అన్వేషించండి

Aviation Fuel Crisis: విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే..

హైదరాబాద్ నుంచి ఢిల్లీ విమానం ఎన్ని వేల లీటర్ల ఇంధనం తాగుతుందో తెలుసా? ఓ భారీ బోయింగ్ ఫ్లయిట్  టేకాఫ్ అయ్యే టైమ్‌లో తీసుకునే ఇంధనంతో మనం ఓ SUVలో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లి తిరిగిరావొచ్చు

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతల కారణంగా విమాన ఇంధన ధరలు పెరిగాయి.
  • విమానాలకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) వినియోగిస్తారు, ధరలు మారతాయి.
  • హైదరాబాద్-ఢిల్లీ విమానానికి సుమారు ₹6-7 లక్షల ఇంధన ఖర్చు అవుతుంది.
  • పెద్ద విమానాలు, అంతర్జాతీయ ప్రయాణాలకు ఇంధన ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది.

Aviation Fuel Prices: హైదరాబాద్ నుంచి మనం ఢిల్లీకి విమానంలో వెళ్లామంటే.. మనకు కేవలం రెండు గంటల ప్రయాణం, ఒక చిన్న స్నాక్, సురక్షితమైన ల్యాండింగ్ మాత్రమే కనిపిస్తాయి. కానీ, ప్రతి టేకాఫ్ వెనుక వేల లీటర్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF), దాని ఆపరేషన్, సప్లై చెయిన్.. దానిని మెయింటెయిన్‌ చేసే అంతర్జాతీయ రాజకీయాల స్టోరీ కూడా ఉంటుంది. 

మన బడ్డెట్ బైక్ 50కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.. కారు 15-20 కిలోమీటర్లు వస్తుంది. వాటికి అయ్యే ఖర్చు కూడా మనకు తెలుసు. కానీ విమానానికి ఫ్యూయల్ ఖర్చు ఎంతో తెలుసా..? 

అది విమానం సైజ్, దూరం, ప్రాంతంను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' వద్ద అంతరాయాలు గ్లోబల్ జెట్ ఫ్యూయల్ ధరలను ఆకాశానికి తాకించాయి. దీంతో విమానయాన సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 

కమర్షియల్ విమానాలు పెట్రోల్ లేదా డీజిల్‌తో నడవవు. అవి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) అనే ప్రత్యేక ఇంధనాన్ని ఉపయోగిస్తాయి. ఇది కిరోసిన్ ఆధారిత అత్యంత శుద్ధి చేసిన ఇంధనం. ఇది కూడా ముడిచమురు నుంచి వచ్చే ఓ బై ప్రోడక్ట్. ప్రపంచ ముడి చమురు ధరల్లో ఒడిదుడుకుల వల్ల భారత్‌లో ATF ధరలు చారిత్రక స్థాయికి చేరుకున్నాయి. ఈ ఫ్యూయల్‌ పై GST కాకుండా VAT ఉంటుంది. కాబట్టి ఒక్కో సిటీలో ఒక్కో ధర ఉంటుంది. యావరేజ్‌గా చూస్తే.. విమాన ఇంధనం.. కిలోలీటర్‌కు 1 లక్షా 5వేల నుంచి 1 లక్షా 20వేల వరకూ ఉంటుంది. . మన చమురు సంస్థలు  IOC,BPCL, HP వంటివి దీనిని విమానయాన సంస్థలకు సరఫరా చేస్తాయి. దాదాపు ప్రతీ పెద్ద ఎయిర్‌పోర్టుకు పైపులైన్ల ద్వారా పంపిస్తారు. చిన్న చిన్న ఎయిర్‌పోర్టులు ఉన్న దగ్గరకు ట్యాంకర్లలో వెళుతుంది. 

ATF ఎందుకు వాడతారంటే?

* అత్యంత ఎత్తులో ఉండే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా ఇది గడ్డకట్టదు.
* ఎక్కువ శక్తిని ఇచ్చే సామర్థ్యం (Energy Density) ఉంటుంది.
* ప్రయాణాల్లో అగ్నిప్రమాద ముప్పును తగ్గిస్తుంది.


Aviation Fuel Crisis: విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే..

హైదరాబాద్ – ఢిల్లీ ఫ్లైట్: ఎంత ఇంధనం ఖర్చవుతుంది?

