అన్వేషించండి

పెరిగిన CNG ధరలు.. Tata Punch, Maruti Swift కార్లలో ఫుల్ ట్యాంక్‌కు ఎంత ఖర్చవుతుంది?

CNG Price Hike: భారత్‌లో ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే.. మరోవైపు సీఎన్జీ ధరలు సైతం చుక్కలు చూపిస్తున్నాయి. దాంతో నగరాల్లో సిఎన్జీ వాహనదారుల ఖర్చులు పెరగనున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఢిల్లీ-NCR సహా అనేక నగరాల్లో CNG ధరలు పెరిగాయి.
  • ఢిల్లీలో CNG కిలో 80.09 రూపాయలకు, నోయిడాలో 88.70కి చేరింది.
  • అంతర్జాతీయ మార్కెట్, డాలర్ విలువ వల్ల ధరల పెరుగుదల ఉంది.
  • Tata Punch, Maruti Swift CNG కార్ల నడిపే ఖర్చు పెరిగింది.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న క్రమంలో చాలా మంది CNG కార్లకు షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారు. వాస్తవానికి పెట్రోల్, డీజిల్‌తో పోల్చితే సీఎన్జీ చవకైన, ఆర్థికపరంగా బెస్ట్ ఎంపికగా భావిస్తారు. అయితే, ఇప్పుడు CNG వాహనదారులు సైతం ధరల పెంపు వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ-NCRతో సహా అనేక నగరాల్లో CNG ధరలు పెరుగుతున్నాయి. దీనివల్ల రోజువారీ ప్రయాణించే వారి ఖర్చు వల్ల నెలవారీ బడ్జెట్ దెబ్బతింటుంది. ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారిపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది.

ఢిల్లీలో ఇప్పుడు CNG ధర కిలో 80.09 రూపాయలకు చేరింది. హైదరాబాద్‌లో కేజీ సీఎన్జీ ధర రూ.97 అయింది. నోయిడా , గాజియాబాద్ లలో  కిలో ధర 88.70 రూపాయలకు చేరుకుంది. గురుగ్రామ్‌లో CNG కిలో రూ.85.12 కు విక్రయిస్తున్నారు. దీంతో పాటు మీరట్, ముజఫర్‌నగర్, షామ్లీ, ఇతర నగరాల్లోనూ ధరలు పెరిగాయి. గత మూడు రోజుల్లో CNG ధర పెరగడం ఇది రెండోసారి. ఇంతకుముందు కిలోకు రూ. 2 చొప్పున పెంచారు.

Tata Punch CNG మైలేజ్ ఎంత?

Tata Punch CNG కస్టమర్ల ఆధరణ పొందిన ఒక ఫేమస్ కారు. ఇది ARAI ప్రకారం ఒక కేజీకి దాదాపు 22.99 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుత CNG ధర కిలో 80.09 రూపాయలు కనుక ఈ కారు డ్రైవింగ్‌కు ఖర్చు దాదాపు కిలోమీటరుకు 3.48 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్‌లో అయితే 4 రూపాయలకు పైగా ఉంది. టాటా పంచ్ CNG ట్యాంక్ దాదాపు 60 లీటర్లు, ఇందులో దాదాపు 10 కిలోల CNG వస్తుంది కనుక ఒకసారి ట్యాంక్ నింపడానికి దాదాపు రూ.970 వరకు ఖర్చవుతుంది.

Also Read: Tata Nexon లేదా Nissan Magnite .. ధర, మైలేజ్, ఫీచర్ల పరంగా ఏ కారు కొనడం మంచిది?

మారుతి స్విఫ్ట్ సీఎన్జీ మైలేజీ (Maruti Swift CNG Mileage)

Maruti Suzuki Swift CNG కూడా కస్టమర్ల నమ్మకాన్ని పొందిన కారు. ఇందులో 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. దీని మైలేజ్ మాన్యువల్ వెర్షన్‌లో దాదాపు 32.85 కిలోమీటర్లు/కిలో CNG వరకు ఉంటుంది. కొత్త CNG ధర ప్రకారం, హైదరాబాద్‌లో ఈ కారు నడపడానికి కిలోమీటరుకు 4 రూపాయలు అవుతుంది. ఢిల్లీలో అయితే దాదాపు 2.44 రూపాయలు ఖర్చవుతుంది. ఈ కారు CNG ట్యాంక్ దాదాపు 55 లీటర్లు. ఇందులో సాధారణంగా 7 నుండి 9 కిలోల CNG ఫిట్ చేస్తారు. కనుక ఒకసారి సీఎన్జీ ట్యాంక్ నింపడానికి దాదాపు 870 రూపాయల వరకు ఖర్చవుతుంది.

ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం. దాంతో సహజ వాయువు వ్యయం పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు అమెరికన్ డాలర్ బలపడటం వల్ల గ్యాస్ దిగుమతి చేసుకోవడం పలు దేశాలతో పాటు భారత్‌కు సైతం ఖరీదుగా మారుతోంది. అందుకే IGL CNG ధరలను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. పెరుగుతున్న ఖర్చులను కొంతవరకు బ్యాలెన్స్ చేయడానికి ధరల స్వల్ప పెంపుదల చేసినట్లు కంపెనీలు చెబుతున్నాయి. 

Read Also: Mahindra BE6 Discount: మహీంద్రా ఈవీపై రూ.2 లక్షల భారీ డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి 

 

 

Frequently Asked Questions

CNG ధరలు ఎందుకు పెరిగాయి?

అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధరలు పెరగడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, మరియు అమెరికన్ డాలర్ బలపడటం వల్ల గ్యాస్ దిగుమతి ఖర్చు పెరిగింది. పెరుగుతున్న ఖర్చులను సమతుల్యం చేయడానికి IGL CNG ధరలను పెంచింది.

ఢిల్లీలో CNG ధర ఎంత ఉంది?

ఢిల్లీలో ప్రస్తుతం CNG ధర కిలో 80.09 రూపాయలకు చేరుకుంది.

Tata Punch CNG మైలేజ్ ఎంత?

Tata Punch CNG ARAI ప్రకారం దాదాపు 22.99 కిలోమీటర్లు/కిలో మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుత ధరల ప్రకారం కిలోమీటరుకు 3.48 రూపాయలు ఖర్చవుతుంది.

Maruti Swift CNG మైలేజ్ ఎంత?

Maruti Swift CNG మాన్యువల్ వెర్షన్‌లో దాదాపు 32.85 కిలోమీటర్లు/కిలో మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుత ధరల ప్రకారం కిలోమీటరుకు 2.44 రూపాయలు ఖర్చవుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?
BE 6 రేసింగ్‌ లుక్‌ను పక్కన పెట్టిన మహీంద్రా.. త్రివర్ణాలు, 540 డిగ్రీల కెమెరాతో కొత్త 'ఫ్రీడమ్‌ ఎడిషన్‌'
ఆగస్టు 15 సందర్భంగా మహీంద్రా BE 6కు కొత్త లుక్‌.. ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో ప్రత్యేక మార్పులు!
స్కార్పియో ఎన్‌ కంటే రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్స్‌.. మహీంద్రా కొత్త లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌ వచ్చేసింది!
మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌.. టయోటా, ఇసుజుకి స్ట్రాంగ్‌ కాంపిటీషన్‌!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget