అన్వేషించండి

FASTag Recharge Methods: ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ విధానాలు - హైవే ప్రయాణాన్ని మరింత సులభం చేసే టిప్స్ ..

హైవేలపై ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ చేసే వివిధ పద్ధతులు ఇంకా కొత్తగా వచ్చిన వార్షిక పాస్ వివరాల గురించి ఇప్పుడు డీటైల్డ్ గా తెలుసుకుందాం.

Complete Guide to FASTag Recharge Methods and Annual Pass: ఇండియాలో రోడ్డు నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది. దీనికి తోడు బారియర్-ఫ్రీ టోల్ ప్లాజాల రాకతో ఫాస్ట్‌ట్యాగ్ ప్రాముఖ్యత మరింత పెరిగింది. టోల్ ప్లాజాల వద్ద తక్కువ బ్యాలెన్స్ ఉంటే భారీ జరిమానాలు లేదా డబుల్ టోల్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, రీఛార్జ్ చేయడం చాలా ముఖ్యం. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ ద్వారా పనిచేసే ఈ విధానం వల్ల టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండానే డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాకుండా క్యాష్ ఇచ్చే ఇబ్బంది తప్పుతుంది.

Also Read: Toyota Starlet Safety Test: క్రాష్ టెస్టులో అట్ట‌ర్ ప్లాఫ్ అయిన‌ టయోటా స్టార్లెట్:  రేటింగ్ తెలిస్తే షాకే..!

రీఛార్జ్ చేయడానికి సులభమైన పద్ధతులు..

ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎమ్ లేదా భీమ్ వంటి యూపీఐ (UPI) యాప్స్ ద్వారా నిమిషాల్లో ఈ పని పూర్తి చేయవచ్చు. మీ యాప్‌లో ఫాస్ట్‌ట్యాగ్ సెక్షన్‌లోకి వెళ్లి వెహికల్ నంబర్ ఎంటర్ చేసి పేమెంట్ చేయడమే. అలాగే ఫాస్ట్‌ట్యాగ్ మీద ఉండే క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి కూడా మనీ యాడ్ చేయవచ్చు. ఒకవేళ మీరు బ్యాంక్ ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ తీసుకుంటే సదరు బ్యాంక్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అయ్యి నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. దీనికోసం ఎన్ హెచ్ఏఐ (NHAI) ప్రత్యేకంగా మైఫాస్ట్‌ట్యాగ్ (MyFASTag) యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.

 

Also Read: Shah Rukh Khan Cadillac Escalade: షారుఖ్ ఖాన్ గ్యారేజీలోకి కొత్త లగ్జరీ కారు - ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న అమెరికన్ బీస్ట్!

బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా?

టోల్ ప్లాజా వద్దకు వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందే బ్యాలెన్స్ చూసుకోవడం మంచిది. ప్రతిసారి టోల్ దగ్గర డబ్బులు కట్ అయినప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎమ్ఎస్ (SMS) వస్తుంది, అందులో మిగిలిన బ్యాలెన్స్ వివరాలు ఉంటాయి. అది కాకుండా మైఫాస్ట్‌ట్యాగ్ యాప్‌లో మీ పూర్తి ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసుకోవచ్చు. ఒకవేళ బ్యాలెన్స్ తక్కువగా ఉంటే బ్లాక్‌లిస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రయాణానికి ముందే మీ బ్యాంక్ లేదా వాలెట్ యాప్‌లో బ్యాలెన్స్ సరిచూసుకోవడం ఉత్తమం. నిరంతరం ప్రయాణించే వారికి ఇది ఒక మంచి అలవాటుగా మారుతుంది.

ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ ప్రయోజనాలు..

తరచుగా ప్రయాణాలు చేసే వారి కోసం ప్రభుత్వం 'ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్' (Annual Pass) సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ప్రతిసారి రీఛార్జ్ చేసే తలనొప్పి లేకుండా ఏడాదికి ఒకేసారి పేమెంట్ చేయవచ్చు. ప్రైవేట్ కార్లు, జీపులు ఇంకా వ్యాన్ల కోసం ఈ పాస్ అందుబాటులో ఉంది. గత ఏడాది దీని ధర రూ. 3,000 ఉండగా, ఇప్పుడు స్వల్పంగా పెరిగి రూ. 3,075 కి చేరింది. ఈ పాస్ తీసుకుంటే ఒక ఏడాదిలోపు లేదా 200 సార్లు టోల్ క్రాసింగ్స్ వరకు వాడుకోవచ్చు. దీన్ని పొందడం కోసం రాజమార్గ యాత్రా యాప్ లేదా సంబంధిత వెబ్‌సైట్‌లో కార్ వివరాలు, ఫాస్ట్‌ట్యాగ్ ఐడీ ఇచ్చి పేమెంట్ చేయాలి. ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక మీ పాత ఫాస్ట్‌ట్యాగ్ ఐడీకే ఈ పాస్ కనెక్ట్ అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

2026 మారుతి బలెనోలో ఏం మారింది? ఇంజిన్ పవర్‌, మైలేజ్‌, ఫీచర్లు పెరిగాయా, తగ్గాయా?
పాత బలెనోకు కొత్త బలెనోకు తేడా ఇదే.. కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
నెలకు కేవలం రూ.10 వేలతో ఎలక్ట్రిక్‌ కారు సొంతం - పెట్రోల్ భారం నుండి విముక్తి పొందే ఐడియా
కేవలం రూ.10,000 EMIతో కొనగలిగే బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు! పెట్రోల్‌ బిల్లుకు చెప్పండి గుడ్‌బై!
రూ.లక్ష లోపులో వచ్చే బజాజ్ బైక్‌లు, స్కూటర్లు.. ఈ 8 టూవీలర్లలో ఒకటి ఎంచుకోవచ్చు!
డైలీ జర్నీ నుంచి స్పోర్టీ రైడ్ వరకు.. రూ.లక్షలోపే వచ్చే ఈ బజాజ్ బైక్స్‌పై ఓ లుక్కేయండి!
398cc Triumph Scrambler 400 X: నెలకు రూ.6600 కడితే ఈ బైక్ మీదే! డౌన్‌పేమెంట్‌, ఈజీ EMI ప్లాన్స్‌ ఇవే!
Triumph Scrambler 400 X: రూ.3.15 లక్షల అడ్వెంచర్ బైక్‌ కేవలం రూ.6600 EMIతో మీ సొంతమవుతుంది!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Buses To Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
IND VS AFG 1st T20 Result Update: అభిషేక్ వీర‌విహారం.. 22 బంతుల్లోనే ఫిఫ్టీ.. ఆఫ్గాన్ పై టీమిండియా బంప‌ర్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన ఇషాన్, అర్ష‌దీప్
అభిషేక్ ఊచకోత.. 22 బంతుల్లోనే ఫిఫ్టీ.. ఆఫ్గాన్ పై టీమిండియా బంప‌ర్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన ఇషాన్, అర్ష‌దీప్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
Arvind Kejriwal: గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
18th BRICS Summit: ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
2026 మారుతి బలెనోలో ఏం మారింది? ఇంజిన్ పవర్‌, మైలేజ్‌, ఫీచర్లు పెరిగాయా, తగ్గాయా?
పాత బలెనోకు కొత్త బలెనోకు తేడా ఇదే.. కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
Embed widget