అన్వేషించండి

New FASTag Category Planned: టోల్ మిన‌హాయించిన‌ వాహనాల కోసం కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కేటగిరీ - కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్

టోల్ మినహాయింపు ఉన్న రక్షణ, పోలీస్ వాహనాల కోసం కేంద్ర ప్రభుత్వం మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో సిస్టమ్ కింద ప్రత్యేక ఫాస్ట్‌ట్యాగ్ కేటగిరీని తీసుకువస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టోల్ మినహాయింపు వాహనాలకు కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కేటగిరీ ప్రవేశపెడుతున్నారు.
  • MLFF టోలింగ్‌లో ప్రభుత్వ వాహనాల సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తుంది.
  • ప్రత్యేక ట్యాగ్‌లు వాహనాలకు టోల్‌ ఛార్జీలు, చలాన్‌లు రాకుండా చేస్తాయి.
  • రెండు ప్రత్యామ్నాయాల ద్వారా ఈ కొత్త విధానం అమలు చేయనున్నారు.

New FASTag Category Planned For Toll Exempt Vehicles: దేశవ్యాప్తంగా మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోలింగ్ విధానాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో టోల్ మినహాయింపు పొందిన వాహనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త కేటగిరీ ఫాస్ట్‌ట్యాగ్‌ను రూపొందించడానికి ప్లాన్ చేస్తోంది. తాజా నివేదిక ప్రకారం పూర్తిగా ఆటోమేటెడ్, బారియర్ రహిత టోల్ వసూళ్ల ప్రక్రియలో రక్షణ, పోలీస్, ఇతర ప్రభుత్వ వాహనాలకు ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కొన్ని ప్రభుత్వ రంగ వాహనాలకు టోల్ ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది. అయితే కొత్త ఆటోమేటెడ్ విధానం వల్ల ఆయా వాహనాలకు ఇబ్బందులు కలగకుండా చూడటానికి ఈ కొత్త సిస్టమ్‌ను డిజైన్ చేస్తున్నారు.

Read Also: పెరిగిన CNG ధరలు.. Tata Punch, Maruti Swift కార్లలో ఫుల్ ట్యాంక్‌కు ఎంత ఖర్చవుతుంది? 

కొత్త టెక్నాలజీతో బారియర్ లెస్ టోల్ వసూళ్లు

ప్రస్తుత మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) విధానంలో టోల్ ఫీజులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), శాటిలైట్ ఆధారిత ట్రాకింగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) టెక్నాలజీ సహాయంతో డిజిటల్ పద్ధతిలో వసూలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగకుండానే చాలా వేగంగా వెళ్ళిపోవచ్చు. సాధారణ ప్యాసింజర్ కార్లు, కమర్షియల్ వాహనాలకు ఈ సిస్టమ్ బాగానే పనిచేస్తున్నప్పటికీ సాయుధ దళాలు, పారామిలటరీ, పోలీస్ శాఖలు ఉపయోగించే టోల్ మినహాయింపు వాహనాలకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ రకమైన స్పెషల్ వాహనాలు సిస్టమ్‌లో సరిగ్గా రిజిస్టర్ కాకపోతే లేదా టెక్నాలజీ వాటిని గుర్తించలేకపోతే పొరపాటున టోల్ ఛార్జీలు కట్ అవ్వడం లేదా ఈ-చలాన్లు జనరేట్ అవ్వడం లాంటివి జరుగుతున్నాయి.

Read Also: Honda City Facelift: హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ సరికొత్త లుక్ - డీలర్‌షిప్స్‌లో సందడి చేస్తున్న లగ్జరీ సెడాన్ కార్

రక్షణ వాహనాల కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్యాగ్ ..