హైదరాబాద్ నుంచి ఢిల్లీ మధ్య దూరం సుమారు 1,250 కిలోమీటర్లు. ఈ రూట్‌లో ఎక్కువుగా విమానాలను నడిపే ఇండిగో- Indigo,  ఎయిర్ ఇండియా Air India సాధారణంగా ఎయిర్‌బస్ A320neo లేదా బోయింగ్ 737 విమానాలను ఉపయోగిస్తాయి.

ఈ ఫ్లెయిట్‌లకు గంటకు ఇంధన వినియోగం  2,300 – 2,700 లీటర్లు ఉంటుంది. ఈ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 2 నుంచి... 2.5గంటలు.. అంటే షుమారుగా  5000 నుంచి 6500 లీటర్ల ఇంధనం వినియోగం అవుతుంది.  కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వ్ ఫ్యూయల్‌తో కలిపి 7,000+ లీటర్లను నింపుతారు. అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు  6,000 లీటర్ల వినియోగం అనుకుంటే..లీటర్ ATF ధర సుమారు ₹105 వేసుకున్నా...  ఒక్క ప్రయాణానికి దాదాపు 6  లక్షల నుండి 7 లక్షల రూపాయల బిల్లు అవుతుంది. అంటే విమానంలో ఉండే సీట్లను బట్టి ఒక్కక్కరిపైన ఎంత ఖర్చు అవుతుందో అర్థమవుతుంది

అంతర్జాతీయ విమానం లెక్కలు వేరు: హైదరాబాద్ -దుబయ్ అయితే..?

డొమెస్టిక్ ఫ్లైట్స్‌తో పోలిస్తే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లెక్కలు పూర్తిగా వేరుగా ఉంటాయి. విమానం పరిమాణం పెరిగేకొద్దీ, ప్రయాణ దూరం పెరిగేకొద్దీ ఇంధన వినియోగం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఒకవేళ మనం హైదరాబాద్ - దుబాయ్ ప్రయాణాన్ని విశ్లేషిస్తే.. మన ఇండియన్ ఫ్లెయిట్‌ల విషయంలో దూరాన్ని బట్టి దానికి తగ్గట్లుగా రేటు మారుతుంది. అంటే ఇండిగో, ఎయిర్‌ఇండియా దుబయ్‌కు కూడా దేశీయంగా తిరిగే చిన్న విమానాలనే వాడతాయి. హైదరాబాద్ నుంచి చూస్తే.. దుబయ్ ఢిల్లీ కంటే రెట్టింపు దూరం.. అంటే ఫ్యూయల్ ఖర్చు 12లక్షల నుంచి 14 లక్షల వరకూ ఉంటుంది. 

ఎయిర్‌బస్ నియో లాంటి చిన్న విమానాలకు అయితే ఈ లెక్క ఉంటుంది. కానీ వైడ్‌ బాడీ (Giant) విమానాల లెక్కలు వేరే.. Etihad,  Emirates వంటి ఎయిర్‌లైన్స్ పెద్ద జంబో విమానాలను వాడతాయి.  Boeing 777/Airbus A350 వంటి భారీ విమానాల్లో ఇంధన వినియోగం చాలా ఎక్కువుగా ఉంటుంది. ఇవి నార్మల్ విమానాల కంటే మూడు రెట్లు ఇంధనాన్ని వినియోగిస్తాయి. వీటి సైజ్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. కొన్ని విమానాలు రెండు అంతస్థులు ఉంటాయి. దాదాపు 300-400 మంది ప్రయాణికులు ఉంటారు. వారి భారీ లగేజ్ కూడా ఉంటుంది. ఇవి గంటకు 7500 నుంచి 8000 లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తాయి. అంటే హైదరాబాద్‌ నుంచి దుబయ్‌ వెళ్లడానికి అయ్యే ఖర్చు  30 నుంచి 36లక్షల రూపాయలు. అయితే అంతర్జాతీయ సర్వీసులకు విమాన ఫ్యూయల్‌పై టాక్స్ బెనిఫిట్ ఉంటుంది.అందుకని ఇంధన ఖర్చు కాస్త తగ్గుతుంది.

ఒక పెద్ద బోయింగ్ విమానం టేకాఫ్ అయ్యేందుకు తీసుకునే ఫ్యూయల్‌తో మనం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి ఓ మంచి SUVలో వెళ్లి రావొచ్చు. 


Aviation Fuel Crisis: విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే..

విమాన టికెట్ ఎక్కువ అందుకే..

