Airline Business In India: సొంత ఎయిర్లైన్స్ ప్రారంభించేందుకు ఖర్చు ఎంత? లైసెన్స్ నుండి విమానం వరకు ఎంత కావాలి
Indigo flights crisis | ప్రపంచంలో అత్యంత ఖరీదైన వ్యాపారాలలో విమానయాన రంగం ఒకటి. విమానాలు కొనడం, సిబ్బంది నియామకం, లైెసెన్స్ అన్నీ ఖర్చుతో కూడుకున్నవని తెలిసిందే.

Airline Business In India | న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. విమానాలు నడపలేక టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులను కష్టాల్లోకి నెట్టివేసింది. గత కొన్ని రోజుల నుంచి విమానాలు రద్దు చేస్తోంది. ఇండిగో డిసెంబర్ 5న దాదాపు 1000 కంటే ఎక్కువ విమాన సర్వీసులను రద్దు చేయడంతో దేశంలోని చాలా విమానాశ్రయాలలో గందరగోళం ఏర్పడింది. గత నాలుగు రోజుల్లో 1700 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి. ఈ సమస్య కొంతకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది.
ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకారం, డిసెంబర్ 6న కూడా ఇండిగో దాదాపు 1000 విమానాలను రద్దు చేసే అవకాశం ఉంది. ఇండిగో సిబ్బంది కొరత, సాంకేతిక నిర్వహణ కారణంగా ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్, కొచ్చి, హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం వంటి ప్రధాన నగరాల్లో వందలాది మంది ప్రయాణికులు విమానాల్లో చిక్కుకుపోయారు.
ఇండిగో సంక్షోభం సమయంలో తమ సొంత విమానయాన సంస్థను ప్రారంభిస్తే ఎంత ఖర్చు అవుతుంది. దాని లైసెన్సింగ్ ప్రక్రియ ఏమిటి, ఎంత ఖర్చు అవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. మీరు సొంత విమానయాన సంస్థను ప్రారంభించడం నుండి విమానం లైసెన్స్ వరకు ఖర్చు సహా దాని ప్రక్రియను ఇక్కడ తెలుసుకుందాం.
భారత్లో విమానయాన సంస్థను ప్రారంభించేందుకు ఖర్చు
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వ్యాపారాలలో ఒకటి విమానయాన రంగం. ఇందులో విమానాలను కొనడం లేదా లీజుకు తీసుకోవడం, సిబ్బంది నియామకం, టెక్నికల్ టీం, గ్రౌండ్ సెటప్, విమానాశ్రయ స్లాట్లు, నిర్వహణ, ఇంధన ఖర్చులు, DGCA నిబంధనలు వంటి ప్రతి స్థాయిలో భారీగా ఖర్చులుంటాయి. అందుకే విమానయాన సంస్థను ప్రారంభించడానికి ప్రారంభ పెట్టుబడి చాలా ఎక్కువ. ఇది ఆర్థికంగా స్థోమత కలిగిన కంపెనీలకు మాత్రమే సాధ్యం. భారతదేశ విమానయాన రంగం ప్రపంచంలో 9వ అతిపెద్ద బిజినెస్. ఇది సంవత్సరానికి GDPకి 18.32 లక్షల కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. విమానయాన సంస్థను ప్రారంభించడానికి కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి.
విమానయాన రంగంలో లైసెన్స్ ప్రక్రియ
భారతదేశంలో విమానయాన సంస్థను ప్రారంభించడానికి DGCA నుండి పలు ముఖ్యమైన అనుమతులు పొందాలి. ఇందులో ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్, సేఫ్టీ పర్మిషన్, పైలట్లు, సాంకేతిక సిబ్బంది అర్హత చెకింగ్, సేఫ్టీ ఆడిట్ వంటి ప్రక్రియలు ఉన్నాయి. ఈ మొత్తం ప్రక్రియ అనేక దశల్లో జరుగుతుంది. నిబంధనల ప్రకారం అన్ని సాంకేతిక అవసరాలు పూర్తి చేయాలి. ఈ ప్రక్రియకు దాదాపు 18 నెలల నుండి 3 సంవత్సరాలు పట్టవచ్చు. లైసెన్స్ పొందిన తర్వాత కూడా విమానయాన సంస్థ సేఫ్టీ, సర్వీసులను నిరంతరం నిర్వహించాలి.
విమానం తీసుకోవడానికి ఖర్చు ఎంత..
ఏదైనా విమానయాన సంస్థను ప్రారంభించడానికి అయ్యే అతిపెద్ద ఖర్చు విమానాలు కొనుగోలు చేయడం లేదా లీజుకయ్యే ఖర్చులు భరించడం. చాలా కంపెనీలు ప్రారంభంలో విమానాలను కొనుగోలు చేయడానికి బదులుగా మొదట్లో వాటిని లీజుకు తీసుకుంటాయి. ఒక విమానం ధర వంద కోట్ల రూపాయల పైగా ఉంటుంది. లీజుకు విమానం తీసుకున్నప్పటికీ, ప్రతి నెలా కోట్లలో భారీ మొత్తంలో చెల్లించాలి. నిర్వహణ, సాంకేతిక మద్దతు, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులు ఉన్నాయి. భారతదేశంలో విమానయాన సంస్థను ప్రారంభించడానికి, కనీసం 500 కోట్ల రూపాయల నుంచి రూ.1500 కోట్లు కావాలి. విమానయాన సంస్థ పరిమాణం, ప్రయాణ మార్గం, నడిపే సర్వీసులు, విమానాల సంఖ్య, వ్యాపార నమూనా ఆధారంగా కనీస పెట్టుబడి విలువ సైతం మారవచ్చు.






