ఈ సమస్యకు పరిష్కారంగా టోల్ మినహాయింపు వాహనాల కోసం ప్రత్యేకంగా కాన్ఫిగర్ చేసిన ఫాస్ట్‌ట్యాగ్ కేటగిరీని తీసుకురానున్నారు. ఈ స్పెషల్ ట్యాగ్‌లు ఉండటం వల్ల రక్షణ సంస్థలు, కొన్ని ఎంపిక చేసిన ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అధికారిక వాహనాలు ఎలాంటి టోల్ డిడక్షన్ లేదా వయలేషన్ నోటీసులు లేకుండానే ఆటోమేటెడ్ లేన్ల ద్వారా సులువుగా ప్రయాణించవచ్చు. ఆర్మీకి చెందిన అధికారిక మిలిటరీ వాహనాలకు కొన్నిసార్లు ఫాస్ట్‌ట్యాగ్ కూడా అవసరం లేని విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సిస్టమ్ నేరుగా డిఫెన్స్ నంబర్ ప్లేట్లను గుర్తించి, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ వాహనాల కదలికల డేటాను వెంటనే డిలీట్ చేసేలా డిజైన్ చేస్తున్నారు.

 

రెండు రకాల ప్రత్యామ్నాయాలపై ..

ప్రస్తుతం ఈ సరికొత్త విధానాన్ని అమలు చేయడానికి రెండు రకాల ఆప్షన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొదటి ఆప్షన్ ప్రకారం అధికారిక విధుల్లో ఉండే ప్రైవేట్ వాహనాల వివరాలను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తో షేర్ చేయడం లేదా వాటికి అపరిమిత ఉచిత ప్రయాణ సదుపాయం ఉండేలా ప్రత్యేక ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేయడం. రెండో ఆప్షన్ ప్రకారం ఈ వాహనాలు సాధారణ ఫాస్ట్‌ట్యాగ్‌లనే వాడుతాయి, టోల్ ఫీజు ముందుగానే కట్ అవుతుంది. ఆ తర్వాత ఆయా ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లు ఆ మొత్తాన్ని తిరిగి రీఇంబర్స్ చేస్తాయి. ఇప్పటికే రక్షణ, పోలీస్, పారామిలటరీ వాహనాల డేటాబేస్‌ను టోల్ సిస్టమ్స్‌తో అనుసంధానిస్తూ కొన్ని పైలట్ ప్రాజెక్ట్‌లను కూడా విజయవంతంగా నిర్వహించారు.  

Frequently Asked Questions

టోల్ మినహాయింపు వాహనాల కోసం కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కేటగిరీ ఎందుకు తీసుకువస్తున్నారు?

దేశవ్యాప్తంగా మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోలింగ్ విధానంలో రక్షణ, పోలీస్, ఇతర ప్రభుత్వ వాహనాలకు ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం.

కొత్త MLFF టోలింగ్ విధానంలో ఏ టెక్నాలజీలు ఉపయోగిస్తున్నారు?

ప్రస్తుత MLFF విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), శాటిలైట్ ఆధారిత ట్రాకింగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు.

కొత్త స్పెషల్ ఫాస్ట్‌ట్యాగ్‌లు ఎలా పనిచేస్తాయి?

ఈ స్పెషల్ ట్యాగ్‌లు ఉండటం వల్ల ప్రభుత్వ అధికారిక వాహనాలు ఎలాంటి టోల్ డిడక్షన్ లేదా వయలేషన్ నోటీసులు లేకుండానే ఆటోమేటెడ్ లేన్ల ద్వారా సులువుగా ప్రయాణించవచ్చు.

ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ఏ ఆప్షన్లను పరిశీలిస్తోంది?

ప్రభుత్వం రెండు ఆప్షన్లను పరిశీలిస్తోంది: 1) ప్రభుత్వ వాహన వివరాలను MoRTH తో షేర్ చేయడం లేదా ప్రత్యేక ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ చేయడం. 2) సాధారణ ఫాస్ట్‌ట్యాగ్‌లను వాడి, టోల్ ఫీజును తిరిగి రీఇంబర్స్ చేయడం.

టాప్ హెడ్ లైన్స్

WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
Toyota Glanza కొనేవాళ్లకు బోలెడన్ని EMI ఆఫర్లు.. రూ.1.60 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే చాలు!
Toyota Glanza కొనడం ఇప్పుడు చాలా సులభం, నెలకు రూ.10,000 కూడా అవసరం లేదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Telangana Governor Quota MLC: తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
SIR Astrological Analysis: ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
Embed widget