్కడా రాజీ పడలేదు. 

పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే

వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే

360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు

హెడ్-అప్ డిస్‌ప్లే

సేఫ్టీ ఫీచర్లు: లెవెల్-2 ADAS టెక్నాలజీ, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటి మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Read Also: Top 5 Hybrid Cars Mileage: ఆఫీసుకు వెళ్లేవారికి అద్భుతమైన మైలేజ్ ఇచ్చే టాప్ 5 హైబ్రిడ్ కార్లు ఇవే

మార్కెట్లో పెరిగిన డిమాండ్.. ఆ కార్లకు గట్టి పోటీ
భారత ఆటో మార్కెట్లో ఈ కారుకు ఆదరణ పెరుగుతోంది. ఏప్రిల్ 2026 సేల్స్ రిపోర్ట్ ప్రకారం.. BE 6 అమ్మకాల్లో ఏకంగా 113 శాతం వృద్ధి నమోదు చేసింది.  భారత్‌లో వాహనదారులు ఎలక్ట్రిక్ కార్ల వైపు ఎంతలా మొగ్గు చూపుతున్నారని ఇది రుజువు చేసింది. ప్రస్తుత మార్కెట్లో ఈ మోడల్.. టాటా కర్వ్ EV, మారుతి ఈ-విటారాతో పాటు హ్యుందాయ్ క్రెటా EV వంటి కార్లకు గట్టి పోటీని ఇస్తోంది.

Frequently Asked Questions

మహీంద్రా BE 6 ఏయే కార్లకు పోటీ ఇస్తోంది?

ప్రస్తుత మార్కెట్లో ఈ మోడల్ టాటా కర్వ్ EV, మారుతి ఈ-విటారాతో పాటు హ్యుందాయ్ క్రెటా EV వంటి కార్లకు గట్టి పోటీని ఇస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ducati Monster V2 vs Triumph Street Triple 765 RS - 111hp vs 130hp.. ధర, పవర్, టార్క్‌లో ఏది బెస్ట్?
ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ 765 RS vs డుకాటి మాన్‌స్టర్‌ V2 - రేటు రూ.1 లక్ష తక్కువైనా 'పవర్‌'లో అదరగొడుతోంది!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Embed widget