మనం విమాన ప్రయాణానికి చాలా ఖర్చు అవుతుందనుకుంటాం కానీ.. నిజానికి విమాన సంస్థలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. అసలు విమానయానంలో ప్యూయల్‌కు ఖర్చు అయ్యేది 35-40 శాతం మాత్రమే. ఒక ఫ్లెయిట్ ఆపరేట్ చేయాలంటే.. కొన్ని వందల మంది విధులు నిర్వర్తిస్తారు. విమాన సంస్థలు పెట్టే కేపిటల్, నిర్వహణకోసం చేసే ఖర్చులు చాలా అధికం. విమానరంగంలో జీతాలు ఎక్కువ. ఎయిర్‌పోర్ట్ లో ఫ్లైయిట్‌ను నిలపడానికి అయ్యే పార్కింగ్ చార్జ్‌లు, ఎయిర్ పోర్ట్ డవలప్‌మెంట్ చార్జ్‌లు, ఇవన్నీ చాలా భారాన్ని వేస్తాయి.  
హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్ళే ఒక పెద్ద విమానం కేవలం ఇంధనం కోసమే సగటున ₹35 లక్షలు ఖర్చు చేస్తుందంటే, విమానయాన రంగం ఎంతటి రిస్క్‌తో కూడుకున్నదో అర్థం చేసుకోవచ్చు!

విమానంలో ప్రయాణించేప్పుడు మీకు ఏ హక్కులు ఉంటాయో తెలుసా..?

ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, చమురు మార్గాల్లో ఆటంకాలు ఏర్పడినా.. దాని ప్రభావం నేరుగా మీ విమాన టికెట్ ధరపై పడుతుంది. అందుకే, తదుపరిసారి టికెట్ రేట్లు పెరిగినప్పుడు దానికి కారణం కేవలం ఎయిర్‌పోర్ట్‌లో ఉండదు.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చమురు క్షేత్రాల్లో ఉంటుంది!

టాప్ హెడ్ లైన్స్

Tata Nexon EMI డీటెయిల్స్: రూ.లక్షన్నర డౌన్‌పేమెంట్‌తో ఇంటికి తీసుకెళ్ళండి - 7 ఏళ్ల EMI లెక్క ఇదిగో
ప్రీమియం లుక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లున్న Tata Nexonను లోన్‌పై కొంటే, EMI నెలకు రూ.12 వేల కంటే తక్కువే!
యంగ్‌స్టర్స్ ఫేవరెట్ Bajaj Pulsar 125 ఆన్-రోడ్ ధర, 3, 4, 5 ఏళ్ల EMI ఫుల్ క్యాలిక్యులేషన్
నెలకు రూ.2200 EMIతో కొత్త బజాజ్ పల్సర్ 125 కొనవచ్చా? డౌన్‌పేమెంట్‌ ఎంత కట్టాలి?
రూ.లక్ష లోపులో వచ్చే బజాజ్ బైక్‌లు, స్కూటర్లు.. ఈ 8 టూవీలర్లలో ఒకటి ఎంచుకోవచ్చు!
డైలీ జర్నీ నుంచి స్పోర్టీ రైడ్ వరకు.. రూ.లక్షలోపే వచ్చే ఈ బజాజ్ బైక్స్‌పై ఓ లుక్కేయండి!
2026 Bajaj Pulsar 125 రివ్యూ: కేవలం కమ్యూటర్ బైక్ కాదు.. కొత్త ఇంజిన్, కొత్త ఫ్రేమ్, కొత్త టెక్నాలజీ!
బజాజ్ పల్సర్ 125 రివ్యూ.. ధరకు తగ్గ బైక్ మాత్రమే కాదు, పాత బండితో పోలిస్తే భారీ మార్పులు!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
BRS Mock Assembly: బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?.. మాక్ అసెంబ్లీలో పల్లా, తలసాని సెటైర్లు
బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
DRLs అంటే ఏంటి? కార్లలో ఈ లైట్లు ఉండడం వల్ల డ్రైవింగ్‌ సమయంలో ఎంత ఉపయోగమో తెలుసా?
Car DRLs: కారు స్టార్ట్ చేయగానే ఈ లైట్లు వెలుగుతున్నాయా? వాటి అసలు పనేంటో తెలుసుకోండి!
Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
PUC Certificate: మీ వాహనానికి PUC ఉందా? లేదంటే రూ.10,000 వరకు ఫైన్.. ఇలా తప్పించుకోండి!
వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీ బండికి ఇది లేకపోతే భారీ జరిమానా, మీ జీతంలో చాలాభాగం కోల్పోతారు!
Embed widget